Thursday, July 12, 2012

పరిమిత శక్తితో -గొప్ప లక్ష్యాన్ని

అమ్మా అమ్మోరు తల్లి !
ఇది కరువు కాలమా
లేక నాకు అదృష్టం కరువైన కాలమా
నేనేతప్పు చేశానని అన్ని అన్ని నన్నిలా
ముప్ప తిప్పలు పెడుతున్నాయి
ఇట్లాంటి స్ఠితే ఎన్నో సార్లు నా గతాన ఎదురైయినా
అది యింత కాలం కొనసాగలేదు
నా దేశ సమస్యలకే సమూల పరిష్కారం కనుగొన్నా
నా సమస్యలకు పరిష్కారాల విషయానికొస్తే
కనుగొన్నానే కాని అమలు చెయ్యలేక పొతున్నా
ఎందుకు........ఎందుకిలా........దురదృష్టం
నీడలా వెంటాడుతుంది
నేను స్తుతించింది నిన్నైతే
నన్ను వెంటాడి వెన్నంటి ఉండి రక్షణ కల్పించాల్సింది నీవైతే
నన్ను వెంటాడి నన్ను-నాలోని సృజనాత్మకతను బక్షిస్తున్న
శక్తి ఏది

అన్ని శక్తులను గుత్తకు తీసుకొన్న
నీవు కాక - నీ శక్తి కాక
మరే శక్తి నన్ను స్ఫర్శింప గలదు ?

ఐతే నువ్వే
నన్ను ముప్ప తిప్పలు పెట్టిస్తున్నవన్న మాట
అంటే ఈ నా ఈ ప్రజలకు ఆత్మహత్యలనుండి
రొగాలనుండి ఆత్మహత్యల నుండి
లాకప్ డెత్ లనుండి
ఆకలిచావుల నుండి రక్షణ కల్పించాలని చూడటం
తింటానికి కూడు, కట్టుకోవడానికి గుడ్డ ,ఉంటానికి గూడు
అందించ చూడటం ఒక్కటే నీ దృష్థిలో పాపమా?
అందుకే నాకీ శాపమా
శబాష్!

బోని కాని రచయిత
తాను అచ్చువేసిన తన పుస్తకాన్ని తానే తిసి చదువుకొని
మురిసి పోయేటంత దుస్ఠితికి నువ్వూ
చేరావన్నమాట

నీ తెలివి కాలా !

భక్తులుంటేనే దేవతకు గౌరవం
నువ్వు నాకు కరుణించ కుంటె
భవిష్యత్తులో ఇంకెవడన్నా
నాలా నిన్ను నమ్ముకుంటే
ఆడ్ని
"పిచ్చివాడని రాళ్ళతో కొట్టి చంపేస్తారే
ఇక నీకు భక్తులే కరవవుతారే..

అమ్మా అమ్మోరు తల్లి !
అంతే కాదు
ఇక ఏమాత్రం ఆలస్యం చేసినా
ఈ భూ ప్రపంచం మీద నీ బిడ్డలెవ్వరూ మిగలరే.
త్వరబడవే !

చరిత్రలో ఎందరికోవరమిచ్చి
వారు ఆ వరాన్ని దుర్వినియోగం చేస్తే
నిస్సహాయంగా చూస్తుండి పోయిన తరుణాలు
గుర్తుకొచ్చి వరమీయడానికి జంకుతున్నావేమో
నీ మతి మండా !
వాకు కావల్సింది నీ వరాలు కావే
నా ప్రతిభకు - పరిశ్రమకు తగ్గ ప్రతి ఫలం

అందుకు నువ్వు అడ్డు రాకుండటం

దీనిని సైతం వరంగా కోరుకునే
దుస్థితికి నన్ను తెచ్చావంటె
నాకర్థమై పొయింది
నీమానసికరోగం
షిట్ ! తల్లీ..
నీ మానసిక ఆరోగ్యాన్నిసైతం శంకించే
స్థితికి తెచ్చావన్న మాట శభాష్!

అడ్డు తప్పుకోవే
నీకు నేనిస్తా వరాలు
నా పాత కవితలను
ఏమనుకున్నావొ అసలు సిసలైన వరాహాలు
వాటిని అర్తిస్తానే నేసు
అడ్డు రాకేనాకు

తల్లీ!
పొరపాటున నివ్వు లంచానికి మరిగుంటే
నీ రేటు చెప్పవే చెల్లించి పోతా
తల్లి .........యిప్పటికే ఎన్ని జన్మలు వృదా
అయ్యాయో
ఈ జన్మను మాత్రం వృదాకానీయను
అనుకున్నది సాధిస్తా
వీలుంటే............నీ ఆశీస్సులతో
కాకుంటె నీ అంక్షలతో
సాదించలేననుకున్నవేమో సిల్లీగా
నేను వీరిలా చెత్త కోరికలతో నా శక్తి యుక్తులను వృధా చెయ్యనే
అందుకే ఒక లక్ష్యం గైకొని
కల్ప కల్పాల అల్పకోరికలను నా లక్ష్యపుకోరలకు
బలి చేశా
నాకున్న పరిమిత శక్తితోనే సాధిస్తా.
ఎంచుకున్న గొప్ప లక్ష్యాన్ని