Monday, August 20, 2012

ప్రళయం

అమ్మ! దు:ఖాంతం కానున్న నీ జగన్నాటకంలో
కేవలం ఒక కొన మెరుపు కొరకొ,
సడన్ ట్విస్ట్ కొరకొ,
నా గతాన్ని. దు:ఖభరితం
చేశావన్న మాట.
కేవలం టెంపో పెంచడం కోసం నా ఈ చెత్త క్యేరక్టర్ అన్న మాట

కాలగతిని ఎరుగ చేశావ్
మనోగతిని చేదించేలా చేసావ్.
కాలగతితో నా మనోగతి ఏకీభవించిన నాడు
నాకు వీరికి నడుమ ఏమాత్రం ఉండదు తేడా

నింగి నేలల కరచాలనాన్ని ప్రళయాన్ని ఆపలేకున్నా.
కనీసం ఆపాలన్న ఆలోచన - అందుక్కావలసిన ఊహ
ఆ ఊహనూ నిజం చేసుకోవడానికి ఓ వ్యూహాన్ని ఇచ్చావ్

ప్రళయ తరుణమే వచ్చిన నాడు
గడియలే మొదలైన క్షణం
దానిని ఆపలేకున్నా
హడావుడి లేక హడలి పొక మరణించే
అవకాశాన్నైనా
ఇవ్వవే అమ్మా!

ఇదే నా పూజా ఫలమని సరిపెట్టుకుంటా

నామస్తిష్కాన్ని మణిమాణిక్యాల
నిక్షేపాలతో నింపేస్తున్నావ్ .. కాని వీటితో నేనేంచెయ్యాలి!

అమ్మా!
నిజానికి నాకు మద్యనున్న తెరలు ఒక్కొక్కటే తెంచేస్తున్నావ్

నా చేత ఏ పాట పాడించాలని ఈ ముస్తాబు
నా చేత ఏ ఆట ఆడించాలని ఈ మానిటర్లు.
ఏ అరంగేట్రం కొరకే ఈ ఉబలాటం

అమ్మా!
అందరికి ఇచ్చినంత పిడికిడంతటి గుండేనాకూ ఇచ్చి
పిడుగులనే దింఛుతున్నావ్!
ఎప్పుడు కురిపిస్తావే అమృత వర్షం

నీ పరీక్షలు పుట్టించే ఉత్కండతకు వణకడం ఒక వంతైతే
వీటిలో నెగ్గాక నువ్వు నాకు చెయ్యనున్న సత్కారాలను తలచుకుంటే
కలిగే భయం మరోవంతు

నాపిచ్చిగీతలను పిచ్చెక్కించే
కళాఖండాలుగ మలచగల నేర్పరివి నీవు
ఆ విషయాన నాలో లేవు అనుమానాలు
మరీ ఎగ్జిబిషన్లా మిగిలి పోతానేమోనన్న జంకే
నా గుండెను జింకలా తంతూ ఉంది

అమ్మా! ప్రేమను
గుర్తించే గుండెనిచ్చావు
ప్రేమను అందుకునే తెగింపునివ్వు
దక్కించుకునే త్యాగాన్నివ్వు

ఈ ప్ర్రాపంచిక జీవితపు డైనొజర్
సహస్ర హస్తాలతో దానిని కబళించే దుష్ప్రయత్నమే చేస్తే
వాటిని కండించే ఖడ్గం ధనం, ధనాని ప్రసాదించు

నా మస్తిష్కాన్ని ఖాళీ చెయ్యవే నా ఖజానాను
నింపవే. నీత్రిశూలపు పోటుసైతం తట్టుకునే
నా గుండెపై పొరపొచ్చాలతో వీరు విసిరీ
పోరకపుల్లలనుండి నన్ను నా గుండెను రక్షించుకునే
కవచం ధనం

ఆ కవచంతో నా గుండెను కప్పవే
హేతువాదపు కాగడా ఆరి పోయింది
ఆస్తికపు పండువెన్నెలలో మర్మాలన్నీ బహిర్గతమయ్యాయ్

ఆద్యాత్మిక అబిన్ చూపిన నవ్యలోకాలు కనుమరుగవుతున్నాయ్
ఒంటరి తనం బెదరగొడుతోంది

సమాజంపై వ్యతిరేకత నిర్వీర్యమై పోతుంది
తప్పోప్పుల విచక్షణ తగ్గిపొతుంది
ఏ దై తే నేమన్నజడత్వం చిగురిస్తోంది

వ్యక్తిత్వాలపై వ్యామోహం తగ్గిపోతోంది
వెన్ను లేని జేవితాలపై నా మూడవకన్ను
విరిసిన రవ్వలు చల్లారి పోతున్నాయ్

లక్ష్యం గొప్పదన్న ఆలోచన ఆవేశాలు అంతరిస్తున్నాయ్
జీవితాన్ని నిర్లక్ష్యం చేశామేమోనన్న
నిస్పృహను సైతం పసికట్టి

నా స్పృహతో అడ్డంవచ్చిన అస్పష్ట ఆలోచనలను అంతం
గావించి నిర్మిస్తా ఈ సమస్త మానవానిని
ప్రళయపు ఏరును...దాటించే వంతెన