Wednesday, October 17, 2012

శ్రీ దుర్గాష్టోత్తర శతనామావళి:

 ఓం దుర్గాయై నమ:
ఓం శివాయై నమ:
ఓం  మహాలక్ష్మ్యై నమ:
ఓం మహా గౌర్యై నమ:
ఓం  చండికాయై నమ:
ఓం సర్వజ్జాయై నమ:
ఓం  సర్వలోకోశ్యై నమ:
ఓం  సర్వ కర్మ ఫల ప్రదాయై నమ:  
ఓం  సర్వ తీర్థమయాయై నమ:
ఓం  పుణ్యాయైనమ:
ఓం  దేవయోనయే నమ:
ఓం అయోనిజాయై నమ:
ఓం భూమిజాయై నమ:
ఓం నిర్గుణాయై నమ:
ఓం ఆధార శక్త్యై నమ:
ఓం  అనీశ్వర్యై నమ:
ఓం నిర్గుణాయై నమ:
ఓం  నిరహంకారాయై నమ:
ఓం సర్వ గర్వ విమర్దిన్యై నమ:   
ఓం సర్వలోక ప్రియాయై నమ:
ఓం  వాణ్యై నమ:
ఓం సర్వ విద్యాధిదేవతాయై నమ:
ఓం పార్వత్యై నమ:
ఓం దేవమాత్రే నమ:
ఓం  వనీశ్యై నమ:
ఓం వింద్య వాసిన్యై నమ:
ఓం తేజోవత్యై నమ:
ఓం మాహా మాత్రే నమ:
ఓం కోటి సూర్య సమ ప్రభాయై నమ:  
ఓం దేవతాయై నమ:
ఓం వహ్ని రూపాయై నమ:
ఓం సతేజసే నమ:
ఓం వర్ణ రూపిణ్యై నమ:
ఓం గణాశ్రయాయై నమ:
ఓం గుణమద్యాయై నమ:
ఓం  గుణ త్రయ వివర్జితాయై నమ:
ఓం కర్మజ్జాన ప్రదాయై నమ:
ఓం కాంతాయై నమ:
ఓం సర్వ సంహార కారిణ్యై నమ:  
ఓం ధర్మజ్జానాయై  నమ:
ఓం ధర్మ నిష్ఠాయై నమ:
ఓం సర్వ కర్మ వివర్జితాయై నమ:
ఓం కామాక్ష్యై నమ:
ఓం  కామ సంహత్ర్యై నమ:
ఓం కామ క్రోధ వివర్జితాయై నమ:
ఓం శాంకర్యై నమ:
ఓం శాంభవ్యై నమ:
ఓం శాంతాయై నమ:
ఓం చంద్ర సూర్య లోచనాయై నమ:  
ఓం సుజయాయై నమ:
ఓం జయాయై నమ:
ఓం భూమిష్థాయై నమ:
ఓం జాహ్నవ్యై నమ:
ఓం జన పూజితాయై నమ:
ఓం శాస్త్ర్ర్రాయై నమ:
ఓం శాస్త్ర మయాయై నమ:
ఓం నిత్యాయై నమ:
ఓం శుభాయై నమ:
ఓం శుభ ప్రధాయై
ఓం చంద్రార్ధ మస్తకాయై నమ:
ఓం భారత్యై నమ:
ఓం భ్రామర్యై నమ:
ఓం కల్పాయై నమ:
ఓం కరాళ్యై నమ:
ఓం కృష్ఠ పింగళాయై నమ:
ఓం బ్రాహ్మే నమ:
ఓం నారాయణ్యై నమ:
ఓం రౌద్ర్ర్యై నమ:
ఓం చంద్రామృత పరివృతాయై నమ:
ఓం జేష్ఠాయై నమ:
ఓం ఇందిరాయై నమ:
ఓం మహా మాయాయై నమ:
ఓం జగత్వృష్థాధి కారిణ్యై నమ:
ఓం బ్రహ్మాండ కోటి సంస్థానాయై నమ:
ఓం కామిన్యై నమ:
ఓం కమలాయై నమ:
ఓం కాత్యాయన్యై నమ:
ఓం కలాతీతాయై నమ:
ఓం  కాల సంహార కారిణ్యై నమ:
ఓం యోగ నిష్ఠాయై నమ:
ఓం యోగి గమ్యాయై నమ:
ఓం తపస్విన్యై నమ:
ఓం జ్జాన రూపాయై నమ:
ఓం నిరాకారాయై నమ:
ఓం భక్తాభీష్ఠ ఫల ప్రదాయై నమ:
ఓం భూతాత్మికాయై నమ:
ఓం భూత మాత్రే నమ:
ఓం భూతేశాయై నమ:
ఓం భూత ధారిణ్యై నమ:
ఓం స్వదానారీ మద్యగతాయై నమ:
ఓం షడాధారాది వర్ధిన్యై  నమ:
ఓం మోహితాయై నమ:
ఓం శుభ్రాయై నమ:
ఓం సూక్ష్మాయై నమ:
ఓం మాత్రాయై నమ:
ఓం  నిరాలసాయై నమ:
ఓం నిమగ్నాయై నమ:
ఓం నీల సంకాశాయై నమ:
ఓం నిత్యానందాయై నమ:
ఓం హరాయై నమ:
ఓం పరాయై నమ:
ఓం సర్వ జ్జాన ప్రదాయై నమ:
ఓం ఆనందాయై నమ:
ఓం సత్యాయై నమ:
ఓం దుర్లభ రూపిణ్యై నమ:
ఓం సరస్వత్యై నమ:
ఓం సర్వ గతాయై నమ:
ఓం సర్వాభీష్ఠ ప్రదాయిన్యై నమ: 

