Thursday, August 18, 2011

భవిష్య జ్నానం

అమ్మా అమ్మోరు తల్లి !
వీరు ప్రతి మార్చికి తేల్చుతారు లెక్కలు
కాని నేను డొక్క ఎండిన ఆ రోజుల్లోనే ప్రతి రాత్రికి
టాలి చేసుకుంటా బ్యాలెన్స్ షీట్

నా గతానుభవమే కాదు భవిష్య జ్నానం కూడ
చెబుతూంది ఇక్కడ ఏదీ శాస్వతం కాదని
నువ్వెక్కడో నింగినుండి తొంగి చూడటం లేదని
ఏ కోణంలో ఆలోచించినా మేమందరం
ఏదో ఒక అరుదులో అరుదైన ఒక్క నిర్ణిత క్షణాన
ప్రాణం పోసుకున్న ఒక్క కణంలోనుండి పుట్టిన వారమే

ఆలా ప్రాణం పోసింది నువ్వని లేదా ఆ ప్రాణమే నీవని భావిస్తా
ఇక్కడి మానవులమే కాదు ప్రతి జీవి ఒక్క తల్లి బిడ్డలమని
ఆ తల్లివి నీవని భావిస్తా !

నీ పిల్లలు దోపిడికి గురై ఆకలితో అలమటిస్తుంటే
నీ ఉనికినే వారి శంకిస్తుంటే నా మేథోశక్తి బ్రహ్మంగారి
కాలజ్నానానుసారం ప్రాణం పోసుకున్న( హంపి ) ఆంబోతులా రంకె వేస్తుంది.

అమ్మా అమ్మోరు తల్లి !
ఈ భువి పై ఆకలి దోపిడి ఉన్నంత కాలం
ప్రతి శ్వాసలో ఓంకారం ద్వనించినా, ప్రతి అడుగులో నీ కాలి గజ్జల చప్పుడు
వినబడుతున్నా ప్రతి స్త్రీ) లోను నువ్వే కనబడుతున్నా
నేను నాస్తికునిగనే కొనసాగుతా

ఈ దుర్బర పరిస్థితిలో నేను ఆస్తికునివలే కులికితే
నన్నేదో నీ పి.ఏగా భావించి నీ ఆడ్రసు కోసం నన్ను వాకబు చేస్తారు.
నేను ఏ దిన పత్రికలోనో కనబడుట లేదు నీవని ప్రకటన ఇవ్వమని సలహా ఇవ్వాల్సి వస్తుంది

నో.. అతిత్వరలో నన్ను నేను ఆస్త్రికునిగా ప్రకటించుకోవాలనే ఆకలి దోపిడీల పై
ద్రుష్ఠి సారించా.

మరో రుణ మాఫి పథకాన్ని అమలు చెయ్యాలి

అమ్మా అమ్మోరు తల్లి !
ఇక్కడి అమ్మలు కన్న బిడ్డలను అమ్ముకుంన్నారే
తొలూత భూమి పై ఏర్పడిన జీవి అమీబా
ఏక కణ జీవి. అది బలిసి రెండైంది. రెండు నాలుగైంది
సెల్ కాపియింగ్లో ఏర్పడ్డ తప్పిదాల కారణంగా కొత్త జీవ రాశులు ఏర్పడ్డాయి
జీవరాశులు ఏర్పడ్డాయి
నాటి స్వతంత్ర సమా వీరుల త్యాగాలు ఏమయ్యాయే
శ్రీని కోరి తమ శీలం అమ్ముకుంటుంటే
శ్రీ దేవిగా నీ ప్రతాపం చుపుతున్నావనుకున్నా
ఎక్కడ ఎక్కడ జరిగింది ఈ పొరబాటు
అన్నీ అర్థమై పోయిందని విర్రవీగిన క్షణాన
ఏది అర్థం గాని అయోమయానికి నన్ను గురి చేస్తావు
పురుషాహంకారంతో చూసినప్పుడు తల్లి సైతం స్తీ)యె
హే అమ్మలకన్న అమ్మా నిన్ను కొలిచి చూసినప్పుడు
భార్య సైతం తల్లియే

రుణానుబంధ రూపేణా పశు పత్ని సుతాలయా అన్నారు
రుణాను బంధ రూపంగా కలిగినవాటి పట్ల తమకున్న రుణానుబంధాలనుండి
విడి పడే మార్గం చూడాలేగాని మళ్ళీ మళ్ళీ అప్పుల్లో కూరుకు పోతున్న వీరిని
రక్షించాలంటే నువ్వు మరో రుణ మాఫి పథకాన్ని అమలు చెయ్యాలి

నా మనసాయెను వల్లకాడు


అమ్మా అమ్మోరు తల్లి !
ఇక నా వల్ల కాదు
నా మనస్సు ఆయెను వల్లకాడు
మనిషై పుట్టాను
మనసే పెంచాను
ప్రేమ పై ఈ సమస్త విశ్వాసానికి ఇంత విశ్వసనీయతను పంచి
మానవత్వాన్ని పెంచాలనుకున్నాను
నా విశ్వ ప్రేమ వికటించేలా ఉంది
నా ఓర్పు నీ తీర్పుకై యుద్దాన్ని ప్రకటించేలా ఉంది
అమ్మా
వైద్యం చేయనొచ్చి రోగాన్ని ఎలా వ్యాపింప చేస్తానే
ప్రేమను పంచనొచ్చి యుద్దాన్నెలా చేస్తానే
తల్లీ !
నా వల్లకాదు. నా మనసాయెను వల్లకాడు
నా మాటలతో బీటులు వారిన మానవత్వపు కోటకు
మరమ్మత్తులు చేయ చూసాను
ద్రోహం నన్ను ఒడిసి పట్టింది
నా వ్యూహం బెడిసి కొట్టింది

అస్తమానం నీ నామస్మరణ

అమ్మా అమ్మోరు తల్లి !
నాకు ఈ జనులను అర్థం చేసుకోవడమే కష్ఠమని
జగజ్జననివైన నిన్నర్థం చేసుకోవడం ఎంతో తేలికని
విర్రవీగేవాడ్ని
ఇప్పుడు నిన్నర్థం చేసుకోవడంలోనూ విఫలమయ్యానని అనిపిస్తుంది
గతంలో భవిష్యత్ గాఢాందకారంగా కనిపించేది
భూత ,ప్రేత,పిశాచాల కూత వినిపించేవి
అయితే అస్తమానం నీ నామస్మరణ చేస్తుంటే
వర్థమానం స్వర్గమనిపించేది
ఇప్పుడు భవిష్యత్తు కాస్త ఆశాజనకంగా తోస్తున్నా
మానసికంగా నీకు నేను దూరమై చస్తున్నా
అమ్మా !
అన్నీ దూరమయ్యున్నానీకు దగ్గరైయుంటూ
వీరిని చూసి నవ్వుకునేవాని
ప్రస్తుతం ఏవేవో దగ్గరై నీకు దూరమై నన్ను చూసి నేనే ఏడుస్తున్నా
అమ్మా !
కర్తవ్యం మరిచాను
క్షణిక సుఖాలకు దైనందిన వత్తిళ్ళకు లొంగిపోయాను
ఈ చేయూతకు కారణం నాపట్ల నీలో పుట్టిన కరుణ
ఆ కరుణకు కారణం ఆకలి,దోపిడీల పై నేను చేసిన రణం
ఆ రణం చూసి నా గుండెలోని వ్రణం చూసి చేయూతనిచ్చావు
నేను గాయాలకు చికిత్స చేసుకుంటూ
యుద్దాన్ని మరిచాను
అవును ! నిస్సందేహంగా నేను నీరు గారి పోయాను
నివురు కప్పిన నిప్పునయ్యాను
అవును ! ఏ జీవితాలను చూసి నవ్వుకునే వాడినో
ఆ జీవితమే నా జీవితమైంది

దీనిని నేను అంగీకరించను !
ఓషో అన్నట్లుగా బ్రహ్మచర్యం మరింత కామాందుడ్ని చేసినట్లే
ఈ విరామం నన్ను మరింత ఉత్తేజ పరచినట్టుంది
అమ్మా !
నువ్వు ఆద్యంతరహితవు..
కాని ఈ విషయమై ఆకలి దోపిళ్ళు నీ పై పోటికి దిగుతున్నవి
వీటికీ ఆద్యంతాల్లేవని అనుకుంటున్నారు
అమ్మా !
వీటికి ఆది ఏదో ,అంతం చేసే మార్గం ఏదో నాకు నీవే తెలిపావు
నన్నుసికొలిపావు
హనుమంతుని ముందు కుప్పిగంతుల వలే
నా ప్రయత్నాలేవో చేసాను
వాటికే ముచ్చటేసి ముందుగా నా ఆకలి తీర్చావు
ఆ కలి ప్రభావంతో నేను నీరు కారాను
నివురుకప్పిన నిప్పునయ్యాను

అయితేనేం ఒక్క చిరుగాలితో
బగ్గున మండే అగ్ని గోళాన్నయ్యాను

అమ్మా!
రక్షకులు భక్తులైనప్పుడు
భిక్షకుడనైన నేను రక్షకుడై డైనోజర్ల మీదికి ఈక పుల్లలు విసిరాను

అమ్మా అమ్మోరు తల్లి !

సెలయేరులా ఉప్పొంగాను
నా భావోద్రేకంతో రూపు దిద్దుకున్న రచనలన్ని సముద్రం పాలయ్యాయి
ఇలాగే న్యూటన్ పరిశోధన శాల అగ్ని ప్రమాదానికి గురైతే
నా తప్పిదాలన్ని దహనమయ్యాయన్నాడుట
అమ్మా !
ఎక్కడ ప్రారంభించాను ? ఎక్కడ ఉన్నాను ? నాకు తెలియదు
కాని నేనెక్కడికి చేరాలో మాత్రం ఎప్పుడో పసి కట్టాను
నా సర్వస్వం నిర్మూలమైనా చెక్కు చెదరక ఉన్నది
నా గమ్యం ఒక్కటే !
అదీ నీలాంటిదే
పుట్టు పూర్వోత్తరాలు తెలీవు
ఆద్యంతాలు లేవు
అది కేవలం ఒలింపిక్ దీపం వంటిది
ఎన్నో ట్రిల్లియన్ చేతులు మారి నా చేతికి అందిందని గ్రహించాను

అమ్మా !
నా నోములు ఒమ్ముకావని తెలుసు
తల్లీ !
ఎందుకే ఎందుకే ! నాలో కాసింత పవిత్రతను పెట్టి
దాంతో నా మదిలో చిచ్చు పెట్టి
అపవిత్రమైన ఆలోచనలన్నింటిని జ్నానాగ్నికి ఆహుతి చేసావు
ముక్క చక్కలైన మానవత్వాన్ని బ్రతికించగలనన్న విశ్వాసాన్ని వికసింప చేసి
ఈ జనుల దృష్ఠిలో పిచ్చి వాడ్ని చేసావు
అమ్మా!
ఈ దేశంలో ఆరడుగుల భూమి సైతం దక్కదని తెలుసు
అయినా ఈ దేశం మీద ఎందుకే ఈ కరుణను కల్పించవు
ఆ కరుణ నా మరణానికే దారి తీస్తుంది
అమ్మా !
ఏమిటే నీ ద్యేయం ? అందరు ముందర నా జీవితం చిందర వందర చేసి
హేయంగా తయారు చేసి నాకు ఇంకేం చెయ్యాలని నీ ఉద్దేశం?
తల్లీ
రక్త నాళంలో నిత్యం ప్రవహించే రక్తంలో ఒక్క చుక్క గడ్డ కడితే ఆగి పోయే పిడికిలి గుండెలో ఎందుకు పుట్టించావు ఈ గడ్డ పై ఇంతటి ప్రేమను

ఇక్కడ పుష్కలంగా ఉన్న మానవ వనరులను సమర్థ వంతంగా సమీకరణ చేస్తే మరో మహాత్ముడన్న బిరుదు నాకు దక్కుతుందన్న కకృత్తిని ఎందుకు నాకు కల్గించాచే ?
అమ్మా !
అవుట్ డేటడ్ ఆదర్శాలతో చచ్చి పోతున్నానే
అమ్మా ! యాగం ,యోగం,అన్నింటికన్నా ఈ దేశం కొరకు ప్రాణత్యాగం ముక్తినిస్తుందన్న యుక్తిని ఎందుకు స్ఫురింప చేసావే నాలో ?
తల్లీ !
నా జీవిత గాద సాగే తీరు భయాందోళన కల్గిస్తుంది.
భిక్షకునికన్నా హేయమైన నా జీవిత పంథా
దేశ రక్షకునిగా ఎలా ఎదగనిస్తుందో
అర్థం కాక వ్యర్థంగా కుమిలి పోతున్నానే

