Monday, October 27, 2014

మరణానికి భీతిల్లేటంత గొప్ప ప్రాణం కాదు నాది !

అమ్మా ! అమ్మోరు తల్లి !
ఎలాగూ గౌరవప్రదమైన జీవితాన్ని ప్రసాదించ లేక పోయావు
కనీశం గౌరవ ప్రదమైన చావునైనా ప్రసాదిస్తావని ఆశించాను
అందుకే పాలకుల పై వారి చిలుక పలుకుల పై
 ఇలాచిందులు తొక్కాను

మరణానికి భీతిల్లేటంత గొప్ప ప్రాణం కాదు నాది.
ఇంకొంత కాలం బతికి తీరాలన్న గొప్ప జీవితం కాదు నాది.
ఈ క్షణం నన్ను మరణం వరించినా అది ఆలశ్యమే
గెలుపోటముల గురించి కాదు నా ఈ గోడు
కనీశం నా వ్యూహం - నా ప్రయత్నాలన్నా కొంత బెటర్గా ఉందొచ్చుగా
అన్నదే నా బాధ.

మరణం అని నేను పేర్కొంటున్నది
శారీరక మరణాన్నే
కాని  నువ్వు ప్రసాదిస్తున్నది మానసిక  మరణం
క్షణం క్షణం మరణం.

పోనీ వ్యక్తిగత జీవితంలోని వైఫల్యాలను దిగ మ్రింగి
సాంఘికంగా ఒక బొమ్మ గీసుకుని -దానిని చూసుకుని
బతికేద్దామని దిగ జారితే
ఆ బొమ్మ మీద కూడ మసి పూసేస్తున్నావు.

అయినా నీకు నాకు మద్య గల నెట్ వర్కింగులో  ఎలా కలుగుతూంది ఈ  అంతరాయం?
నీ వైపు నుండి కలిగితే అందుకు కారణం నీ ప్రళయ అజెండాకు
నేను అడ్డు తగులుతానన్న జంకు.

పాతికేళ్ళుగా నన్ను నేను పాతేసుకుంటానన్నా పట్టించుకోని
పాలకులు నా మాట వింటారని ఇంకా  నమ్ముతున్నావా అమ్మా? షిట్!

పోని నా వైపు నుండి అంతరాయం కలిగితే అందుకు కారణం
నా అహం అయ్యుండాలి
నా గతం అందరికి అవగతం అయ్యేది -కొంత సానుభూతైనా మిగిలేది
నా వర్థమానం ?

కుష్ఠు రోగికన్నా హీనంగా పుండ్లపై రంగుల కాగితాలు అతికించుకుని
బతికేస్తున్నా..
అహం నా సరిహద్దులకు రా గలదా?

మరి  ఈ అంతరాయానికి కారణం ఏమిటి?
రెప్ప పాటులో నా సర్వం కుప్ప కూలి పోతుందే..
ఆ తరువాత నువ్వు చాపర్లో సి.ఎంలా వచ్చి ఏం లాభం?
అమ్మా.. కరుణించవే.. కనీశం నేను కాసింత గౌరవంగా మరణించడానికి కరుణించవే!
ఏమిటి ఈ నీరసం ..ఎందుకీ నిస్ప్ఱుహ..
ఏం జరుగుతూంది?

పొరభాటున ప్రాణం పోతే ఖర్మ ఖాండలకైనా
చిల్లర డబ్బులు లేవు.
ఏం చూసుకుని ఈ బద్దకం?

హే వాగ్దేవి!
ఏమైంది? నీకేమైంది? నాకేమైంది?
ఎందుకీ దాగుడు మూతలు?
నా వెనుక ఒక దేశం ఉంది.
నేను పార ద్రోలవసలసిన ఆకలి దట్టంగా కమ్ముకుని ఉంది.
బాల సూర్యుడనై ఉదయించిన నన్ను మ్రింగేస్తున్న రాహువు ఏది?
ఈ హిపాక్రెట్సు నీకు  తల నీలాలు మాత్రమే సమర్పిస్తారు..
నేను నా తలనే అర్పించా?