శ్రీ అమ్మవారి భక్తులకు మనవి

శమంతకమణిని సంపాదించడం కోసం జాంబవంతుడ్ని తరుముకుని  శ్రీకృష్ణుడు ఒక గుహలోకి వెళ్ళి పోయాడు. వెంటనే గుహ ద్వారము లోపలి నుండే  ఒక పెద్ద బండతో మూయబడింది. లోపలినుండు నెత్తుటి ధారలు వస్తున్నాయి.లోపలికి వెళ్ళే సాహసం ఎవరూ చెయ్యలేక పోయారు. కృష్ఠుడు సురక్షితంగా భయిటపడాలని కోరుతూ యజ్జం యాగాదులు చెయ్యాలని నిర్ణయించి పండితులను పిలిచారు. వారు పంచాంగాలు తిరగేసి యజ్జం,యాగాదులు నిర్వహించుటకు సరైన తిథి ,వార,కరణ,నక్షత్ర యోగాలు లేవని చెప్పేరు.

ఆ క్లీష్ఠ పరిస్థితిలో నారధ మహర్షులు అక్కడికి విచ్చేసారు. ఇతర దేవతల కొరకు యజ్జం,యాగాదులు,పూజలు చెయ్యాలంటేనే పంచాంగాలు తిరగెయ్యాలి. మంచి ముహూర్తం చూడాలి .కాని జగ్నమాత అయిన  శ్రీ అమ్మవారిని  పూజించుటకు ఎటువంటి నియమ ,నిభంధనలు లేవని స్పష్ఠం చేసారు.

ఆ తరువాత శ్రీ అమ్మవారికి యజ్జం నిర్వహించడం కృష్ణుడు సురక్షితంగా భయిట పడటం  జరిగి పోయాయి.కలియుగాన ప్రతి ఒక్కరు పొట్ట కూటి కొరకు పడే పాట్ల మద్యన నియమ నిభంధనలతో ఇతర దేవతలను పూజించడం ప్రసన్నం చేసుకోవడం దాదాపుగా అసంభవమే. పైగా ఆది శక్తి అయి సమస్త దేవతలను సృష్ఠించిన శ్రీ అమ్మవారిని పూజిస్తే అందరు దేవుళ్ళను పూజించినట్టే అవుతుంది.

నామం -నామి:
నామానికి (పేరు) నామికి ( పేరుగల వ్యక్తికి) నడుమ తేడాలెమి ఉండవు. ఈ శతనామావళిలోని అమ్మవారి నామాల అర్థం -పరమార్థం తెలుసుకుని పఠించి ద్యానం చేసిన యెడల ఇందులోని నామాలు సాక్షాత్తు శ్రీ అమ్మవారై మీ కోరుకలను నెరవేరుస్తాయి.

ఆంజనేయ స్వామి రామ నామాన్ని ఆయుధం చేసుకుని సాక్షాత్తు రాముడ్నే తికమక పెట్టిన సంగతిని గుర్తుకు తెచ్చుకుంటే నామం యొక్క భలం స్పష్ఠంగా అర్థమవుతుంది.

పంచ దశాక్షర్యై నమ:

"పంచ  " అనగా ఐదు ," దశా " అనగా పది  ఐదు x పది = యాబై .సంస్క్రుతంలో మొత్తం యాబై అక్షరాలే. అంటే ప్రతి అక్షరం అమ్మవారి రూపమే. వేరే మాటల్లో చెప్పాలంటే అమ్మవారే ఈ యాబై అక్షరాలై ఉందన్న మాట. అందుకే  అమ్మవారికి పంచ దశాక్షర్యై  అని ఒక నామం ఉన్నది.

అన్ని అక్షరాలు అమ్మవారే అయినప్పుడు - ఆ అమ్మవారి నామాలకు ఇంకెంత శక్తి ఉంటుందో ఊహించుకొండి. ఇంకా ఈ నామాలకు ముందు ప్రణవమగు " ఓం" చివరన "నమ:" కూడ కలిపి చెప్పవలసి ఉంటుంది. అప్పుడా శక్తి ఇంకెంత హెచ్చుతుందో ఊహించండి.