తల్లీ !
నువ్వు మాయా శక్తివి. నువ్వే మాయనన్నా చెయ్యగలవు. కాదనను
కాని
హే శక్తీ !
నన్ను శక్తిమంతుడ్ని చెయ్యడం మాత్రం నీ శక్తికి మించిన పనేమోననిపిస్తుందే
అమ్మా ! నేను కామ వాంచలతో కళ్ళార్పని రాతృలే బెట్టర్ అనిపిస్తుందే
నేను ఆకలితో అలమటిస్తుంటే జాగరం చేసిన జాములే మేలనిపిస్తుంది

ఈ కాళ రాత్రిలీ నా శరీరం విలవిల పోతుందేమిటి
తల్లీ !
నువ్వు చేస్తున్న ప్రసారం అందుతూందేకాని
ఈ జనులకు అందినట్టు లేదే
మాంగళ్య దారణకు గడియలు దగ్గర పడుతుంటే
తోరణాలు సైతం కనబడటం లేదేమిటో?
తల్లీ !
ఏ శక్తి అయినా నాకు సంక్రమించగానే నిర్వీర్యమై పోతుంది ఎందుకమ్మా ?
ఈ నిరర్థక జీవితం ఇంకెన్నాళ్ళు?
ఎటు కదలనివ్వని ఈ పేదరిక సంకేళ్ళు ఇంకెన్నాళ్ళే?
అమ్మ !
నా డబ్బు,సమయం ,శ్రమ అన్నీ వృధా అయిపోతున్నాయి
ఎటు వెళ్ళినా ప్రతిష్ఠంభనలే ఎదురవుతున్నాయి ! ఎందుకే

విశ్వ ప్రేమ

అమ్మా అమ్మోరు తల్లి !
నీ ఆట నీది నా ఆట నాది
నీ ఆటకు నేనడ్డు రాను
నా ఆటకు నువ్వడ్డు రాకు
అన్ని ఎన్ని సార్లు చెప్పినా అన్ని సార్లు అడ్డు తగులుతూనే ఉన్నావు

నువ్వు దేవుళ్ళకన్నా ఎక్కువ శక్తి ఉన్నదానివి
ఆ దేవుళ్ళనే కన్నదానివి
నీ ఆటకు నా ఆట అడ్డమని ఎలా అనుకుంటున్నావే
మానవులకే పరిమితమైన ఇన్ఫిరియారిటి కాంప్లెక్స్
దేవతవైన నీకెలా సోకిందే !
కేవలం మానవమాతృడనైన నేను
జగన్మాతవైన నీ జగన్నాటా దృశ్యాలను ఎలా మార్చగలనే
నా దగ్గర్రున్నది ఒకె గుళిక అది విశ్వ ప్రేమ
అన్ని రోగాలకు,సమస్యలకు దీనినే సిఫార్సు చేస్తుంటాను
ఈ అండచరాచర ప్రపంచాల సృష్ఠికర్తవు నువ్వు
నీ నీ స్థానం .. నీ ఆస్థానం
అయినా ఆగదు నా ప్రస్తానం
నీ ఆయుధాలు నీవి
నా ఆయుధం కూడ నీదే
సాధించాలనుకున్నా ఆదర్శమే నా ఆయుధం
నా మరో ఆయుధం
నా అక్షరం
అదే భలీయం.. ఈ క్షణం నా అక్షరమే రెక్కలు గొడికి
హనుమన్నవలే గాలిలో ఎగిరి
తెలుగు వారి గుండెల కిటికీల్లోకి ఓ భ్రమరంలా దూసుకుని పోగలిగితే
హే భ్రమారాంభా !
అప్పుడు చూస్తావులే .... నా ఆయుధపు పదును
అదను చూసి దెబ్బ కొట్టడం కాదే....
కేవలం పేదరికంతో నన్ను గెలవడం కాదే .....
అఖండ ప్రజానీకం మనస్సులు గెలువు
మానవ హృదయాలను స్వర్థపు చీకటి కమ్మేస్తుంటే ...
రాసుకుంటే రవ్వ రాలు నా అక్షరాలు మరో దీపాన్ని స్మరియింప చేయగలవు
ప్రజల గుండెలను తేజోమయం చేయగలవు.

ఈ సత్యం నీకు తెలుస్తే పేదరికంతో
నన్ను కట్టిపడేసేదానివి కావు....
ఏంచెద్దాం !
వీరిలాగే నీవు కూడ నీ విధివ్రాతకు భానిసవి కదా !
అయినా నా ప్రయత్నం ఆగదు
నాటి రుషులు, మహర్షులు వెదజల్లిన
విశ్వపేమను ఈ విశ్వాన వికసింప చెయ్యడమే నా లక్ష్యం
నాకు లేదు ఆయుక్ష్యం
పిండ ప్రవేశ క్షణం నుండి క్షణం క్షణం నా జీవిత గాదను
నువ్వెటు నడుపుకు పోతున్నావో ఓ పొడుపుకథను విప్పినంత తేలికగా తెలుసుకో గలను.
అందుకే సత్యంతో మెలగడం జ్నాన జ్యోతిగా వెలగడం
మొదలు పెట్టాను
చెదలు పట్టిన విదానాలను విరిచి ఆదర్శాలను అమలు చెయ్యించాలని అరచి అరచి అలిసాను
నువ్వు నాలో వెలిసాక
భూత,భవిష్యత్ ,వర్థమానాలు తెలిసాక
ఈ వ్యర్థ మానవుల పరిరక్షణే ద్యేయంగా వీరి ప్రతినిధినై గొంతెత్తి కూస్తున్నాను
నా ఆయువును దార పోస్తున్నాను
అమ్మా !
నా ఆయుధాలు నీవి
నా లక్ష్యాలు నీవి
నీవి కానివి ఏవి
అంతా నీ ఆజ్నా అయినా సడలనివ్వను నా ప్రతిజ్న
ప్రజ్నతోనే చేస్తున్నా ఈ అజ్నాన సమరం
దీంతో కావాలి నా బ్రతుకు అమరం

Note:
నా ఈ కవిత మిమ్మల్ని ఆకట్టుకున్నట్లైతే నా రచనలను మరింత చదవడానికి
ఇక్కడ నొక్కండి
లేదా ఇక్కడా నొక్కొచ్చు

అంబపలుకు !

అమ్మా అమ్మోరు తల్లి !
అంతా అయోమయంగా ఉంది
ఓటమి - పేదరికాలు నాకు
కొత్తేమి కావు
బాల్యమునుండి ఏదో మోతాదులో ,ఏదో రూపంలో
పేదరికం నన్ను వెంటాడుతూనే వచ్చింది
అయినా నేను బెదర లేదు
ఒకప్పుడు అజ్నానం దైర్యాన్నిచ్చేది
ఇప్పట్లో జ్నానం ఓటమి నాతో కుదుర్చుకున్న
కూటమి నేటివరకు కొనసాగుతూనే ఉంది
నాకన్నా సోమరి మరొకడుండడు
నాకన్నా నాస్తికుడు మరొకడుండడు
నా వ్యూహం ఎంతటి లోప భూయిష్ఠమో నాకన్నా నీకే బాగా తెలుసు
అయినా ఇటీవల విజయం అతిథిలా అడుగు పెట్టింది
నా పేదరికం పై ,ఒంటరితనం పై పిడుగులా దిగింది
ఏది ఏమైతేనేం?
మళ్ళీ పాతకథే మొదలైంది
సరస్వతి సాంగత్యంలో నాడు లక్ష్మి దూరమైతే
నేడు సంపదలో సరస్వతి దూరమైంది
అందుకని లక్ష్మి స్థిరవాసానికి పూనుకోలేదు
నాలో ఏలోపం ఉన్నా నా లక్ష్యంలో సున్నా
నా లక్ష్యం వెనుక ఒక దేశం ఉంది
పాలవీథినుండి నేనందుకున్న సందేశం ఉంది
నా లక్ష్యం వెనుక నూట ఇరవై కోట్ల మంది
ప్రజలున్నారు
నా లక్ష్యం కనుక కైవశమైతే
ఈ నూట ఇరవై కోట్ల మంది
స్థూల కోరికలు నెరవేరుతాయి
ఇవి కాక మరొక లోకం ఉంది అని నేను చాటి చెప్పగలను
నా దారి పట్టించగలను
ఆకలితో అలమటిస్తున్నవానికి
అమ్మవు నీకన్నా అన్నమే పరబ్రహ్మం
అమ్మా !
శక్తివి కదా ..నాకు శక్తినివ్వు
ఈ దేశాన సర్వ జనులు
సుఖంగా బ్రతకాలి
అందుకు నా లక్ష్యం నెరవేరాలి
నవ గ్రహాల నడక ఎరింగిన వాడను
వారి ఖర్మ ఫలాలను మరో మార్గములో అనుభవించేలాచెయ్యగలవు
డోంట్ ఒర్రి..
ప్రాణ రక్షణ, కూడు,గూడు,గుడ్డ,సెక్స్ వీటికి గ్రహాల అడ్డును ఎలా తొలగించాలొ నాకు తెలుసు
నాపథకం అమలు కానివ్వు
కాస్త శక్తినివ్వు
నా పై ప్రేమ పై నాకు అనుమానం లేదే
వీరి విజ్నత మీదే నాకు విముఖత ఉంది
అదే ప్రపంచ బ్యాంకు,అదే అగ్ర రాజ్యం అదే మల్టి నేష్నల్ కంపెనీలు నా కొంపను కూడ ముంచేస్తున్నాయి
నా కరుణను సైతం అడుగంటేలా చేసి కంపెత్తిస్తున్నాయి
నా గుండెను
అయినా వీరిలా నేను దిగజారలేదు
నేను వద్దనుకున్న సమాజం
కొరకు సర్దుకు పోతున్నా
చిటికలో నా నమ్మకాలను ఒమ్ము చేసినా
పాములా కాటేసినా
నా చిటికన వేలందించి తీసుకు వెళ్ళాలనే చూస్తున్నా
ఆశిఖరాలకు వైపున..

అమ్మా!
భయమేస్తుందే....

దడగా ఉందే!
నా అద్యయనం పొరభాటేమో?
నావిద్య వీరిముందు పారదాయెనే
వీరి నక్క జిత్తులతో కుక్క చావుకే సిద్దమైనట్టుందే

ఇక నా పిచ్చిముదరాలి లేదా కుదరాలి

పిచ్చి
అమ్మా ఏమిటి నీ ఉద్దేశం?
ఈ నా దేశానికి వినిపించవా నా సందేశం
ఏమై పోవాలి ఈ దేశం?
శ్రమించాను అహర్ణిశం..
కల్పించవా అవకాశం?

నా సర్వస్వం అర్పించినాను వీరికోశం
తెరిచి ఉంచాను నా జ్నాన కోశం
కనీశం కదలనన్నా కదలడం లేదు ప్రజా ద్రోహుల కోట కూసం
కావాలి ఈ దేశం నా కైవశం
ఆపలేనా సర్వ నాశం

అమ్మా
పీదరికపు సంకేళ్ళను
పగుల కొట్టడానికి భానిసపు సంకేళ్ళకు సైతం చెయ్యి చాపాను
సంకేళ్ళు రెండైనవే కాని నా లక్ష్యం నెరవేరే సూచనలు సైతం కనిపించడం లేదు
ఏమిటి ఈ నిర్లక్ష్యం?
ఊరికే ఉత్తుత్తే జపిస్తుంటాడు
నవ జీవన బృందావన నిర్మానానికి తపిస్తుంటాడు
జపించనీ... విని తరిద్దాం..
తపించనీ కని ఆనందిద్దామని అనుకుంటున్నావా?

