Wednesday, September 28, 2011

ఈ హింస భరించలేకున్నా


అమ్మా అమ్మోరు తల్లి!
ఈ హింస భరించలేకున్నానే
నీవే రక్ష
అన్నీ నీ భిక్ష
అని బ్రతుకుతుంటే
ఏమిటే ఈ శిక్ష?
నేను వేల సార్లు నిన్ను అర్థించాను
దుష్ఠ శిక్షణ నీవే చేసుకుని ఏడు
శిష్ఠ రక్ష్ణలో కావాలంటే నేను పాలు పంచుకుంటానని

మళ్ళీ మళ్ళీ నా దారిన ముళ్ళ కంపల్లాంటి మూర్ఖులే
అడ్డొస్తున్నారు
అడ్డు తొలగించవే

రామ క్రుష్ణ పరమహంస నిజంగానే నీ బిడ్డైతే
అతను చెప్పిన మాట నేను నిజంగానే సజ్జనుడైతే
మార్చవే నా పరిసరాలు

గొప్ప వారితో గొప్ప విషయాల పై
చర్చించి నేను మూర్ఖుడనైనా ఫర్వాలేదు గాని
ఈ మూర్ఖుల మూర్ఖత్వాన్ని కొలిచి నమోదు చేసే
దుస్థితిని మాత్రం ఏర్పరచకు

అమ్మా అమ్మోరు తల్లి!
నేను మరీ గొప్పవాడ్ని కానే
ఈ నీచులు పెట్టే నరకయాతనలు చూసి చూసి
తలంచి తలంచి
నేను నీచుడనైపోతానేమో?

ఆలోచించు!

సత్సంఘంతో నన్నాశీర్వదించు!
లేదా ఏకాంతాన్ని ప్రసాదించు
ఈ భావం గౌతమ భుద్దుడిదే అయ్యుండొచ్చు
కాని ఈ క్షణం నాకు నువ్వు ప్రసాదించవలసిన
తొట్ట తొలి వరము
లేదా నా బతుకే కాగలదు భారం

హే సర్వ శక్తి ప్రధాయినీ!
చాటవే ఆ భిరుదుకి
అర్హురాలివి నీవని!