ఇంతే కాదు ఈ నామాలకు భీజాక్షరాలను జోడిస్తే గాలిలో ఎగిరే రాకెట్టుకు అణ్వాస్త్త్రాన్ని జోడించినట్టే మీ ప్రగతి పథంలోని అడ్డు -ఆటంకాలన్ని పటా పంచలైపోతాయి.

కుండలి అనే అధ్బుత శక్తి:
ప్రతి వ్యక్తిలోను అఖండమైన యోగ శక్తి కుండలి రూపంలో గుదమునకు రెండంగుళాల పైన మూలాధార చక్రమున సర్పం వలే తన తోకను తనే కరచుకుని ఉందని యోగ శాస్త్రం చెబుత్తుంది.

మనిషిలో అతని స్వాస సూర్య నాడి ,చంద్ర నాడిగా నడుస్తుంటుంది. (కుడి ఎడమ నాశికా ద్వారముల ద్వారా) ఏదైన అరుదైన తరుణంలో అది సూక్ష్మ్నా  నాడి ద్వారా జరుగును. ( భగవత్ ద్యానంలో లోతుల్లోకి వెళ్ళినప్పుడు/ఏదైన మోయలేని శోకం కలిగినప్పుడు, గురువులు దీక్ష ప్రసాదించినప్పుడు )

అది కొందరికి అభ్యాసం ద్వారా ,కొందరికి గత జన్మల్లో చేసిన అభ్యాసం ద్వారా జరుగును. అలా శ్వాస సూక్ష్మ్ణా ద్వారం గుండా జరిగినప్పుడు కుండలి జాగృతమవుతుంది.

అది ఇందాక స్థితమై ఉన్న స్థానం మూలాధారం. అది భూతత్వం. అలా కుండలి మూలాధారంలో నిద్రావస్థలో ఉన్నంత వరకు మనిషికి ఈ భూమి మీద ఉన్న వస్తువులపై ఎన లేని ఆకర్షణ ఉంటుంది. వాటి కోసం అలమటిస్తుంటాడు.

అది జాగృతమై పైకి ప్రాకడం మొదలవ్వగానే మనిషికి బూతలం పై ఉన్న సఖల విషయాల పై "ఆధిపత్యం" ఏర్పడుతుంది. ఇక పై పైకి దాని పయణం సాగితే జరిగే అధ్భుతాలు అనంతం.

భీజాక్షరాలు:
కుండలిలో చైతన్యం పుట్టించడానికి మరో మార్గం ఉంది.అదే భీజాక్షర పఠనం. భీజాక్షరం అంటే ఏమో కాదు.. అక్షరాలకు చివర "మ్" కలిపి ఉచ్చారణ చెయ్యడం. ఉ: అం, ఆం ,ఇం

అక్షరాల వెనుక "మ్" కలిపితే ఏమవుతుంది.  నోరు -గుదము ఒకే గొట్టం యొక్క ప్రారంభం -ముగింపుగా ఉన్నవి. యోగ శాస్త్ర్రం భోధించే షఠ్చక్రాలు దాదాపుగా ఈ గొట్టానికి అటు ఇటుగా ఉన్నాయి. నోట భీజాక్షరాలు పలికినప్పుడు పెదాలు మూత పడి -తెరుచుకుంటాయి. ఈ కదలిక గొట్టమంతట వ్యాప్సితుంది. గొట్టానికి అటు ఇటుగా ఉన్న చక్రాలను తాకుతాయి. ముఖ్యంగా గుద స్థానమునకు రెండంగుళములు పై ఉన్న మూలాధారాన్ని తాకుతాయి. దీంతో కుండలిలో జాగృతి వస్తుంది.

భీజాక్షరాలు - కోరికలు :
కుండలి చైతన్యం కావడానికే కాదు - మీ కోరికలు నెరవేరడానికి సైతం భీజాక్షరాలు సహకరిస్తాయి. శ్రీ అమ్మవారి  నామానికి ముందుగా  క్రింద తెలిపిన కొన్ని భీజాక్షరాలు కలుపుకొండి. ఉదాహరణకు : మీకు విద్య కావాలంటే "ఐం" , ప్రపంచ మాయనుండి భయిట పడాలంటే "హ్రీం" , భయము,భీతినుండి విముక్తి కావాలంటే "క్లీం" , సంపద కావాలంటే  "శ్రీం" భీజాలను కలుపుకుని జపించండి.