నా ఓర్పుకొద్ది వేచి చూస్తా నీ తీరుపుతో రావాలి మార్పు
లేదా నాకు నేనై వ్రాస్తా కొత్త తీర్పు
అమ్మా !
కేవలం మానవ యువతులు
అంద చందాలకే పిచ్చెక్కి పోయిన మగ పురుగును
నీ సౌందర్యానికి దిమ్మ తిరిగి
నీ లీలామృత సేవనంతో
ఈ లోకంతో సంబంధమే తెగియున్న వాడ్ని
నీ పాదాల చెంతే ఆగియున్నవాడ్ని
కాగిన ఇనుములా నీ హస్త స్పర్శకై వేచి ఉన్నవాడ్ని
నీ చేతిలోని త్రిశూలమంతటి శక్తిమంతుడ్ని
నీ బిడ్డల జీవితాల పై
పాలకుల దుష్ప్రరిపాలన గొడ్డలి పోట్లే పొడుస్తుంటే
ఆవేశంతో ఊగి పోతున్నాను
ఈ ఆవేశం తగ్గుముఖం పట్టాలంటే
నువ్వు ఈ ప్రజా శతృవులపైకి నీ విల్లు ఎక్కు పెట్టాలి
ఇక నా పిచ్చిముదరాలి లేదా కుదరాలి

ఏదేదో చేసావు మరేదేదో చేస్తావు.
ఏదో చెయ్యవే ..నన్నేదో ఒడ్డుకు చేర్వవే

ఇక నా పిచ్చిముదరాలి లేదా కుదరాలి

నాతో వీరికి మిగిలేది నాశనం

అమ్మా అమ్మోరు తల్లి !
ఎటో వెళ్ళి పోతుంది ఈ జీవితం
మరేదీ కాదిందులో శాస్వతం
అయినా ........
ఎటో కదిలి లక్ష్యం వదలి వెళ్ళి పోతున్న జీవితం
పెను భూతమై బెదర కొడుతుంది
అందమైన కలలను చెదర కొడుతుంది
ఎ లెటర్ టు ది గ్రాండ్ ఫాదర్లో మనవడిలా ఉన్న నేను
తాతవు కాకున్నా జగన్మాతవైన నీకు వ్రాస్తున్నా ఈ లేఖ
ఈ మళ్ళింపులతో ఘఠణలు సంఘఠణలు ఎక్కువై
జ్నాపకాల మోత పెరిగి పోయింది

జీవితం , నాకు నేను
గీసి ఉంచిన లక్ష్మణ రేఖను దాటేసుంది
స్వార్థపు డ్రాగులాను వాటేస్తుంది
సర్పంలా కాటేస్తుంది
నాలో దడ పుడుతుంది
ఆత్మ విశ్వాసపు జాడ కనబడటం లేదు

నేననుకున్నంత కాదేమో నవ భారత పున:నిర్మాణం
నేననుకున్నంత తేలిక కాదేమో నా సందేశాన్ని వినిపించటం
అమ్మా నిన్ను తలచుకుంటూ
కమ్మని గేయాలు వల్లించుకుంటూ
గుండెలో తుళ్ళింతలతో తొలకరి చినుకులవంటి
నీ కరుణామృత జల్లులతో తడిసి ముద్దైయ్యేటంతటి
స్వార్థం నా గుండెలో లేదెందుకో

సమ సమాజ సృష్ఠియే ద్యేయంగా సంపూర్ణ నాస్తికత్వంతో
ఫుల్ టైం శ్రమించే నాలో నిస్వార్థం లేదెందుకో?

అమ్మా !
ఈ రెండు గుర్రాల పై స్వారి నా బుర్రెలో వెర్రెక్కిస్తూందే
నేనూ మనిషినే కాదా?
మరి ఇంత పెద్ద గుండెను ఇచ్చినా(కె)వెందుకే?
ఆ గుండెలో నిండుగా వెలసితివెందుకే?

వెలిసావు సరే నన్ను కలిసావు సరే
ఈ మూర్ఖులకు నేను విక్రమార్కుడనన్న సంగతి చెప్పవెందుకే?
ఈ అగుచాట్లు తప్పవెందుకే?

వీరిని ఉద్దరించ వచ్చిన నన్ను చీదరించటం...
చీదరించిన పాపానికి చితికి పోవడం
ఇంతేనా వీరికి నాకు ఉన్న సంబరం

అమ్మా !
నాతో వీరికి మిగిలేది నాశనం
ఒక్కడు సమ సమాజ సృష్ఠికై నేను పొందిన వరం
వీరి అజ్నానంతో వీరు నాకు కల్పించే అవమానాలతో వీరి పట్ల శాపంగా మారిందే

అమ్మా దయ చూడవే !
నేను ప్రజా రక్షకుడ్ని నా చేత ప్రజా భక్షణ చెయ్యిస్తావా?
You might also like:

మహా రచయిత్రి

అమ్మా అమ్మోరు తల్లి !
ఎన్నో కథలు చదివేను
మరెన్నో కథలు వ్రాసాను
ఎందరో మనుషుల జీవితాలను చూస్తున్నాను
వింటున్నాను
మరెందరో మనుషుల జీవిత సుఖ దుఖాల్లో పాలు పంచుకున్నాను
అయితే అమ్మా !
నా జీవన గాదలో మాత్రం ఎందుకే ఇంతటి డ్రాగింగ్
నా తల్లికి కుచేలుని భార్య పేరు కుదిరింది కాబట్టె
ఈ దారిద్రియం ఇలా వెంటాడుతుందా
పుట్టిన నాటినుండి నేటి వరకు
ఏదో రూపంలో ఏదో మూతాదులో
దారిద్రియం !దారిద్రియం!!
ఈ దారిద్రియాన్ని దగ్దం చేసేందుకు
ఎంతగానో దిగ జారాను
కాని దారిద్రియంలో మాత్రం మార్పు లేదు
నీడలా..పాపంలా.శాపంలా..మరణంలా వెంటాడుతూనే ఉంది
అవీ గడిచి పోయాయి
తపస్సు చేసాను
ఒకే భీజాన్ని 9 సం.లుగా ద్యానిస్తూనేఉన్నాను
ఏవో కొన్ని అధ్భుతాలు జరుగుతున్నాయిగాని
నా దారిద్రియం మాత్రం దగ్దం కావడం లేదు
ఎందుకు?
1967 1986 మద్యన గడిచిన 19 సం.ల కాలాన్ని విడిచి పెడదాం
అప్పుడు నేను కేవలం తెలివైన చిలుకను మాత్రమే
మరి నేడు
హే మదుర మీనాక్షి !
చేతిలోని చిలకంత స్థాయికి ఎదిగాను
హే అంబా!
నా పలుకులు నీ పలుకులంతటి భీబత్సాన్ని సృష్ఠించేస్తున్నాయి
పూజ్యులు పూజ్యాలవుతున్నారు
రాజ్యాలే గడ గడ వనుకుతున్నాయి
మరి నా దారిద్రియం మటుకు
కొన ప్రాణంతోనన్నా కొట్టు మిట్టాడుతూనే ఉంది
పొరబాటున నా దారిద్రియానికి
చిరంజీవత్వం ప్రసాదించ లేదుగదా?
పొరభాటున నా దారిద్రియానికి అమృత సేవనం గావించలేదుగదా?
నేను చెయ్యాలి యుద్దం
అందుకు నా దారిద్రియం కావాలి దగ్దం

నిందా స్థుతి

హే అంభికా పురవాసిని!
నీ అంభికాపురాన అష్ఠ దిక్కుల్లోను ఉన్నది పరీక్షల పేరిట
నీవు ప్రదర్శించే నీ సేడిజమే..ఆ ప్రదేశానికి కేంద్ర బింధువు కేవలం నీ అహంకారం

అందుకేనేమో నీ బిడ్దలు సైతం స్యేడిస్తులుగా ఉన్నారు
బలహీణుల పట్ల స్యేడిజంగా భయిట పడే కృరత్వం
భలవంతుల పట్ల మసాకిజంగా దర్శనమిస్తుంది
అందుకేనేమో..

పాలకులు పెట్టే హింసలను ఎంజాయి చేస్తూ వారిలోనే ఏదో ఒక గ్రూపును ఎన్నుకుంటున్నారు. పార్టీల పేరు చెప్పి తన్నుకుంటున్నారు

నువ్వు అష్ఠైశ్వర్య ప్రధాయినివే
ఎవరికి?
అగ్ర రాజ్యానికి, స్వదేశి టాప్ టెన్ ట్రిల్లియనర్లకు
మత వైషమ్యాలను రెచ్చ కొట్టి
మరి ఈ దేశాన్ని విభజించ చూసే పొరుగు దేశానికి
కొమ్ము కాసే మూర్ఖులకు
అరిచేత వైకుంటాన్ని చూపి స్వంత
మామకు భూలోకానే యమలోకాన్ని సృష్ఠించిన
వెన్ను పోటు వెదవలకు

నువ్వు అనుగ్రహ ప్రధాయినివా..?
ఎవరికి ?
వడ్డీలు కట్నాలు లంచాలు దండుకుంటున్న
దగుల్ బాజీలకు,అధములకు

నీవు అఖిలాండేశ్వరివా? కాదు
అఖిలాండాన్ని పాలించేది అగ్ర రాజ్యం
ఇక్కడి దేశాధినేతలు ఏ బ్రాండు క్యేండోం వాడాలో కూడ వారే నిర్ణయిస్తారు

ఈ విషయాన మేము కాస్త అదృష్ఠవంతులం
మమ్మల్ని ఏలే అవకాశాన్ని ఆకలి దోపిడీలకు ఇచ్చావు.
నువ్వు అభయవరద హస్తినివా..
కాదు..
అభయమిస్తానని ఆశ చూపి ఆపదలోకి నెట్టి లౌకిక జీవితం
వరదై భక్తుడు శవమై కొట్టుకుపోతుంటే
చూస్తుండి పోయే చేత కానిదానివి

నువ్వు అమృతమయివా?
కాదు ఈ మాట నిజమైతే నీ ఈ సృష్ఠి కూడ అమృతమయమై ఉండి ఉండాలి
నీలో సగం శివుడున్నాడుగా అతడారగించిన అలాహలం నీలోను ప్రవహిస్తుందేమో?
అందుకే ఈ సృష్ఠి ఇలా ఏడ్చింది

నువ్వు ఆనందమయివా?
ఈ మాట నిజమే కాబోలు
అందుకే ఉన్నవాని దోపిడి, లేనివాని ఆకలి స్థూలంగా వేరే అయినా
ఇరువురిని ఆనందానికి చేరువగా అదే మరణలోక ద్వారానికి
దగ్గరగా నడిపిస్తున్నాయి.
ప్రస్తుతానికి ఏం జరిగినా అతి త్వరలో అంతా ఆనందంగా పరమానందంగా
మారక తప్పదు.
నువ్వు అన్న పూర్ణేశ్వరివా?
మా దేశ పరిస్థితిని పట్టి చూస్తేనే ఇందులో నలబై శాతం అబద్దముంది
అవును నా దేశాన నలబై శాతం మంది పస్తున్నారుగా

నువ్వు ఆద్యంత శివరూపిణివా
నాలా నమ్మి చెడి పడి చచ్చినవారి బూడిదలేగా నువ్వు వాడే టాల్కం పౌడర్
శివుని చిరునవ్వు ప్రమాద సూచికైతే
నువ్వు జస్ట్ నీ ఉనికితోనే కునుకు లేకుండా చేస్తున్నావు
వనుకు పుట్టించేస్తున్నావు శభాష్ !

అన్నట్టు నీకన్నా శివయ్యే బెటర్ అతను చిరునవ్వుతో రాక్షసులనే భూడిద చేస్తాడు
కాని నువ్వు పట్టు వస్త్రాలు మోసిన గాడిద చందాన నిన్ను నీ నామాన్ని మోసే నావంటి భక్తులను సైతం దగ్దం చేస్తావు

నువ్వు ఆధార శక్తివా?
కాదు. ఈ బిరుదు
అసంబంధం
మా జీవన రథాన్ని నడిపే ఇందనం దనం. అదే ఇక్కడి ఆధార శక్తి
అదొక్కటే దర్మాన్ని సైతం నిద్ర లేప గలదు
ప్రళయ కాల దుర్గను సైతమ్ నిద్రింప చేస్తుంది.

నువ్వు ఆర్థ జన రక్షిణివా?
కాదు అర్ద రక్షిణివి
కన్నవానికి కాసింత ప్రేమ చూపకున్నా తనకంటే ఉన్న వానికి బూట్లు మోసే అర్థ జనులకే రక్షిణివి.

