Tuesday, May 08, 2018

అంబ పలుకు -తొలిపలుకులు


చాలా కాలం తరువాత తెలుగులో ఒక పోస్టు పెడుతున్నా. ఇప్పటికే తమిళంలో నా ఇ-బుక్స్ కిండిల్ స్టోర్లో పెట్టిన నేపథ్యంలో అంబపలుకు శీర్షికన నేను వ్రాసిన కవితలను సైతం ఇ-బుక్ రూపంలో తెలుగు నెటిజన్లకి సమర్పించాలని పూనుకున్నాను. అందుకు గాను నేను వ్రాసిన తొలిపలుకులు ఇవి .

కవితా సంకలనానికి (?) పేరు ఎందుకు పెట్టానా అనే అనుమానం మీకు కలుగ వచ్చు. ఇందుకు ప్రేరణ బుడబుక్కల వారే. వారేగా "అంబ పలుకు ..జగదంబ పలుకు అంటుండే వారు. ఇక కవితంటారా? జియాగ్రఫికల్గా ఆంద్రుడనైనప్పటికి , బాషా రీత్యా తమిళుడనైన నేను తమిళంలో కవిత వ్రాస్తే అందులో ఒక లాజిక్ ఉండేది. కాని నెను చిత్తూరు జిల్లా వాసిని కాబట్టి మరీ బాష రీత్యా  “కలగూర గంప” అనిపించుకునే చిత్తూరు పట్టణ వాసిని కాబట్టి /ఎన్.టి.ఆర్ అభిమానిని కాబట్టి తెలుగు కాస్తా అబ్బిందనుకొండి.

సాటి తెలుగు వారు తమిళాన్ని తెలుగులా – సాటి తమిళులు తెలుగును తమిళంలా పలుకుతుంటారు. ఎన్.టి.ఆర్ పుణ్యమా అంటూ నా తెలుగు తెలుగులాగే ఉంటుంది. నేటి ఇంగిలీష్ మీడియం యువత తెలుగు  కన్నా  నా తెలుగు మెరుగ్గానే ఉంటుంది.

బాష ఓకే.మరీ కవితలా అంటే నెను చేతులెత్తెయ్యాల్సిందే. ఎందుకంటే నా జీవిత కాలంలో చదివిన కవితలు రెండే. ఒకటి శ్రీ శ్రీ గారి “కొంత మంది  కుర్రవాళ్ళు” మరొకటి “జైలు నుండి ప్రేమ లేఖ” సంపుటిలోనిది. కాని ప్రేరణ పొందడానికి అనువైన మనస్సులో సరి కొత్త ఉషస్సును పుట్టించడానికి ఈ మాత్రం చాలవా ఏంటి?ఇక తెలుగు సిని గేయ రచయిత వేటూరి సుందర రామమూర్తి సిని గేయాల ప్రభావం నా పై గలవు .కేవలం  కాస్త మసాలా పట్టించడానికి అని మీరనుకుంటే నేనేమి చెయ్యలేను.

మరీ ఎవో వ్యాసాలు అవి ఇవి వ్రాసుకుంటే ఫర్వాలేదు కాని మరీ కవితలా? అని కన్నెర్ర చెయ్యకండి. నా నోట ఆ వాగ్దేవి కుర్చి వేసుకుని మరి కూర్చుండి పోయిందనే పిచ్చి నాకుంది . (ఎవరి పిచ్చి వారికానందం) కవితలల్లడానికి ఎంతో కొంత పిచ్చి అవసరం అని మీకు తెలుసుగా?

ఇక ఈ సంపుటికి పెట్టుకున్న పేరుకొస్తా.”అంబ పలుకు “ఇవి అంబ పలికిన పలుకులా? లేక అంబ పలికించిన పలుకులా? అంబ పలకాలని నేను పలికిన పలుకులా? I can not conclude .I want to  keep  all options  open. ఇప్పుడు సమయం .పూ: 3.42 గం. వేళకు మాటలను కూర్చి తీరాలన్న ఆవశ్యకత ఏమీ లేదు . అయినా వ్రాసేస్తున్నా. ఎందుకో? నాకే ఇది  తర్క రహితం అనిపిస్తూంది .

9 సం.లకు పూర్వమైతే పేపర్ పెన్ను పెట్టుకుని ఎడా పెడా వ్రాసి పారేసే వాడ్ని . ఇప్పట్లో కంప్యూటర్లో వోర్డ్ ప్రాససర్లో టైప్ చేయడం మొదలు పెట్టాక క్రియేటివిటి బొత్తిగా పోయింది. అసలు ఫ్లో రాదు. ఒక శిల్పం ఉండదు .మరీ ఈ ఫేస్ బుక్ వచ్చాక అసలుకే మోసం. ఫైనల్గా కవితా వస్తువు గురించి కొన్ని మాటలు చెప్పి విరమిస్తా.

అంబ అనగా దేవీ భాగవతం మొదల్గొని అన్ని ఇతిహాస – పురాణ చెత్త కుప్పలన్ని మీకు గుర్తుకొచ్చేస్తాయి.కాని నా అంబ కాస్త వైవిద్యమైంది. ఈమె యొక్క ఫోన్సాయ్క్ తల్లి ,ఈ మె స్థూల రూపం నా దేశం.ఈమె ధర్మ రూపిణి. నా అంబ జగత్జనని.వర్ణ, కుల, మత బేదాలకు అతీతురాలు. చెత్త కుప్పల్లోనుండి విద్యుత్ తయారు చేసినట్తుగా ఇతిహాస – పురాణ చెత్త కుప్పలన్నింటి నుండి తయారైన విద్యుత్తే నా కవితలు.

అంబ పై యుగ యుగాలుగా పేరుకు పోయిన  దుమ్ము –దూళీ –బూజులన్నింటిని దులిపేసి సరి కొత్త అంబను నాకు నేను ప్రతిష్థించుకున్నా. నా అంబకు నేను చేసిన పూజలివి.

ఇట్లు
చిత్తూరు మురుగేశన్