ఉదా: ఓం ఐం విద్యాయై నమ: ఓం క్లీం చండికాయై నమ:

మూడు జన్మల ప్రయాస:
ఒక జన్మంతా  నమ:శివాయ అనే పంచాక్షరిని జపిస్తేనే తదుపరి జన్మలో రామ నామం జపించే యోగం పదుతుందట. ఆ జన్మంతా రామ నామం జపిస్తేనే తదుపరి జన్మలో శ్రీ అమ్మవారి పై మనస్సు మళ్ళుతుంది. ఈ శతనామావళిని మీరు పఠించ కలిగితే మూడు జన్మల ప్రయాసకు లభించవల్సిన ఫలం ఈ ఒక్క జన్మలోనే లభిస్తుంది.

Monday, August 20, 2012

ప్రళయం

అమ్మ! దు:ఖాంతం కానున్న నీ జగన్నాటకంలో
కేవలం ఒక కొన మెరుపు కొరకొ,
సడన్ ట్విస్ట్ కొరకొ,
నా గతాన్ని. దు:ఖభరితం
చేశావన్న మాట.
కేవలం టెంపో పెంచడం కోసం నా ఈ చెత్త క్యేరక్టర్ అన్న మాట

కాలగతిని ఎరుగ చేశావ్
మనోగతిని చేదించేలా చేసావ్.
కాలగతితో నా మనోగతి ఏకీభవించిన నాడు
నాకు వీరికి నడుమ ఏమాత్రం ఉండదు తేడా

నింగి నేలల కరచాలనాన్ని ప్రళయాన్ని ఆపలేకున్నా.
కనీసం ఆపాలన్న ఆలోచన - అందుక్కావలసిన ఊహ
ఆ ఊహనూ నిజం చేసుకోవడానికి ఓ వ్యూహాన్ని ఇచ్చావ్

ప్రళయ తరుణమే వచ్చిన నాడు
గడియలే మొదలైన క్షణం
దానిని ఆపలేకున్నా
హడావుడి లేక హడలి పొక మరణించే
అవకాశాన్నైనా
ఇవ్వవే అమ్మా!

ఇదే నా పూజా ఫలమని సరిపెట్టుకుంటా

నామస్తిష్కాన్ని మణిమాణిక్యాల
నిక్షేపాలతో నింపేస్తున్నావ్ .. కాని వీటితో నేనేంచెయ్యాలి!

అమ్మా!
నిజానికి నాకు మద్యనున్న తెరలు ఒక్కొక్కటే తెంచేస్తున్నావ్

నా చేత ఏ పాట పాడించాలని ఈ ముస్తాబు
నా చేత ఏ ఆట ఆడించాలని ఈ మానిటర్లు.
ఏ అరంగేట్రం కొరకే ఈ ఉబలాటం

అమ్మా!
అందరికి ఇచ్చినంత పిడికిడంతటి గుండేనాకూ ఇచ్చి
పిడుగులనే దింఛుతున్నావ్!
ఎప్పుడు కురిపిస్తావే అమృత వర్షం

నీ పరీక్షలు పుట్టించే ఉత్కండతకు వణకడం ఒక వంతైతే
వీటిలో నెగ్గాక నువ్వు నాకు చెయ్యనున్న సత్కారాలను తలచుకుంటే
కలిగే భయం మరోవంతు

నాపిచ్చిగీతలను పిచ్చెక్కించే
కళాఖండాలుగ మలచగల నేర్పరివి నీవు
ఆ విషయాన నాలో లేవు అనుమానాలు
మరీ ఎగ్జిబిషన్లా మిగిలి పోతానేమోనన్న జంకే
నా గుండెను జింకలా తంతూ ఉంది

అమ్మా! ప్రేమను
గుర్తించే గుండెనిచ్చావు
ప్రేమను అందుకునే తెగింపునివ్వు
దక్కించుకునే త్యాగాన్నివ్వు

ఈ ప్ర్రాపంచిక జీవితపు డైనొజర్
సహస్ర హస్తాలతో దానిని కబళించే దుష్ప్రయత్నమే చేస్తే
వాటిని కండించే ఖడ్గం ధనం, ధనాని ప్రసాదించు

నా మస్తిష్కాన్ని ఖాళీ చెయ్యవే నా ఖజానాను
నింపవే. నీత్రిశూలపు పోటుసైతం తట్టుకునే
నా గుండెపై పొరపొచ్చాలతో వీరు విసిరీ
పోరకపుల్లలనుండి నన్ను నా గుండెను రక్షించుకునే
కవచం ధనం

ఆ కవచంతో నా గుండెను కప్పవే
హేతువాదపు కాగడా ఆరి పోయింది
ఆస్తికపు పండువెన్నెలలో మర్మాలన్నీ బహిర్గతమయ్యాయ్

ఆద్యాత్మిక అబిన్ చూపిన నవ్యలోకాలు కనుమరుగవుతున్నాయ్
ఒంటరి తనం బెదరగొడుతోంది

సమాజంపై వ్యతిరేకత నిర్వీర్యమై పోతుంది
తప్పోప్పుల విచక్షణ తగ్గిపొతుంది
ఏ దై తే నేమన్నజడత్వం చిగురిస్తోంది