నువ్వు బింధు స్వరూపిణివని మా వారు గుర్తించారులే
అందుకే మా వారు నిత్యం నిన్ను సారా బింధువుల్లో వెతుకుతున్నారు

నువ్వు చతుర్వర్గ భల ప్రధాయినివా?
కాదు ఇక్కడ జరిగే పవర్ వార్లో మని,మాఫియా, మీడియాలే త్రివర్గ భలాలు.
వాటిని నువ్వు ఈయ జాలవు.

నువ్వు చంద్ర మండల వాసినివా?
మా వాళ్ళు చంద్రమండలం వెళ్ళినప్పుడు నువ్వు ఏదో యుగాన తాంబూలం దరించిన వేళ గిల్లి పారేసిన కిళ్ళి ముక్కలు సైతం వారికి కనిపించలేదెందుకు?

నువ్వు దివ్య సుందరివా?
ఏ అందాల రాశి పోటీలో పాల్గొని గెలిచావే .. నీ తరపున ఏ ఈవ్ టీజింగ్ కేసు మా పోలీసులకు అందలేదు..
నువ్వు దివ్య సుందరివా?
మా మునిముని టు ది పవర్ అఫ్ ట్రిల్లియన్స్ భామ్మవు నువ్వు
న్ఉవ్వు దివ్య సుందరివి కావడమేమిటే
నువ్వు దైత్య నాథ గృహిణివా?
ఏ గృహిణియన్నా తన శరీరంలో సగం, భర్త శరీరంలో సగం నరికి వేస్తుందా?
______________

నన్ను మాత్రమే చూడు

అమ్మా అమ్మోరు తల్లి !
నన్ను చూడు నన్ను మాత్రమే చూడు
నా చుట్టు ఉన్న చీకటిని చూడకు
నేను నిన్నే చూసా
నిన్ను మాత్రమే చూసా
నీ వెనుకున్న భూతు పురాణాల గాదలను చూడలేదు
నీ వెనుకున్న బలుల భరతాలు చూడలేదు
నాలాగే నువ్వూ నన్ను మాత్రమే చూడు
అమ్మా నీకు ఎన్ని సార్లు చెప్పానే
వెన్ను విరిగిన దేశం కోశం పొట్ట చేత పట్టి
పట్టడన్నం కోశం తమ సర్వశ్వం ఒడ్డుతున్న
నీ బిడ్డల కోశమే ఈ యుద్దమని
నేను పొట్ట చేత పట్టుకునే బ్రతికినా
నువ్వాదుకుంటావన్న విశ్వాసంతోనే
నా లక్ష్యాన్ని జార విడువ లేదని ...
అసలు ......అసలు ఏమిటి నీ ఉద్దేశం?
ఎలాగైతేనేం ..కమిట్ అయ్యాడు
ఇక దారి తప్పడన్న అతి విశ్వాసం ఏమన్నా దాగుందా
నీ నిర్లక్ష్యం వెనుక..

నన్ను పుట్టించిన నీకే నా మనస్సులోని పెను భూతాలు
కనిపించలేదంటే అవి ఎంతటి లోతుల్లో ఉంటాయో
నన్నెంతగా తింటాయో ఊహించుకోవే

అమ్మా !
సన్మార్గంలో విజయం సాధించ లేకుంటే
దున్మార్గాన నన్ను నడిపించడానికి నాలోనే ఉన్నాయి
పెను భూతాలు
అమ్మా ..ఇప్పటికన్నా నన్ను చూడు.. నన్ను మాత్రమే చూడు
కర్ణుడు కౌరవులతో ఉన్నాడని అతని సహజ కవచ కుండలాలు ఊడి పోయాయా?
వాటికన్నా తీసిపోయావా నువ్వు
నా చుట్టూ ఉన్న చీకటేదో నాకు తెలుసు. నువ్వు దిగి వస్తే అది
తనంతట తనే తొలుగుతుంది
నా ఆత్మ కోటి సూర్యప్రకాశంతో వెలుతుంది
అది తొలిగేంతవరకు నువ్వు కాచుక్కూర్చుంటే తేజోమయివన్న
నీ బిరుదు మెటాష్ అవుతుంది
రావే ..నింగినుండి దిగి వస్తావో
మూలాధారమునుండి లేచెస్తావో నాకో తెలీదు
రా రావే తక్షణం రా..
అపాయాలకు , నువ్వు ప్రసాదించే ఉపాయలకు సరిగ్గా 13 నెలల తేడా ఉంది.
ఇదేనా నీ శిష్ఠ రక్షణ.. ఇదేనా నీ దుష్ఠ శిక్షణ

నువ్వే దెయ్యమైయ్యుంటే ఒక్క తులశి ముక్కతో నిన్నాపి ఉంటా
ప్రియురాలివైయ్యుంటే గుడ్ బై చెప్పి ఉంటా..
భార్యవైయ్యుంటే విడాకులే ఇచ్చి ఉంటే
పార్ట్నర్ అయ్యి ఉంటే డీడ్ చించి మొఖాన కొట్టి ఉంటా
ఫ్రెండ్ వై య్యుంటే నీతో శతృత్వానికే సై అనుంటా

ఏదీ కాక అన్నీ నీవై ఇలా చంపుకు తింటున్నావేంటి
హ్రీంకారం జపించా..121 నెలలు నిర్విరామంగా ఎండా ,వానా,పస్తు,
విందు,దనం,పేదరికం,సన్మానం,అవమానం ఏది వచ్చినా ఏది పోయినా జపించా.. నీకు పసుపు నీరు ఉంచా
నీవు రక్తానికి అలవాటు పడ్డ డ్రాగులావలే తయారయ్యావు
నీతో ఎలాగే ఏగడం

నాడు నేడు

అమ్మా !
నాడు అన్యాయానికి తలవంచక
ప్రజల దృష్ఠిలో విధివంచితుడనైనా నీ విధి కంచె లోపే నిశ్చింతగా ఉండేవాడ్ని
నేడు న్యాయానికి నిలబడక పిరికిలా పారిపోతూ
నాకు నేను దొరికి పోయి గిల్టితో చచ్చి పోతున్నా
పేదరికం తుఫానులా
నన్ను అతలాకుతలం చేసినా
మరణంతో హలో చెప్పే దమ్ముండేది
నేడు..
వనరులున్నా వాటిని సద్వినియోగం చెయ్యక
లక్ష్య సాధనకు వెచ్చించక
అచ్చం నా సమకాలీనులవలే
మానవత్వానికి సమాధి కడుతున్నా
అమ్మా !
నాకన్నీ కావాలని ఏనాడూ కోరలేదు
నేడూ అంతే ..
కాసిన్ని వనరులు చూపావు
ఈ దేశాం గురించిన నా కలకు
అక్షర రూపం ఇవ్వనీ
ప్రపంచ బిక్షా పాత్ర ఇదని సర్దుకుని
నిస్సత్తువతో నీరుగారిపోవడం కన్నా
దీనిని ప్రపంచ అక్షయ పాత్రగా మలచ గల మార్గం ఒకటుందని
ఆ మార్గాన ఆడుగు ముందుకేస్టే ఆ స్వర్గం దిగి వస్తుందని వివరించనీ..

Wednesday, August 17, 2011

సంవాదం

నీవు: నిన్నేమని సంభోధించను ..నువ్వు చండ,ప్రచందులకు తక్కువ, మధు కైటపులకు ఎక్కువ
నేను: రాక్షసులతో కలబడి,కలబడి రాముడంతడి వాడ్ని నన్ను రాక్షసుడంటావా?
నీవు: ఆంత మాత్రం దిగివచ్చినందుకు ఆనందమే
నేను: మరి ఆనందించకు. రామన్న పై కూడ కొన్ని విమర్శలున్నాయి నా మదిలో
నీవు: ఏల మా అందరిని ఆడి పోసుకుంటావు. మరి మావద్దే సాయం అర్థిస్తావు
నేను:నా కార్యానికి మీ కాళ్ళు పట్టడం లేదు. ఇది ప్రజా కార్యం నాకు సాయపడటం మీ కర్మ కాని పూర్తి భాధ్యత నా పై మోపి
మీరు మాత్రం చేతులు ముడుచుకుని కూర్చుంటే ఎలా వదలి పెడ్తాను
నువ్వు:గ్రహం, గృహం,మంత్రం,యంత్రం మంచి చెడ్డ అన్ని చూడాలిగా
నేను:ఇవన్ని మావారి తంతు నాకు సాయ పడటమే మీ వంతు
నీవు:ప్రళయాన్ని ఆపగలవా నీవు
నేను: మీ తడపాట్లు చూస్తుంటే గలననే అనిపిస్తూంది
నీవు: ఏమి ఆపుతావు నీ మొహం
నేను: నీ మొహాన్నే ఆపగలను నా మూడో కంట
నీవు:నీ జెండా ఎగరాలంటే ఎన్నో అజెండాలు మార్చాలి
నేను: మార్చండి. మార్పు లేనిది మార్పొకటే
నీవు:ఇంతకీ నీ డిమాండు ఏమో ఏడువు..
నేను:ఇలా నువ్వడుగుతూనే ఉండాలి అయితే నేనేమి ఆడుగగూడది
నీవు:పోని నీలక్ష్యమేమో అదన్నా ఏడువు
నేను:ప్రపంచపు భిక్ష పాత్రగా తయారైన నా దేశాన్ని అక్షయ పాత్రగా మార్చాలి
నీవు:తద్వారా నీకు ఒరిగేది
నేను:భవిష్యత్తులో నా అభిమాని ఎవడన్నా తంతి తపాలా శాఖా మంత్రి అయితే నా మొఖంతో తపాలా బిళ్ళ విడుదలవుతుంది
నీవు:అదేందో నీ కలంతో సాధించుకోగల అల్ప కోరిక కదా. నా శూలంతో ఏం పని?
నేను:నా కలం అంతగా కదలాలంటే నాకో సైన్యం కావాలి అది ఆకలి దోపిడీల నాశనమే ద్యేయంగా కదలాలి.దాని తాకిడికి ఈ దేశాన్ని పట్టిన వ్రష్ఠు వదలాలి
నీవు:అంతొద్దు ఫీజు పోతుంది
నేను:పోని ..శూలినివై నీవుండి నీకు ప్రతిరూపమైన నా మాతృభూమి పరిరక్షణలో నాకు ఫీజు పోతే నీకు పోయినట్టేగా
నీవు:పిచ్చివాడా దేశ రక్షణ నీ ఒక్కనితో సంభవమా?
నేను:హే శాంభవి ! నీ సాయమే నాకుంటే అసంభవాలను సంభవం చెయ్యడం నాకు సరదా
నీవు:నేను నీకు సాయపడతానని నీకు వరమిచ్చినట్లు నాకు గుర్తు లేదు
నేను:పోనిలే ఇప్పుడిస్తే పోలే
నీవు:ఎప్పటికీ ఇవ్వను
నేను:పోనిలే నీ సాయం తెచ్చుకునే ఉపాయం ఉండే ఉండి ఉంటుంది
నీవు:ఏమిటా ఉపాయం ఇలా వచ్చి రాని బాషలో పిచ్చి పిచ్చిగా గీకడమేనా?
నేను:సంజీవిణి మంత్ర సిద్దులు,రాక్షసగురువర్యుడైన శుక్రాచారి నా జాతకాన వాక్ స్థానంలో ఉండి నా పిచ్చి మాటలకు ప్రాణం పోస్తాడు.పరమోచ్చ స్థితి పొందిన గురుబలంతో నా మాట కాగలదు భావి భారతానికి అభ్యుదయ భాట
నీవు: ఓరి టక్కరి !నీ కలంలో సారా ఉందో, సిరా ఉందో ..
నేను:అయితే నా భుట్టలో పడ్డావన్న మాట. పోనిలే తల్లి బతికించావు. ఇంత మాత్రం నీలో రసికత్వం నీలో ఉందనుకోలేదు..నన్నేదో రాక్షసులకు పోల్చినట్టు గుర్తు వధిస్తే పోలే
నీవు:నీకు నా దర్శన భాగ్యం కలగ కూడదనే ఆగుతున్నా
నేను:పిచ్చి తల్లి నీ దర్శనమే కావాలనుకుంటే నాకు 48 దినములు చాలే .పేదవానికి అతని పళ్ళంలో మూడు పూటలా నువ్వు అన్న పూర్ణేశ్వరివై దర్శనమివ్వాలన్నదే నా డిమాండు. నన్ను వధించటానికి గుండెలు చాలక సాకులు చెభుతున్నావు. నన్ను వధించనొస్తే నాకు నీ దర్శనం కలిగి పోతుందనే గా నీ కుళ్ళు పోని నా కళ్ళు గట్టిగా మూసుకుంటా , నీ ఖడ్గంతో నా తలకాయ కోసుకెళ్ళు హాయిగా..
నీవు:నీలో జ్నాన దీపం వెలిగించింది నీ సుఖ సంతోషాలు నీ ముక్తి కొరకే ఇలా అందరికీ వకాల్తా పుచ్చుకోవడానికి కాదు.
నేను: ఇంత మూర్ఖంగా ఆలోచిస్తావనుకోలేదు. నువ్వు ఒక్క దీపం వెలిగించావు. అక్కడికి నీ పని అయి పోతుంది. ఆ దీపంతో కోటి దీపాలు వెలిగించబడినా నీకొచ్చిన నష్ఠమేమిటే
నీవు: నష్ఠం కాదు. అది అజెండాకు విరుద్దం
నేను:పోనీ నేను సుఖ సంతోషాలతో జీవించి ముక్తి పొందాలన్నది నీ అజెండాలో ఒక భాగమే గా ?
నీవు :అవును
నేను:మరి స్వార్థంతో ముక్తి అసంభవం ఈ పాయింటు నీకు సమ్మతమే గా
నువ్వు:ముమ్మాటికి
నెను:అయితే నేనొక్కడ్ని సుఖ సంతోషాలతో వర్దిల్లి స్వార్థంతో నా మానస సరోవరం కలుషితమై పోతే నువ్వెలా స్థిరవాసం చెయ్యగలవే నా గుండెలో
నీవు: కలిలో కాలుష్యాలకు తట్టుకునేలా తగిన ఏర్పాట్లతో ముస్తాబయ్యాకే వస్తా నీ మానస సరోవరానికి
నేను: సరే ..ముక్తినిచ్చేది నువ్వే కాబట్టి నువ్వెలాకో ఇస్తావు. ఇక భుక్తి కథకొస్తే..
నువ్వన్నట్టే నేను స్వార్థం పెంచి సుఖంగా బ్రతుకుతున్నప్పుడు ఈ దుష్ఠ పాలకుల ఆఠవిక పాలనకు బలై తన ఉనికిని కాపాడుకోవాలన్న తపనతో మానవత్వం మరచి మ్రుగమైన బాధితుడొకడు నా ఇంటి పై పడితే
నీవు:అది అజెండాలో లేదు .. అయినా దేశం కోసం ప్రాణ త్యాగం చేస్తానని విర్ర వీగావు. అప్పుడే ప్రాణం మీద ఇంత తీపా..
నేను: అమ్మా నేను నా దేశం కోసం మరణిస్తే ఆ మరణ మ్దంగం వెనుక మానవత్వం ద్వనిస్తుంది. మరి నా సోదరుడే నా ఇంటి పై పడినప్పుడు నేనతన్ని చంపినా మానవత్వం మంట కలుస్తుంది ..ఆ పెనుగులాటలో నా ప్రాణం పోతే మానవత్వం బగ్గున కాలి బూడిదే అవుతుంది .. నా సమకాలీనులు ఈ సంఘఠణను కేవలం బ్యేనర్ వార్తగా చూసి మర్చి పోవచ్చు .. కాని నేను కలలుకనె నవ భారతం ఆవిర్భవించాక భావితరం నన్ను క్యేనిబల్ గా నిర్దారిస్తుంది. ఆ నిర్ధారణ నాకు కాదు నీకు చంప పెట్టువంటిది
నీవు:నేను సృష్ఠి కర్తను
నేను:పిల్లలు తల్లి తండ్రుల భానిసలు కారు. తల్లితండ్రులు పిల్లలను ఈ లోకానికి రానిచ్చిన ముఖద్వారాలు మాత్రమే..స్వేచ్చ నా జన్మహక్కు . దానిని ఎవరి కొరకూ చివరికి నీ కొరకు సైతం వదులు కోను.
నీవు:బిడ్డా..అహం బ్రహ్మస్మి అన్న మాటకు ప్రాణం పోసావు.సర్వ స్వతంత్ర్యాయై నమ: అని నన్ను స్తుతించి స్తుతించి యధ్భావం తధ్భవతి అన్నట్టుగా తయారయ్యావు.ఇక నీకు నాకు బేదాల్లేవు. అన్నీ నీలో ఉంటాయి నాతో సహా
నేను: త్యాంక్స్ అమ్మా.. అమృత సేవనంతో నిత్య యవ్వన సంభూతురాలివయ్యావు కాబట్టి ఎన్ని యుగాలు గడిచినా నిన్ను వృద్దాప్యం,జఠత్వం స్పర్సించలేదు. అందుకే మన మద్య జెనరేషన్ గ్యేప్,కమ్యూనికేషన్ గ్యేప్ రాలేదు.అర్థం చేసుకోగలిగావు. అంతే చాలు ..ఓం శక్తి.