నా మస్తిష్కంలోని "నేను" కేవలం ఒక అస్తిపంజరంగా పడున్నాను
అందులో నిత్యం జరుగుతున్నది నీ  నాట్యమేగా?
ఇంకేంకావాలి నీకు?

వీరు కేవలం పాలు,నీళ్ళతో చేస్తారు అభిషేకం.
కాని నేను రక్తంతో ..

నువ్వు నా వెంట ఉన్నావని -నన్ను అంటి పెట్టుకుని కాపాడుతావని
తెగ రెచ్చి పోయాను..ఏకంగా ఇక్కడి దెయ్యాలతోనే తగవు పెట్టుకున్నా

పచ్చి రక్తం త్రాగే ఆ పిశాచాలు -నన్ను నా ప్రజలను  పీల్చి పిప్పి చేయ చూస్తుంటే
నాలో ఈ నీరసం..నిస్ప్ఱుహ..
తల్లీ ఎందుకే నా పై నీకింత కక్ష ?  అయినా నీవే రక్ష.. !!
ఓం శక్తి

Sunday, January 26, 2014

చర్యలు-ప్రతి చర్యలు



అమ్మా మ్మోరు తల్లి!
నీ నామ జపం బీజాక్షర ధ్యానాలే కాదు.
సృష్టిలోని చిన్న ర్యా
స్వతంత్రమైనది కాదని వాటి ముందు వెనుక హనుమన్న తోకంతటి చర్యలు ప్రతి చర్యలు దాగి ఉన్నాయన్న సంగతి
తెలియడానికి ఇంత కాలం పట్టింది.

మరి నీ నామ జపం నీ బీధ్యానాలు వృధా అవుతాయని నేననుకోను
చర్య ప్రతి చర్యల గంగొత్రి రెక్కడుందో
ఇవి ప్పుడు ఎక్కడ ఎలా పరిసమాప్తి అవుతాయో  నేనేలా చేప్పగలను.
గుడ్లప్పగించి చూడడం మినహ నేనేం చేయ్యగలనే.
నిజానికి భూలోక వాసుమైన మేమే గ్రహాంతర వాసులమని
ఒక శాస్త్ర్ర వేత్త వేల్లడించాడు తొక చుక్కల్లొ నుండి తొలి జీవరాశి పుట్టిందని అతను చెబుతున్నాడు
మరి తో చుక్క నీ ముక్కుపుడకయ్యుండే అవకాశం లేక పొలేదుగా.

అమ్మా! నువ్వు లేదని నిరూపించే సైన్స్ కన్నానువ్వున్నావని క్షణ క్షణం ఊరటనిచ్చే నా మహా విశ్వాసమే మిన్న
అది అంవిశ్వాసమని లొకం చేప్పనీ
నా ప్రజ్ణ ప్రస్పుటంగా ప్రతిపాదిస్తుందా.. నువ్వున్నావని నా గతం చేబుతుంది నువ్వున్నావని
వర్థమానం చేబుతుంది నువ్వున్నావని భవిష్యత్తు?
అది తటస్థించినప్పుడు తేల్చుకుంటా ..నువ్వున్నావో లేవో
అమ్మా! తేలిసీ తేలియక ఇన్ని పాపాలకు తెగించింది
నన్ను వధించటానికి  నువ్వు దిగి వస్తే అప్పుడన్నా
అమృతనానికి నిలయమైన నీ  రూపాన్ని కళ్ళారా చూద్దామనే.
నీగురించిన తలంపులే నన్ను తల్లిని చేసాయి
మరి నీ ర్శనమే కలిగితే ఇక్కడి మానవులందరికి నేనే తల్లినై దాచుకుంటా నా ఒడిలో
ఓం శక్తి.....................