వ్యక్తిత్వాలపై వ్యామోహం తగ్గిపోతోంది
వెన్ను లేని జేవితాలపై నా మూడవకన్ను
విరిసిన రవ్వలు చల్లారి పోతున్నాయ్

లక్ష్యం గొప్పదన్న ఆలోచన ఆవేశాలు అంతరిస్తున్నాయ్
జీవితాన్ని నిర్లక్ష్యం చేశామేమోనన్న
నిస్పృహను సైతం పసికట్టి

నా స్పృహతో అడ్డంవచ్చిన అస్పష్ట ఆలోచనలను అంతం
గావించి నిర్మిస్తా ఈ సమస్త మానవానిని
ప్రళయపు ఏరును...దాటించే వంతెన

Thursday, July 12, 2012

పరిమిత శక్తితో -గొప్ప లక్ష్యాన్ని

అమ్మా అమ్మోరు తల్లి !
ఇది కరువు కాలమా
లేక నాకు అదృష్టం కరువైన కాలమా
నేనేతప్పు చేశానని అన్ని అన్ని నన్నిలా
ముప్ప తిప్పలు పెడుతున్నాయి
ఇట్లాంటి స్ఠితే ఎన్నో సార్లు నా గతాన ఎదురైయినా
అది యింత కాలం కొనసాగలేదు
నా దేశ సమస్యలకే సమూల పరిష్కారం కనుగొన్నా
నా సమస్యలకు పరిష్కారాల విషయానికొస్తే
కనుగొన్నానే కాని అమలు చెయ్యలేక పొతున్నా
ఎందుకు........ఎందుకిలా........దురదృష్టం
నీడలా వెంటాడుతుంది
నేను స్తుతించింది నిన్నైతే
నన్ను వెంటాడి వెన్నంటి ఉండి రక్షణ కల్పించాల్సింది నీవైతే
నన్ను వెంటాడి నన్ను-నాలోని సృజనాత్మకతను బక్షిస్తున్న
శక్తి ఏది

అన్ని శక్తులను గుత్తకు తీసుకొన్న
నీవు కాక - నీ శక్తి కాక
మరే శక్తి నన్ను స్ఫర్శింప గలదు ?

ఐతే నువ్వే
నన్ను ముప్ప తిప్పలు పెట్టిస్తున్నవన్న మాట
అంటే ఈ నా ఈ ప్రజలకు ఆత్మహత్యలనుండి
రొగాలనుండి ఆత్మహత్యల నుండి
లాకప్ డెత్ లనుండి
ఆకలిచావుల నుండి రక్షణ కల్పించాలని చూడటం
తింటానికి కూడు, కట్టుకోవడానికి గుడ్డ ,ఉంటానికి గూడు
అందించ చూడటం ఒక్కటే నీ దృష్థిలో పాపమా?
అందుకే నాకీ శాపమా
శబాష్!

బోని కాని రచయిత
తాను అచ్చువేసిన తన పుస్తకాన్ని తానే తిసి చదువుకొని
మురిసి పోయేటంత దుస్ఠితికి నువ్వూ
చేరావన్నమాట

నీ తెలివి కాలా !

భక్తులుంటేనే దేవతకు గౌరవం
నువ్వు నాకు కరుణించ కుంటె
భవిష్యత్తులో ఇంకెవడన్నా
నాలా నిన్ను నమ్ముకుంటే
ఆడ్ని
"పిచ్చివాడని రాళ్ళతో కొట్టి చంపేస్తారే
ఇక నీకు భక్తులే కరవవుతారే..

అమ్మా అమ్మోరు తల్లి !
అంతే కాదు
ఇక ఏమాత్రం ఆలస్యం చేసినా
ఈ భూ ప్రపంచం మీద నీ బిడ్డలెవ్వరూ మిగలరే.
త్వరబడవే !

చరిత్రలో ఎందరికోవరమిచ్చి
వారు ఆ వరాన్ని దుర్వినియోగం చేస్తే
నిస్సహాయంగా చూస్తుండి పోయిన తరుణాలు
గుర్తుకొచ్చి వరమీయడానికి జంకుతున్నావేమో
నీ మతి మండా !
వాకు కావల్సింది నీ వరాలు కావే
నా ప్రతిభకు - పరిశ్రమకు తగ్గ ప్రతి ఫలం

అందుకు నువ్వు అడ్డు రాకుండటం

దీనిని సైతం వరంగా కోరుకునే
దుస్థితికి నన్ను తెచ్చావంటె
నాకర్థమై పొయింది
నీమానసికరోగం
షిట్ ! తల్లీ..
నీ మానసిక ఆరోగ్యాన్నిసైతం శంకించే
స్థితికి తెచ్చావన్న మాట శభాష్!