నీ దయే ఉంటే నీ శాపమే వరమై

అమ్మా అమ్మోరు తల్లి !
నువ్వెందుకు నన్నింత కాలం అనామకునిగా ఉంచావో ఇప్ప్డిప్పుడే అర్థమవుతుంది
ఇంతకాలం నెనెవర్నైతే విమర్శిస్తూ వచ్చానో
వారి సమస్త దుర్గుణాలు ఇదివరకే నాలోకి ప్రాకి పోయిన సత్యన్ని గుర్తించ కలుగుతున్నా
అవి నా మానవత్వాన్ని కవళించ చూడటాన్ని గమనిస్తూనే ఉన్నా.
వారికి నాకు ఉన్న తేడా ఒక్కటే వారు కుష్ఠురోగివలే
స్పర్శ కోల్పోయి ఉన్నారు
నేను కోల్ఫొలేదంతే
ఈడెంతగా పాడవుతాడో చూద్దమానేగా నువ్వాగింది.
మరింతగా పాడైపోతాననేగా విజయం నా చేతికందే తరుణంలో నన్ను ఆపింది
నువ్వాగియుండ కుంటే నేను మరో చంద్రబాబునయ్యేవాడినేమో?
నన్నాపియుండ కుంటే మరో కేసిఆర్ ని అయ్యే వాడినేమో?
నిజమే తల్లి!
అందుకు సూచికలు అప్పుడే నాలో ఉన్న సంగతి ఇప్పుడు గోచరిస్తుంది

కాని అమ్మా!
ఇల్లు కాలుతుంటే మురికి నీటితోనైనా ఆర్పి తీరాలి
ఆకాశం వైపే చూస్తుండిపోతే
నువ్వు ఆఘమేఘాలపై వచ్చి నన్ను ఆదుకోవడానికి
నేనేమైన్నా ఆది శంకరుడ్నా
అమ్మా!
అందుకని ఆకాశం వైపు చూడటమే మానేసానని అనుకోకు
రెండు కళ్ళిచ్చావుగా..
కుడికన్ను నేలపై ప్రవహించే మురికి కాలువల వైపు చూస్తున్నా
ఎడమ కన్నుఆకాశం వైపే చూస్తుందే
కంటి తుడుపు సాయాలకు ఆట విడుపులకిది సమయం కాదు
వన్ డే మ్యేచ్ లో ఆకరి ఓవర్లో ఆకరి బాల్ ఇది
నా బౌలింగ్ తో శతృవు క్లీన్ బోల్డ్ కావాలి
అమ్మా !
నా కడుపున పాలు పోస్తావో
నన్నే నవ్వుల పాలు చేస్తావో నీ ఇష్ఠం
శతృ స్త్రీ రూపం దాల్చి తల్లి పాలద్వారా విషాన్ని వినియోగించినా దాంతో పాటు ఆమె ప్రాణాలు సైతం పీల్చేసిన
పీతాంబరదారి సోదరివి నీవు
నువ్వేంచేసినా నా విజయం కొరకే అయ్యుంటుంది
నీ దయే ఉంటే నీ శాపమే వరమై తరియింప చేస్తుంది
అదే లేకుంటే ముప్పై ముక్కోట్ల మంది దేవతల వరాలన్ని
శాపాలై సమాధి చేస్తాయి..

దయ చూడవే..మాయా తెర లాగి పడెయ్యవే
ఓం శక్తి

రేప్ ని వారించలేనప్పుడు

అమ్మా అమ్మోరు తల్లి !
నా కన్నీ గోచరిస్తున్నాయి
నా వేలాది జన్మల స్మృతులు గోచరిస్తున్నాయి
నా లక్ష్యం లక్ష్యాన్ని సాధించడం కాదే
లక్ష్యాన్ని మరువకుండటమే నా లక్ష్యం
నా ద్యేయం విజయం కాదే
అపజయాలను తరచూ అపార్థం చేసుకుంటూ విజయాలుగానే
బాష్యం చెప్పుకుంటూ
తప్పుడు వ్యక్తుల అడ్డు తప్పుకుంటూ పైకి వెళ్ళడం........పైకి .......పైపైకి

స్వార్థ పరుల , పిరికి పందలైన ఈ మనుషులకు దూరంగా...
హే దుర్గే నీ దుర్గానికి దగ్గరగా...

పైకి పైపైకి ఎదగడం

హే అంబా !
ఆనాడే నిర్ణయించా.. నేను ఆత్మాహుతి దళాన్ని కావాలని
నీ బిడ్డలను ఆకలి దోపీడీల గొడ్డలి పోట్లనుండి కాపాడాలని..
అలా చేస్తే నువ్వు నన్ను కాపాడతావన్న కకృతితో
నేనీ ఆత్మ హత్యకు ముస్తాబయ్యాను

నువ్వు అప్పుడప్పుడు కాపాడక పోయినా
నో ప్రోబ్లం !
బ్రీచ్ ఆఫ్ అగ్రీమెంట్ నేరం
నేరానికి నువ్వు పాల్పడినా
నేను పాల్పడను

అర్థం పర్థంలేని రచనలతో
వెయ్యి కాపీల కవితా సంకలానాల విక్రయానికే ఉబ్బి పోయే
ఉత్తుత్తి కవిని కానే నేను

వంద కోట్ల భారతీయుల్లో ఒక్క శాతం వారినన్నా నా శతకాలు
ఒక శతాబ్ద కాలం పాటు శాసించాలన్నదే నా టార్గెట్
చెప్పానుగా..

టార్గెట్ కాదే నా టార్గెట్
టార్గెట్ ను మరువ కుండుటయే నా టార్గెట్

నన్నెందుకు పుట్టుంచావో
దానిని సాధించే శక్తి సామర్థ్యాలతోనే పుట్టింఛావు
నో డవుట్ !