అడ్డు తప్పుకోవే
నీకు నేనిస్తా వరాలు
నా పాత కవితలను
ఏమనుకున్నావొ అసలు సిసలైన వరాహాలు
వాటిని అర్తిస్తానే నేసు
అడ్డు రాకేనాకు

తల్లీ!
పొరపాటున నివ్వు లంచానికి మరిగుంటే
నీ రేటు చెప్పవే చెల్లించి పోతా
తల్లి .........యిప్పటికే ఎన్ని జన్మలు వృదా
అయ్యాయో
ఈ జన్మను మాత్రం వృదాకానీయను
అనుకున్నది సాధిస్తా
వీలుంటే............నీ ఆశీస్సులతో
కాకుంటె నీ అంక్షలతో
సాదించలేననుకున్నవేమో సిల్లీగా
నేను వీరిలా చెత్త కోరికలతో నా శక్తి యుక్తులను వృధా చెయ్యనే
అందుకే ఒక లక్ష్యం గైకొని
కల్ప కల్పాల అల్పకోరికలను నా లక్ష్యపుకోరలకు
బలి చేశా
నాకున్న పరిమిత శక్తితోనే సాధిస్తా.
ఎంచుకున్న గొప్ప లక్ష్యాన్ని

Friday, June 22, 2012

గొడ్రాలికి సైతం !


హే పవిత్ర మయీ !
నా లక్ష్యం లో ఒక పవిత్రత ఉంది
పవిత్రతకు నిలయానివి నీవు
నా లక్ష్యంలో పవిత్రత ఉంది
అంటే నా లక్ష్యంలోను నువ్వుండి తీరాలి

అసలు నీలోనే/ నీలొనుండే నా లక్ష్యం జన్మించి ఉండాలి
నా లక్ష్యం నాలోఇంకా సజీవంగా ఉంది
అంటె నీవు నాలో కొలువైయున్నావన్నమాట

ఈ నా అన్వేషణ-అద్యయనం నిజమైతే
నాకు విజయాన్ని ప్రసాదించు
ఈ ప్రతిష్టంబనను తొలగించు

కూనీకోర్లు, దగాకోర్లు ప్రశాంతంగా
సకల సౌభాగ్యాలతో ప్రశాంతంగా బ్రతికేస్తుంటే

పవిత్రమైన లక్ష్యంతో
ఎనలేని ప్రతిభలతో, జ్ణానంతో
కాసింత విశ్రాంతికి నోచుకోక నన్ను నేను
నొచ్చుకుంటూ నెట్టుకొస్తున్నా
ఏమిటి ఈ దౌర్బాగ్యం
క్షణ క్షణం నా రక్తం ఉడికించే స్వజనులతో
విసిగిపోతున్నాను.


ఈ నీ దయా రాహిత్యం గురించి నేనేమనుకున్నా
నీవు ఏమి అనుకోవ్
మరి పదిమంది ఏమనుకుంటారన్న
జ్ణానం...., సిగ్గుకూడా లేదునీకు తక్షణం
సాయపడవే
పేదరికం నా చాయలోకి సైతం రాకుండా అడ్డుకట్ట వేయవే

తల్లీ వీరి తప్పిదాలకు నెను శిక్షించ బడుతున్నా
వీరి నిర్లక్ష్యాలకు నేను బలై పోతున్నా
వీరి బాద్యతారాహిత్యానికి నేను బంగ పడుతున్నా
తమ అసమర్థతలను దాచుకునే ప్రయత్నంలో
నా సమర్థతకు సమాధి కడుతున్నారు వీరు.

వీరి కాంప్లెక్స్ లకు నా కాలల కాంప్లెక్స్ కదలి పోతుంది

తల్లీ యిది న్యాయం కాదే
నువ్వు దేవతవే అయ్యుండవచ్చును
నేను కేవలం మానవ మాత్రుడనే అయ్యుండవచ్చును
కానీ న్యాయం ఒకటేగా

తల్లీ ! వీరిని బాగు చేయ చూసి వీరు బాగా లేక పోవడం వలన
వీరూ బాగు పడక నన్నూ బాదలు పాలు చేస్తున్నారు తల్లీ!

నా నిస్వార్థ కృషికి నేనే రాజ సన్మానాలు ఆశించటంలేదే
కనీసం ఈ అడ్డూ ఆటంకాలపై గొడ్డలి పెట్టు కావమ్మా !