నన్నే యుగాన పుట్టించాలో ఆ యుగాన్నే పుట్టించావు
హ్యేట్శ్ ఆఫ్ !
రిహార్సల్ ను రియల్ అనుకుని లీనమయ్యానే కాని
నీ జగన్నాటకంలోని మలుపులకు నేనెప్పుడూ వ్యతిరేకిని కాను

రేప్ ని వారించలేనప్పుడు ఎంజాయ్ చెయ్యాలన్నాడట ఎవడో మేథావి
నిజమే మారి
ఎక్కడ నా అశ్వం మరెక్కడ నా కవచం ఖడ్గం
ఎక్కడ ఎక్కడ నా సైన్యమని
ఆందోళన చెందను

నా మనసే అశ్వం నా బుద్దే కవచం నా మాటే ,వ్రాతే ఖడ్గం
నా పాఠకులే సైనికులు
నేనెదుగుదును నేనెదుగుదును

ఓం శక్తి ఓం శక్తి ఓం శక్తి

విటులై వ్యభిచారిణుల చుట్టూ తిరిగిన

అమ్మా అమ్మోరు తల్లి !
నాతో కల్లు తాగినవారు
కల్లు కుండలో ఈగల్లా పడి రెక్కలు తడిచి చచ్చారు
నాకైతే కళ్ళు తెరుచుకున్నాయి
అది నీ కడకంటి చూపుతోనే సాధ్యమైంది

నాతో బ్రాంది త్రాగిన వారు
ఆ బ్రాంతినుండి భయిట పడ లేక పోయారు
నేనైతే క్రాంతి వైపు దృష్ఠి మళ్ళించుకో కలిగాను
అది హే చాముండీ !
నీ అండ దండలతోనే సాధ్యమైంది

నాతో పాటు గంజాయిని ఎంజాయి చేసినవారు
ఆ మైకంలోనే మకాం పెట్టేసేరు
కాని కకా వికలం కావలసిన నా జీవితాన్ని
నిర్జీవమై , నీరు కారి పోవలసిన నా జీవితాన్ని
బతికించి, నన్నుఇలా బ్రతకనివ్వడమే
నీ అమ్మతనానికి ఆధారం

నాతో పాటు విటులై వ్యభిచారిణుల చుట్టూ తిరిగిన వారు
ఇందాక ఆ ఆటకు ఆట విడుపు ప్రకటించ లేదు
కాని చాలా మంది పుణ్యపురుషుల్లా కాక
వారిని కేవలం రంద్రాలుగా చూసే మృగత్వంనుండి
విముక్తినిచ్చావు
వారిని సైతం మనుష్యులుగా పరిగణించి
వారి బాగోగులను సైతం ఆలోచించి
గళం విప్పేంతగా నా మనస్సును వైడన్ చేసిన
నీ వైనం రమణీయం. చిరస్మరణీయం

నేనూ వారిలాగే ఆగి పోయేవాడ్ని
హే శక్తీ .. నువ్విచ్చిన శక్తితో సాగి వ్యూహ భంగం చేయగలిగాను

హే శ్రీ విద్యా !
అవన్ని నాలో నదిలా ఉప్పొంగే శక్తి ప్రవహించ చూసే తప్పుడు
పరివాహక ప్రాంతాలన్న జ్నానాన్నిచ్చావు.
ఈ నది నడవ వలసిన పథమేదో
స్ఫురింప చేసావు

నీ పాదాల చెంతకు చేరుకోనిచ్చావు
ఈ అధ్భుతం సాధ్యం కావడానికి నేను పొడిచిందేమి
అన్న అనుమానం వీరికి కలుగ వచ్చు.
నీ రూటే వేరు ! నీ స్కూలే వేరు !
ఇక్కడ భక్తుడు ఏంచేస్తాడన్నది ముఖ్యం కాదు
ఏ భావంతో చేస్తాడన్నదే ముఖ్యం
అసలు ఏది చెయ్యాలనీ లేదు
చెయ్యాలనుకుంటే చాలు

అమ్మా! అమ్మోరు తల్లి !
ఆ అనుకోవడాలు కూడ నీ ఆజ్నతోనే సుసాధ్యమంటే
నేనో బొమ్మను !
నువ్వు నన్నాడించే అమ్మవు!!

త్యాంక్యూ ! త్యాంక్యూ ఫార్ ఎవర్ !!

ఇంతమంది వ్యర్థ మానవులను కడుపారా కన్నా

ఒక తల్లి నలుగురు బిడ్డలను పోషిస్తుంది.
కాని ఆ నలుగురు కలిసి ఒక తల్లిని పోషించ లేక
ఓల్డేజ్ హోమ్ పాలు చేస్తారు
హే మహోదరి!
ఇంతమంది వ్యర్థ మానవులను కడుపారా కన్నా
కడుపులో ,కళ్ళల్లో పెట్టుకుని
దాచుకుంటున్న నిన్ను వీరిలో ఏ ఒక్కరన్నా
తమ గుండెలో దాచుకోలేక
నాలుగు గోడల మద్య భంధించడం విడ్డూరం

త్యాగేశుడు అని శివయ్యను కీర్తించే ఈ లోకంలో నిన్ను
త్యాగేశ్వరిగా ఎందుకు గుర్తించటం లేదు?
రా ..నీ విశ్వరూపంకన్నా విశాలమైన నా గుండెలో దాచుకుంటా..
ఆ నాలుగు గోడల మద్య ఉండి నువ్వు సాధించిందేమి
వాస్తు దోషాలు,గ్రహ దోషాలు అంటని నా గుండెలో స్థిర వాసం చెయ్యి

నా గుండెలో ఉప్పొంగే కవితామృతాన్ని కడుపారా త్రాగు
నా శతృవులు,ద్రోహాలు, నా పేదరికం నా గుండెలో ఉన్న రక్తాన్ని పూర్తిగా పీల్చి వేసినా హిమాలయంతో పోల్చ తగ్గ తెల్ల దనం ,చల్లదనం, నువ్వైనా ఊహించలేని కొత్తదనం, ఉట్టిపడే గట్టి గుండె ఇది.

నువ్వు సరదా పడే త్రిశూలం చేత బట్టి ,ప్రళయ కాల రుద్ర నాట్యం చేసినా అదరదు,బెదరదు.చెదరదు
నేను వ్రాసిన పిచ్చి గీతలకే మురిసి పోయి కాలాగ్నిలో సైతం
స్వర్ణంలా మెరిసేట్లు చేసావు
నా పేదరికానికి కోత విధించావు
వ్రాత మార్చావు
ఈ ప్రపంచమే వినాశానికేసి బుల్లెట్ లా దూసుకుపోతున్నా
నా గుండె ద్రోహాలతో బండ బారినా కొండ శిఖరాల ఇరుకునుండి ఉరకలేస్తూ పరుగు తోసే నదిలా దిగి వచ్చావు

నా కవిత ఈ భూతలం పై చెవిటి రాజ్యమే సాగుతున్నా
సమస్త ప్రజానీకం సృష్ఠి పరిసమాప్తికే సాయ శక్తులా కృషి చేస్తున్నా
ఋషిలా బ్రతకనిచ్చావు

బతుకు నా ద్యేయం కాదు.
జీవించడం నా లక్ష్యం కాదు
కొన ఊపిరితో కొట్టుమిట్టాడుతున్నా మానవత్వాన్ని జీవింపచెయడమే నా లక్ష్యం.
కక్ష్య దాటుతున్నానని, తక్షణం నీ తీర్పు అమలు చెయ్యాలని అనిపిస్తూందా రా!

ఈ జనులు ఏ ప్రమోషన్ కోసమో, ఇన్ క్రిమెంట్ కోసమే ఇబ్బంది పెడతారని భయపడకు. వీరి కళ్ళు అహంకారంతో మూసుకుపోయాయి.

నువ్వు సర్వాలంకార భూషితురాలై, సింహ వాహణమెక్కి, త్రిశూలం చేతపట్టి సిటి జంక్షన్లో కనబడినా పగటి వేషగత్తెని పక్కకు పోతారు.

నా కథ వేరు..
నువ్వే రూపాన వచ్చినా గుర్తు పడతా .. శిరస్సు వంచుతా
తరచూ రాక్షసులనే వధిస్తుంటే
ఏమున్నది మజా..వెరైటిగా నా తల నరుకు.
నా మస్తిష్కమంతటా నిండి ఉన్న విశ్వప్రేమ రక్త రూపేణా నీకు పాదాభిషేకం చెయ్యనీ

ఆ చల్లదనంతో కలి పురుషిని కేకలతో గమ్యం మరచిన వ్యర్థ మానవుల ,వ్యర్థ జీవితాలతో వేడెక్కిన నీ శిరస్సు చల్లబడనీ ! ఆ చల్లదనంతో, నీ తల్లి గుండే కరగనీ !

సరి కొత్త ఉషస్సును ప్రసాదించు నా జాతికి
పట్టం కట్టు నీతికి

నేనే నిన్ను తలచినట్టు

అమ్మా అమ్మోరు తల్లి !
నేనే నిన్ను తలచినట్టు
నేనే నిన్ను పిలిచినట్టు
నేనే నీ వద్ద ఏదో కోరినట్టు,పొందినట్టు నమ్మిస్తున్నావు
పొందిన దానిని పంచటానికి మరెవరినో వెతికినట్టు భ్రమింప చేస్తున్నావు

కాని అమ్మా!
నువ్వే తలచావు.
నువ్వే పిలిచావు.
మరి నువ్వే కోరనిచ్చావు.(కోరింది) ఇచ్చావు
ఇవన్ని చేసినట్టే ఇచ్చింది పంచటానికి
నువ్వే జనభాహుళ్యాన్ని నా వద్దకు పంపుతావన్న
జ్నానం ఇప్పుడిప్పుడే నాలో విచ్చుకుంటూంది

అమ్మా అమ్మోరు తల్లి !
ఇవన్ని నా మనోరాజ్యపు పతాక శీర్షికలు
కాని యధార్థంగా చూసినప్పుడు
ప్రజాకంఠకుల పై కలబడటం,తల బడటం,
జన భాహుళ్యం బ్రహ్మరథం పడుతుందని భావించటం
నా వెనుక ఉన్న పది మందిని పోగొట్టుకుని
మూలన పడటం ఇవి తప్ప మరొకటి జరుగదా తల్లీ..?

నా పయణం ఎటు సాగుతూందో కూడ అర్థం కావడం లేదు
లక్ష్యానికేసి ముందుకా? లక్ష్యం నుండి వెనక్కా?
నా పయణం తీరు అధోముఖమా? ఊర్ద్వముఖమా?
అసలు సాగుతూందా? ఆగిందా కూడ అర్థం కావడం లేదు

అమ్మా !
నా భుద్దిని నమ్ముకున్న రోజులు ఎప్పుడో పోయాయి
కేవలం చిత్తాన్ని,చిద్విలాసాన్ని నా చిత్తాన మెరిసే
నీ చిరునవ్వును మాత్రం నమ్ముకునే స్థితికి జారి(చేరి)పోయాను.
నా దిక్చూచి నీ నయనం
నీ నయనం చూపిన వైపే నా పయణం

అమ్మా అమ్మోరు తల్లి !
తనను పెద్ద బాక్సర్ అనుకుని తండ్రితో తలబడే చిన్న పిల్లవాని స్థాయిలో ఉన్నాను
ఇక్కడ తండ్రికి బదులు నా ముందున్నది రాక్షసులను సైతం వనికించే మానవ రూపంలోని దానవులు.

నాటి రాక్షసులే నేడూ ఉండి వారిని సంహరిస్తే వారు నామరూపాల్లేక పోతారు. మరీ తప్పదంటే వాహనమై నన్ను మోస్తారు.
ఎనలేని కీర్తి నాకు దక్కుతుంది
మరి నేటి మానవ రూప దానవులను సంహరిస్తే విగ్రహాలై లేస్తారు. మరో పిల్ల రాక్షసునికి సానుభూతి ఓట్ల వర్షం కురిపిస్తారు. నన్ను అడవుల్లోకి తరిమి వేస్తారు.
బట్టలు దరించిన మృగాలన్ను ఊళ్ళో ఉండగా నేను తల దాచుకోవాలి అడవుల్లో
మరి ఏది పరిష్కార మార్గం?
ఏ ప్రజలైతే వీరిని అందలమెక్కిచ్చారో వారి చేతే
గాడిదల పై ఊరేగించేలా చూడాలి (గాడిదల సంఖ్య సరి పోతే - గాడితలు అంగీకరిస్తే)

ప్రహల్లాదునికన్నా తండ్రితోనే ముప్పు,
కృష్ణునికన్నా మామతోనే హాని
మరి నాకు?
నేనెవరి భవిష్యత్ కోసం ఈ అక్షర యజ్నంలో నన్ను నేనే ఆహుతి చేస్తున్నానో
వారే నా శతృవులు. వారితోనే నాకు హాని
కొరివితో తల గోక్కుంటున్నారని నేనంటే నా పై
విమర్శల నిప్పుల వర్షం కురిపిస్తున్నారు...

ఎలా నెట్టుకొస్తున్నావో నాకే అర్థం కావడం లేదు

అటు చూడు.. సర్వ శక్తి సంపన్నులు. మేమే శక్తిమంతులం, మేమే శక్తి పుతృలం
అసలా శక్తియే మేమని విర్ర వీగుతున్నారు.

ఇటు చూడు ..నన్ను చూడు
అశక్తుడనై, వారిని విర్ర వీగేలా చేస్తున్న శక్తుల పట్ల నిరాసక్తుడనై,
నా దేశం గురించిన అందమైన కలలే ప్రాణ వాయువుగా ,
నా ప్రజల అబివృద్ది గురించిన కలలే ఆహారంగా,
రేపటి తరాల భద్రత గురించిన కలలే నీరుగా
బతుకుతున్నాను.
కేవలం సాక్షి భూతంగా వీక్షిస్తున్నా వారు రక్తి కట్టిస్తున్న ఘోర కళిని..
ఏం చెయ్యను?

నా మానస సరోవరం నిర్లిప్తంగా ఉన్నప్పుడు
నీ చాయ ఓ మాయలా ప్రవేశించి కనుమరుగై పోతూంది

నకిలి వైద్య్లుల నెలసరి టూరులా ఉంది నీ రాక పోక
వారైనా నిర్ణీత రోజుల్లో సాగిస్తుంటారు క్యేంపు
మరి నీ రాక,బసలకు ఆ ఏడుపు సైతం లేదు

ప్రియురాలు ప్రియుడ్ని ఆట పట్టించినట్టుంది నీ వ్యవహార శైలి
స్త్ర్రీని నీవిచ్చిన నిధిగా - నీకు ప్రతిగా - నీ ప్రతినిధిగా ఫీలై
సరి పెట్టుకుంటున్నా నీ ఆట విడుపులు కలిగించే భాధను

స్థిరవాసం ఏర్పరచుకోవే ..
నాలో , నా నాడుల్లో ప్రవహించు
రాసుకుంటే రవ్వ రాలు నా వ్రాతల్లో నృత్యం చెయ్యి

నా దేశంతో సరిపెట్టుకుంటానని నన్ను నిర్లక్ష్యం చెయ్యకు
వీలైతే ఈ విశ్వాన్నే విశ్వాసంతో నింపాలి. విశ్వ ప్రేమ వికసించేట్లు చెయ్యాలి
అదే నా ఉద్దేశం.
ఓం శక్తి

ఎందుకూ కొరగాని సాధనతో

ఎందుకూ కొరగాని సాధనతో, హృదయమంతట వేధనతో
విడిచి పెట్టలేని సత్య శోధనతో
తిలకిస్తున్నా వీరి ఆగడాలను
నువ్వు ఉలిక్కి పడతావని
వీరు హుష్ కాకీ అవుతారని.
చందమామ పాఠక బాలుని వలే
ఎదురు చూస్తున్నా

ఇక్కడివి ఏవీ నాకు నచ్చడం లేదు
నా మనస్సు మెచ్చడం లేదు

వీరికి ముచ్చమటలు పుట్టించే మార్గం తెలిసిన వాడ్ని
నా కలం కదిలితే దాని వెంట త్రిశూలం కదులుతుందని తెలుసు
కాని కాని...
జరిగిపోతూందే కిరాతక ఖూనీ

నీ గురించిన ఊహల్లోనే బతికి ఈ అపోహలతోనే
అకాలంగా అంతమై పోతాననుకోకు

నేను మిన్నంటే లక్ష్యంతో పాటు
ఎలుకకన్నా హేయంగా బతుకుతున్న
ఈ అనామక జీవితాన్ని సైతం
అంగీకరించాను
అందలానిలకైనా ఇందులకైనా సిద్దమే
ఈ అక్షరాలు మూగవాని కలలా
ఈ చెవిటి ప్రపంచానికి
చేరకుండానే పోయినా డోంట్ కేర్!

నా ఈ ఆవేశానికి అక్షర రూపం ఇవ్వగలగడమే
చెబుతూంది. నీ దైవ శక్తికన్నా నా ఆత్మ శక్తి గొప్పదని
తేల్చుకోవలసింది నువ్వే

అర్థం, పర్థం లేని వ్యర్ధ వేదాల పుటల్లో,
రారాజుల కోటల్లో
నాలుగు గోడల ఇరుకులో
బాపలు పరచే పరుపులో
విని విని విసుగెత్తిన పొగడ్తల నిషాతో
నీ భక్త జనుల సొల్లు వేడుకోళ్ళ తమాషాతో
భంధీగా ఉండి పోతావో? .. లెక

నా మదిన చెలరేగే కలకలం దాటికి ,
నా కలం కదలికల పోటుకి
రాసుకుంటే రవ్వ రాలు నా మాటల ఏటుకి
బండ బారిన నీ గుండె
మళ్ళీ కొట్టుకోవడం ప్రారంభించాకనన్నా
చేత త్రిశూలం పట్టి ,నా దేశాన్ని అభివృద్ది భాటలో నెట్టి
అవినీతి చేతులను కట్టి
నీ ఉనికిని చాటుకుంటావో?

తేల్చుకోవలసింది నువ్వే !

అమ్మా!
నిద్రించేవారిని చంపడం ధర్మం కాదే వీరు నిద్రిస్తున్నారే.
నా ఈ అక్షరాల్లోకి నా అత్మ శక్తి
విద్యుత్సక్తిలా ప్రవేశించినా నా అక్షరాలు సైతం
జాగృత పరచలేనంత ప్రగాఢ నిద్రలో ఉన్నారే

కాసింత గడువిస్తే నా ప్రయత్నం ఏదో చెయ్యనిస్తే
ఆపై చెయ్యవే ప్రళయ కాల ఘోర నృత్యం

ఆపై మోగనీయవే మరణమృదంగం

ఖబడ్దార్ కనకదుర్గ !

అమ్మా అమ్మోరు తల్లీ !
నిన్ను దేవతగా నిరూపించుకోవలసిన అవసరం నీకు లేకున్నా
మానవునిగా నన్ను నేను నిరూపించుకోవలసిన అవసరం నాకుంది.

నీకు నీ దైవత్వం మీద అనుమానం లేకున్నా
నా మానవత్వం పై నాకు అనుమానం ఉంది

మానవ కళ్యాణానికి పూనుకున్న నాకు నువ్వు కాస్త
తోడ్పాటు అందిస్తావనే
ఈ మనుషులను నా సోదరులుగా - నీ బిడ్డలుగా
అభివర్ణించాను.

నాది సాదా సీదా ప్రణాళిక కాదు
గాంథి మహాత్ముడ్ని ఓవర్ టేక్ చెయ్యడమే కాదు
నిన్ను ఓవర్ టేక్ చెయ్యడం కూడ నా ప్రణాళికలోని అంశమే

కౄర మృగాల పై ఊరేగి ఊరేగి నీలో మృగత్వం పెరిగి
కరుణ కరిగి పోయినట్టుంది

అమ్మా అన్న ఒక్క పిలుపుకే నీ సొమ్మంతా దోచి పెట్టే
నీ గుండే బండ బారినట్టుంది

చెదులు పట్టిన మీ కాల,యుగ ధర్మాలే నీ చేతికి
సంకేళ్ళయినట్టుంది

దైవత్వం అంటే మానవత్వం లేకుండటం కాదు..
ఈ మానవుల జీవన్మరణ పోరాటాలు చూసి
అంతా ఎరింగి - ఎఋకతో మందహాసం చెయ్యడం కాదు

అమ్మా .
ఈ మనుషులను నువ్వు నీ బిడ్డలుగా చూడకుంటే ఫర్వాలేదుగాని
నీ ప్రయోగ శాలలో ఎలుకలుగా మాత్రం చూడకే

మీ ప్రళయ ధర్మానికి విరుద్దంగా రూపొందిన నా "మిషన్" కి నీ తోడ్పాటు కోరడమే
నా పొరభాటైతే సారి ! ఇక పోరుభాటే సరి !!

ఏం హనుమన్న రామ నామంతో రాముడ్ని జయించగా లేనిది
నేను నీ నామంతో నీ పై పోరు ప్రకటిస్తే తప్పా?

ఇక నీదారి నీది.. నాదారి నాది

నన్ను డిస్టర్బ్ చెయ్యకు అన్నా చేసి తీరుతావు
కనుక డోంట్ డిస్టర్బ్ మీ బోర్డు పెట్టుకోను

యు కెన్ డిస్టర్బ్ మీ
ఐ డోంట్ వాంట్ టు డిస్టర్బ్ యు..

నువ్వేదో సర్వ సవతంత్రివి అని భ్రమిస్తున్నావు
నువ్వు రూపొందించుకున్న స్క్రిప్టుకు నువ్వు భానిసవు

నా వ్రాతలనైతే మూడో కన్నుతో భస్మం చెయ్యగలవేమో?
నా తలవ్రాతను ఏమీ చెయ్యలేవుగా?

ఈ దిక్కుమాలిన ప్రపంచంలో
నీకున్న ఒక్క గానొక దిక్కును నేనే

మహావిశ్వాసంతో వికసించి - నా ఖర్మ నాశనార్థం నువ్వు
పెట్టిన పరీక్షలతో ఉక్కు ఉక్కై ఉన్న నా గుండెను సైతం
అనుమానపు భ్రమరం తొలిచేలా చేసావు

నేను ఒంటరినేమోనన్న శంఖను నాలోకి సందించేసావు
ఇకనూ సదా బ్రీచ్ ఆఫ్ అగ్రీమెంటుకు పాల్పడే నీతో ఏగలేను

మరో 24గంటల్లో నువ్వు నా రక్షణకు నేను ఈ మానవావళి రక్షణకు
కదం తొక్కాలి

లేదా నన్ను నువ్వు - ఈ మానవావణిని నేను రక్షించే మన ఒప్పందం
తనంతట తానే రద్దవుతుంది. రచ్చవుతుంది.


నువ్వే రూపాన వచ్చినా

నువ్వే రూపాన వచ్చినా గుర్తించే స్థితిలో ఉన్నానన్న భ్రమ నాకుంది
నాడు నెను అపర బ్ర్హహ్మనన్న అపార విశ్వాసంతో
విర్ర వీగుతుంటే
విశ్వనాథునివలే నా అదనపు శిరస్సును ఖండించావు

అలా ఖండించక మునుపే నువ్వు దర్శనమిచ్చి ఉన్నా
ఏ నటీ మణో మేకప్పుతో రోడ్డున పడిందనుకునే వాడ్నేమో?

ఆనాడు ఐదు తలల్లో పది కళ్ళున్నా నిన్ను గుర్తించక సజావుగా బతికెయ్య కలిగాను
నేడైతే ఉన్న ఒక్క తల తిరిగి పోతుంది.
ఉన్న రెండు కళ్ళు కన్నీళ్ళల్లో కరిగి పోతున్నాయి.

ఈ నా కన్నీళ్ళు నీ పాదాలను కడగడానికో కొత్తగా నీ కరుణను పొందటానికో కాదు
ఇన్నాళ్ళు నాకోసం నువ్వున్నావని, నీ కరుణతోనే నన్ను మననిస్తున్నావని గుర్తించలేక పోయినందుకే.

నేను అహంకారిని నాకోసమే కాదు నీ కోసము సైతం కన్నీళ్ళు పెట్టను
కోట్ల మంది నా పై కత్తులు దూస్తే హాయిగా నవ్వుకోగలను .వారు నన్ను ,నా ఉనికిని గుర్తించారని మురిసి పోగలను.

కాని ..కాని.. ఒక్క నీ కరుణను మాత్రం భరించలేక పోతున్నానే కన్నీటిని కట్టిడి చేసుకోలేక పోతున్నానే.

నాటి మలుపుల్లోని పరమార్థం..
నిన్నా మొన్నటి మలుపుల్లోని గూడార్థం అన్ని తెలిసాక

వాటి వెనుక ఉన్న నీ అమ్మ మనసు అర్థమయ్యాక నా కాళ్ళు వెల వెల పోతున్నాయి.
అన్నీ అర్థమయ్యాక - నా అహాన్ని సంతృప్తి పరచగల నా ప్రయత్నాలన్ని వ్యర్థమయ్యాక
నా శరీరమే నాతో అహాయ నిరాకరణ చేస్తుంటే మహా అహంకారినైన నేను
ఎలా తట్టుకోనే? దానిని నీ పాదాల చెంతకు ఎలా నెట్టుకురానే?

అమ్మా!
నీ ఛాయ నాటి ఆ మాయను ఆనాడే మాయం చేసి ఉంటే ఈ కాయం, ఈ గాయం ఇంతగా భాధ పెట్టేది కాదేమో?

నీ భీజం , నీ నామం , ఈ అక్షర హోమం యింకాస్త ముందుగా అంది ఉంటే నా అహం పిచ్చి మొక్కగా ఉన్నప్పుడే తుంచి పారేసేవాడ్నేమో?

నా గ్రహం - దాని ఆగ్రహం - నీ అనుగ్రహం ఇంకాస్త ముందుగా తెలిసి ఉంటే ఈ ఆపరేషన్ ,ఈ పరేషాన్లకు అవసరం లేక పోయేదేమో?