నా గోడు విటే గొడ్రాలికి సైతం కడుపు తరుక్కు పోతుంది
యిన్నిట్రిలియన్ల బిడ్డలను కన్న నీ మనసు చలించకుంటె
నేనేంచెయను

నేటి కాసులు -నాటి తపస్సుకు తోడయ్యుంటే


అమ్మా అమ్మోరు తల్లి !
నా పాజిటివ్ థింకింగ్ కు ఎప్పుడో పాతర వేసా
నా మనసెందుకో కీడునో శంకిస్తుంది
ఈ క్షణం నాది - నీ దయ ఉంటే ఈ రాత్రి నాది

ఎలాగో గౌరవ ప్రద జీవితాన్ని జీవించలేక పోయాను
గౌరవప్రద మరణాన్ని కోరి ఈ కవితనల్లుతున్నా

నా కళ్ళ ముందే ఎన్నో అన్యాయాలు జరిగిపోయాయి
మంత్రభలం చాల్లేదనో -తపం భంగపడిందనో సర్దుకున్నాను

కేవలం నా పేదరికం కారణంగా నా గుండె వ్రణాలకు చికిత్స చెయ్యించుకోలేక
పోతున్నానని కారణాలు కల్పించుకున్నాను
ఇటీవల నా చేతికొచ్చి పోయిన వందలు వేలు సైతం
ఆ వ్రణాలను మరింత పెద్దవిగా మార్చేయే గాని నయం చెయ్యలేక పోయాయి

నేనేదో ఊహించుకున్నాను
నేను తెగించిన అన్యాయాలను స్వర్ణంలో ఇత్తడనుకున్నా
అవి నా పాల మనసున పాలిడాల్ అయ్యాయని
ఇప్పుడే తెలుసుకుంటున్నా

అప్పట్లో నా పస్తులకు పరిష్కారం కనుగొనలేక పోయినా
నిన్ను నిలదీసి నీకు అల్టిమేటమ్ జారి చేసే సత్యాగ్రహం నాకు కలిగేది
ఇప్పుడు ?

లేదు లేదు లేనే లేదు

అన్నీ పోగొట్టుకుని కాసింత పుణ్యం కూడ కట్టాను
ఇప్పుడు ఆ పుణ్యాన్ని సైతం పోగొట్టుకుని
పాపాలు మూట కట్టుకుని
కనిపించిన కాసులేమో
కనుమరుగై పోయాయి

అమ్మా ఇంతేనా తల్లీ నీవు నా నుదుటి పై వ్రాసిన వ్రాత?
ఇందుకేనా తల్లి అంతటి గుండె కోత

అమ్మా కనులున్న గుడ్డివాడినై
చెవులున్నా చెవిటివాడినై ఉన్నాను
కరుణించవే అమ్మా

నేటి కాసులు -నాటి తపస్సుకు తోడయ్యుంటే
నేనిలా మిగిలి పోయేవాడ్ని కాదు

ఈ కాసులు సైతం కానరాకుంటే ఏమై పోయేవాడినో
ఆత్మహత్యకైతే అవకాశమే లేదు

ఇక హత్యకో లేక మరో ఉధంతానికో పాల్పడి ఉండే వాడ్ని

పేదరికానికి జడిచి


అమ్మా అమ్మోరు తల్లి !
ఎంతటి ఉన్నత శిఖరాల్లో ఉంచావో
అంతగా నా పేదరికం
పెరిగి నన్ను కించ పరిచేది
నేనెంతటి నీచానికి దిగజారినా
అది నన్ను విడిచి పెట్టదని
తెలిసి పోయింది
కేవలం పేదరికానికి జడిచి
ఇలా తయారయ్యాను

అమ్మా ఏమిటీ ఏమిటి ఈ దుస్థితి?
నాటి తపస్సు పేద ప్రజల ఉషస్సు కోసం
కేవలం కొంత యశస్సు కోసం
నేను చేసిన ప్రయత్నాలన్ని
తుస్సేనా?

అమ్మా !
నేనెంతో ఏలిగ్గా వెనక్కి రాగలను
నా వ్యూహం తప్పని తెలుసుకున్నాను
నేను నా పేదరికాన్ని గెలవలేనని తెలుసుకున్నాను
ఇంత మాత్రం గెలిచినందుకే
అది నా కవచాన్ని తొలిచి వేసింది

నా గుండెను కలిచి వేసింది

అమ్మా ! అమ్మోరు తల్లీ !
కాసుల కాంత నీ బిడ్డే కదా
ఆమెకింత గెడ్డి పెట్టి
నాక్కొంత ఆదాయాన్ని
సమకూర్చి నా లక్ష్య భాటలో పయనింప చెయ్యలేవా?