అయితేనేం? పురిటి నెప్పులు ఎంత ఎక్కువగా భరించి ఉంటే అంతగా తల్లి బిడ్డల నడుమ అనుభంధం గట్టి పడుతుందని తెలుసుకోలేని మూర్ఖుడను కాను కదా..

ఇక్కడ నా హృదయ గర్బంలో నీ భీజాన్ని మోసి నాకే నాకై నిన్ను కన్న వాడ్ని నేను. తల్లి నీకే తల్లినైనవాడను నేను

ఓం శక్తి

అంతా అయోమయం

అమ్మా అమ్మోరు తల్లి !
అంతా అయోమయంగా ఉంది
ఓటమి - పేదరికాలు నాకు
కొత్తేమి కావు
బాల్యమునుండి ఏదో మోతాదులో ,ఏదో రూపంలో
పేదరికం నన్ను వెంటాడుతూనే వచ్చింది
అయినా నేను బెదర లేదు
ఒకప్పుడు అజ్నానం దైర్యాన్నిచ్చేది
ఇప్పట్లో జ్నానం ఓటమి నాతో కుదుర్చుకున్న
కూటమి నేటివరకు కొనసాగుతూనే ఉంది
నాకన్నా సోమరి మరొకడుండడు
నాకన్నా నాస్తికుడు మరొకడుండడు
నా వ్యూహం ఎంతటి లోప భూయిష్ఠమో నాకన్నా నీకే బాగా తెలుసు
అయినా ఇటీవల విజయం అతిథిలా అడుగు పెట్టింది
నా పేదరికం పై ,ఒంటరితనం పై పిడుగులా దిగింది
ఏది ఏమైతేనేం?
మళ్ళీ పాతకథే మొదలైంది
సరస్వతి సాంగత్యంలో నాడు లక్ష్మి దూరమైతే
నేడు సంపదలో సరస్వతి దూరమైంది
అందుకని లక్ష్మి స్థిరవాసానికి పూనుకోలేదు
నాలో ఏలోపం ఉన్నా నా లక్ష్యంలో సున్నా
నా లక్ష్యం వెనుక ఒక దేశం ఉంది
పాలవీథినుండి నేనందుకున్న సందేశం ఉంది
నా లక్ష్యం వెనుక నూట ఇరవై కోట్ల మంది
ప్రజలున్నారు
నా లక్ష్యం కనుక కైవశమైతే
ఈ నూట ఇరవై కోట్ల మంది
స్థూల కోరికలు నెరవేరుతాయి
ఇవి కాక మరొక లోకం ఉంది అని నేను చాటి చెప్పగలను
నా దారి పట్టించగలను
ఆకలితో అలమటిస్తున్నవానికి
అమ్మవు నీకన్నా అన్నమే పరబ్రహ్మం
అమ్మా !
శక్తివి కదా ..నాకు శక్తినివ్వు
ఈ దేశాన సర్వ జనులు
సుఖంగా బ్రతకాలి
అందుకు నా లక్ష్యం నెరవేరాలి
నవ గ్రహాల నడక ఎరింగిన వాడను
వారి ఖర్మ ఫలాలను మరో మార్గములో అనుభవించేలాచెయ్యగలవు
డోంట్ ఒర్రి..
ప్రాణ రక్షణ, కూడు,గూడు,గుడ్డ,సెక్స్ వీటికి గ్రహాల అడ్డును ఎలా తొలగించాలొ నాకు తెలుసు
నాపథకం అమలు కానివ్వు
కాస్త శక్తినివ్వు
నా పై ప్రేమ పై నాకు అనుమానం లేదే
వీరి విజ్నత మీదే నాకు విముఖత ఉంది
అదే ప్రపంచ బ్యాంకు,అదే అగ్ర రాజ్యం అదే మల్టి నేష్నల్ కంపెనీలు నా కొంపను కూడ ముంచేస్తున్నాయి
నా కరుణను సైతం అడుగంటేలా చేసి కంపెత్తిస్తున్నాయి
నా గుండెను
అయినా వీరిలా నేను దిగజారలేదు
నేను వద్దనుకున్న సమాజం
కొరకు సర్దుకు పోతున్నా
చిటికలో నా నమ్మకాలను ఒమ్ము చేసినా
పాములా కాటేసినా
నా చిటికన వేలందించి తీసుకు వెళ్ళాలనే చూస్తున్నా
ఆశిఖరాలకు వైపున..

అమ్మా!
భయమేస్తుందే....

దడగా ఉందే!
నా అద్యయనం పొరభాటేమో?
నావిద్య వీరిముందు పారదాయెనే
వీరి నక్క జిత్తులతో కుక్క చావుకే సిద్దమైనట్టుందే

అంబ పలుకు - పుట్టు పూర్వోత్తరాలు

ఈ కవితా సంకలనానికి అంబపలుకు అని పేరైతే పెట్టాను. కాని ఈ శీర్షికకు అర్థం ఇదని నిర్ధారించుకోలెక పోతున్నా. ఈ కవితలు అంబ (కరుణ) కొరకు పలికిన పలుకులో/ అంబ నా చేత పలికించిన పలుకులో ఏదైతేనేమి ఇందులో అంబ ఉంది. పలుకు ఉంది. పంచ దశాక్షర్యై స్వాహా అని శాక్తేయులు కీర్తించే అంబ ప్రతి అక్షరంలోను ఉండగా లేనిది ఈ కవితా సంకలనంలోని అక్షరాల్లో లేక పోవడమేంది సిల్లిగా!

ఇవి నేను తెలుగులో అమ్మవారికి నా గోడు వెళ్ళ గక్కడానికి వ్రసుకున్నవి. ఇందులో ఏముందో లేదో , ఇందులో ఉన్నది సాహితీ అభిరుచో, లేక ఆథ్యాత్మికతో నాకు తెలీదు. ఇవి వ్రాసింది తెలుగులోనే వ్రాసాను. కాని కంప్యూటరు కొన్న కొత్తలో తెలుగు టైపింగ్ తెలియని కారణంగా ఇంగ్లీషులో టైపు చేసాను.

ఒక soft ware ఉంటుంది. దాని సాయంతో దీనిని తెలుగులోకి ట్రాన్స్లిటరేట్ చేసుకోవచ్చని ఊహించా.( అది నిజమైంది కాని టైపు చేసి ఉంచినవి జియోసిటీస్ మూతపడటంతో హుష్ కాకి అయ్యింది)

వాటిని ప్రింట్ అవుట్ తీసి ఉంచాను కాబట్టి మరో వ్యక్తి చేత తెలుగులో వ్రాయించాను. అవైతే ఉన్నాయికాని వాటిని వెబ్లో పెట్టడమే గగనమైంది. ( నేనామె కరుణతో ఆన్ లైన్ జ్యోతిష్కునిగా వెలిగి పోతుండటంతో టైమ్ లేదు మరి)




ఇంతకీ ఈ అంబపలుకు అన్న పదాన్ని బుడ బుక్కలవారి పలుకుల్లో నుండే స్వీకరింఛాను. అంబ, అమ్మ, తల్లి,మాత, అని ఎన్ని విదాలుగా పలికినా అంబ అనగానే గుర్తుకొచ్చేవి చెరువు లాంటి ఆ కళ్ళు, నుదట మెగా సైజు తిలకం. వీటికి సరితూగే విదంగా ఊహించుకుంటే ఆమె పలుకు ఉరుములా, చూపు మెరుపులా ఉంటుందేమో?

ఇక నడక బూకంపంలా, స్నానం సునామిలా ఉంటాయెమో? కాని శాక్తేయులు మాత్రం ఆమె రూపాన్ని శ్రీబాలగా ( బాలిక స్వరూపం) సైతం ఊహించి ద్యానించి తరించే విదానం లేక పోలేదు. నేనైతే టీన్ ఏజ్ రూపంలో భువనేశ్వరిగానే ఊహిస్తుంటా. నా ఈ 43 సం.ల వయస్సుకు అమ్మవారి పట్ల నా మనస్సు మొగ్గింది కేవలం 10సం.లకు పుర్వమే.

గతంలో శాక్తేయం నన్ను పెద్దగా ఆకట్టుకోలేదు. జ్యోతిషం నేర్చుకుంటున్న కొత్తలో నా జాతకాన శివశక్తియోగం ఉందని ఎగిరెగిరి పడి విజిటింగ్ కార్డ్స్, లెటర్ హెడ్, కవర్ల పై శివయ్య అమ్మవారితో ఉన్న స్టిల్ ముద్రించి మురిసి పోయి ఉండొచ్చు. కాని సీరియస్ గా ఆ తల్లితో కమ్యూనికేషన్ ఏర్పడింది మాత్రం 10సం.లకు పుర్వమే.

అన్ని వర్గాల వారితోను కలిసి పోయే తత్వం ఉన్న నాకు భువనేశ్వరి మాతను ఆరాద్య దైవంగా భావించి గృపుతో పరిచయం కావడంలో ఆశ్చర్యమేమి లేదు. మానసికంగా ఎదగని మగ పిల్లలు తల్లిపై ఎక్కువగా ఆధారపడుతుంటారు. కాని మానసికంగా ఎదిగిన ఆడ పిల్లలు మాత్రం తండ్రితో దగ్గరగా ఉండ కలుగుతారు. ఇది సైకాలజియే కాదు నా అనుభవం కూడాను.

మరి నేను మానసికంగా ఎదగని వాడ్నా? లేక నా పెద్దరికం, మెచ్యూరిటి పై నాకే విసుగు పుట్టి రెఫ్రెష్మెంట్ కోసం ఇలా కవితలు వ్రాసుకున్నానా? లేక ఎన్ని ప్రళయాలు వచ్చి , ఎన్ని కల్పాలు మొదలైనా ఏ మాత్రం మార్పు చెందక నిత్య యవ్వనంతో దేవుళ్ళను కనిపెడుతుందని దేవి భాగవతం పేర్కొనే కార్టూన్ టైప్ కథలను నాలోని చిన్నపిల్లవాడు ఇష్ఠపడ్డాడా? లేక అటువంటి యవ్వనిక తారాసపడితే ఆమెతో ప్రేమ ఎలా ఉంటుందో చూడాలని నాలోని కాసనోవా కోరుకున్నాడో ?

లేక ఇన్కార్నేషన్ థియరి ప్రకారం ఇందాక నేను ఈ భువి పై పుట్టినప్పుడల్లా అమెనే ద్యానించి పూజించి చచ్చానా ? నాకైతే అర్థం కాలేదు.

నేను ఆమెను కోరిందల్లా ఒక్కటే “ఈ దేశాన ఆకలి -దోపిడీలను సర్వనాశనం చేసే అంతిమ యుద్దంలో నన్ను భాగస్వామిని చెయ్యి!”

కాని ఆమె నా తూ తూ మంత్రాలకు, తప్పుల తడకగా తెలుగు కాని తెలుగులో వాగే (ఆసు) కవిత్వాలకే ఉబ్బి పోయి సరస్వతిగా నా నాలిక పై నృత్యం చేస్తూ, భూత వర్థమాన భవిష్యత్ పరిణామాలను ఇట్టే అనలైజ్ చేసే శక్తిని ఇచ్చింది.

లక్ష్మీ దేవిగా నా ఇంట స్థిరవాసం చేస్తూ నా దారిద్రియాన్ని దహనం చేసింది. ధైర్య లక్ష్మిగా నా గుండెలో జెండా పాతింది. జెడ్ క్యేటగిరి సెక్యూరిటి ఇస్తూంది. ఇన్ని ఇచ్చినా ఆమె పై సంతృప్తిలోనే ఉన్నాను.

ఆమె సంతృప్తి చెందుతుందనే ఈ పిచ్చి వ్రాతలు వ్రాస్తున్నా. ఆమె సంతృప్తి చెందేదెన్నడో? నా కోరిక నెరవేరేదెన్నడో కూడా నాకు తెలుసు. ఆ ఘడియలు కూడ మొదలయ్యాయి. అందుకేనేమో పది సం.లుగా నా ఒకనికే పరిమితమైన ఈ వ్రాతలు కనీశం రెండొందల మందికన్నా చేరువ కానుంది ( ఆమె అనుమతితో ..ఆమె సమ్మతితో) చూద్దాం.