అమ్మా.. ఇదేమిటి
నా స్థితి నాకే మింగుడు పడనంతగా
దిగజారి పోయింది

నేనేదో రాబిన్ హుడ్లా తయారవుతాం అనుకుంటే
చివరికి నా కలల రథం అప్పుడమైంది

అమ్మా కరుణింఛవే ..లేదా మరణించనీయవే
ఆత్మాహుతి పిరికి తనం .నేనా ఆ పని చెయ్యలేను

ఒక్క బుల్లెట్టే .. నా లక్ష్య సాథన ప్రక్రియలో ఒక్క బుల్లెట్
నేను కోరుకున్న హీరాయిక్ జీవితాన్ని జీవితాంతం
జీవించ కోరలేదు
కేవలం ఐదు సం.లు చాలమ్మ

అమ్మా..కరుణించవే ఓం శక్తి

నా శక్తి వృధా చేస్తున్నానే
నా సర్వస్వం పోగొట్టుకుని
పొందిన తేజస్సు కేవలం కాసుల కోసం
క్షీణించి పోతుందే

కరుణించవే తల్లి ఓం శక్తి..

Sunday, May 27, 2012

దడ పుట్టించే జంతు వాసన


అమ్మా అమ్మొరు తల్లి!
మంట కలసి పోతున్న మానవత్వం
నన్ను వనికిస్తుంది
మనుష్యులను వెంటాడుతున్న
"జంతు వాసన" దడపుట్టిస్తుంది

ఇక నాకెలాంటి భ్రమలు లేవు
చాలు
అందమైన అబద్దాలు
అందవిహీన మైన అర్ద సత్యాలు
కౄరాతి కౄరమైన నగ్న సత్యాలు
చాలు
ఏనాడో - ఎవడో వస్తాడని అతనికి
నా మార్గం అందుభాటులో
ఉండాలని నన్నింకా
ఇలా వేదించడం తగదే

ఒక్క 5 సంవత్సరాల కాలం
నేను కలలు కనే వనరులు-
వాతావరణం -మనుష్యులు-ఆరోగ్యం
నాకీయవే లెక్కలన్ని
నీకు ఒప్ప చెప్పి నా దారి నేను
చూసుకుంటాను

కేవలం ఈ వేసవిని సైతం
తట్టుకోలేక పొతున్నా
ఇది మరీ నా ఆలొచనలను
సైతం ఆజ్నాపించే స్థాయిలో
ఉంది

నేను ఈ మనుష్యులను తట్టుకోలేను
కనీసం వీరు ఫ్రాపంచిక
విజయాలకోసం కూడ
అడుగు ముందుకేసేలా లేరు

నేను 22వ శతబ్దం గురించి
మధన పడుతుంటే
వీరు కేవలం రేపటి గురించి
కూడా ఆలోచించేలా లేరు

చాల్లే తల్లి !
నాలో ఉత్సాహం ఉబికినప్పుడు
నేను కావ్యాలే రచించినప్పుడు
అవి అగ్నికి ఆహుతి అయ్యాయి

నేడు చిరంజీవత్వం
అందుభాటులో ఉంటే
ఏమో తెలియని విరక్తి
నాలో ఉన్న వాటిని ఈ మానవావనికి వడ్డించి
వెళ్ళిపోతే చాలనిపిస్తోంది

అమ్మా ! అమ్మా !!
కనీసం
నేకై చేసిన రచనలన్నా
అక్షర రూపం దాల్చేలా
చెయ్యవే !
ఓం శక్తి

Friday, May 11, 2012

అంబపలుకు :2

అమ్మా అమ్మోరు తల్లి !
వాన నీటిలోని ఆ నాటి నా కాగితపు ఓడలనే కాదు
సముద్రంలో దూసుకు పోయే టైటానిక్లను సైతం
బోల్తా కొట్టించగల సమర్థురాలివి నీవు.

అన్ని తెలిసి తెలిసి నీ మాయలో పడి
నీ దయతో ఒక పిచ్చి పడవ నిర్మించుకున్నాను.

దానిని నీవే నడుపుతున్నావని భ్రమించాను
కాని అంతా నా భ్రమని తేలిపోయింది.

అప్పటి కాగితపు ఓడైనా సరే
ఇప్పటి పిచ్చి పడవైనా సరే
ఏ క్షణంలోనైనా మునిగిపోగలదని
నా కొంప ముంచ గలదని తెలుసుకున్నా

మొత్తానికి నీ దయా భిక్షం మీద
బతుకు బండి లాగించవలసిందే కాని
నా బతుకు నేను బతకలేనన్న మాట
జీవించడమే కష్ఠ సాథ్యమన్నప్పుడు

మంట కలిసిన మానవత్వానికి పునర్జీవం
పోయడం నా తరమా?

నీ చేయూత అర క్షణం కొరబడటంతో జరిగిన ఈ భంగ పాటుతో
సైకిల్ నుండి క్రింద పడినంతగానే
నా మనస్సుకు గాయమైంది.

రేపటి అంతిమ యుద్దం నువ్వు "చెయ్యిస్తే"
హెలికాఫ్టరు నుండి పడినంతగా వ్రణమై పోతుందేమో?

ఏమిటో అంతా నా భ్రమా..