Friday, June 22, 2012

గొడ్రాలికి సైతం !


హే పవిత్ర మయీ !
నా లక్ష్యం లో ఒక పవిత్రత ఉంది
పవిత్రతకు నిలయానివి నీవు
నా లక్ష్యంలో పవిత్రత ఉంది
అంటే నా లక్ష్యంలోను నువ్వుండి తీరాలి

అసలు నీలోనే/ నీలొనుండే నా లక్ష్యం జన్మించి ఉండాలి
నా లక్ష్యం నాలోఇంకా సజీవంగా ఉంది
అంటె నీవు నాలో కొలువైయున్నావన్నమాట

ఈ నా అన్వేషణ-అద్యయనం నిజమైతే
నాకు విజయాన్ని ప్రసాదించు
ఈ ప్రతిష్టంబనను తొలగించు

కూనీకోర్లు, దగాకోర్లు ప్రశాంతంగా
సకల సౌభాగ్యాలతో ప్రశాంతంగా బ్రతికేస్తుంటే

పవిత్రమైన లక్ష్యంతో
ఎనలేని ప్రతిభలతో, జ్ణానంతో
కాసింత విశ్రాంతికి నోచుకోక నన్ను నేను
నొచ్చుకుంటూ నెట్టుకొస్తున్నా
ఏమిటి ఈ దౌర్బాగ్యం
క్షణ క్షణం నా రక్తం ఉడికించే స్వజనులతో
విసిగిపోతున్నాను.


ఈ నీ దయా రాహిత్యం గురించి నేనేమనుకున్నా
నీవు ఏమి అనుకోవ్
మరి పదిమంది ఏమనుకుంటారన్న
జ్ణానం...., సిగ్గుకూడా లేదునీకు తక్షణం
సాయపడవే
పేదరికం నా చాయలోకి సైతం రాకుండా అడ్డుకట్ట వేయవే

తల్లీ వీరి తప్పిదాలకు నెను శిక్షించ బడుతున్నా
వీరి నిర్లక్ష్యాలకు నేను బలై పోతున్నా
వీరి బాద్యతారాహిత్యానికి నేను బంగ పడుతున్నా
తమ అసమర్థతలను దాచుకునే ప్రయత్నంలో
నా సమర్థతకు సమాధి కడుతున్నారు వీరు.

వీరి కాంప్లెక్స్ లకు నా కాలల కాంప్లెక్స్ కదలి పోతుంది

తల్లీ యిది న్యాయం కాదే
నువ్వు దేవతవే అయ్యుండవచ్చును
నేను కేవలం మానవ మాత్రుడనే అయ్యుండవచ్చును
కానీ న్యాయం ఒకటేగా

తల్లీ ! వీరిని బాగు చేయ చూసి వీరు బాగా లేక పోవడం వలన
వీరూ బాగు పడక నన్నూ బాదలు పాలు చేస్తున్నారు తల్లీ!

నా నిస్వార్థ కృషికి నేనే రాజ సన్మానాలు ఆశించటంలేదే
కనీసం ఈ అడ్డూ ఆటంకాలపై గొడ్డలి పెట్టు కావమ్మా !

నా గోడు విటే గొడ్రాలికి సైతం కడుపు తరుక్కు పోతుంది
యిన్నిట్రిలియన్ల బిడ్డలను కన్న నీ మనసు చలించకుంటె
నేనేంచెయను

నేటి కాసులు -నాటి తపస్సుకు తోడయ్యుంటే


అమ్మా అమ్మోరు తల్లి !
నా పాజిటివ్ థింకింగ్ కు ఎప్పుడో పాతర వేసా
నా మనసెందుకో కీడునో శంకిస్తుంది
ఈ క్షణం నాది - నీ దయ ఉంటే ఈ రాత్రి నాది

ఎలాగో గౌరవ ప్రద జీవితాన్ని జీవించలేక పోయాను
గౌరవప్రద మరణాన్ని కోరి ఈ కవితనల్లుతున్నా

నా కళ్ళ ముందే ఎన్నో అన్యాయాలు జరిగిపోయాయి
మంత్రభలం చాల్లేదనో -తపం భంగపడిందనో సర్దుకున్నాను

కేవలం నా పేదరికం కారణంగా నా గుండె వ్రణాలకు చికిత్స చెయ్యించుకోలేక
పోతున్నానని కారణాలు కల్పించుకున్నాను
ఇటీవల నా చేతికొచ్చి పోయిన వందలు వేలు సైతం
ఆ వ్రణాలను మరింత పెద్దవిగా మార్చేయే గాని నయం చెయ్యలేక పోయాయి

నేనేదో ఊహించుకున్నాను
నేను తెగించిన అన్యాయాలను స్వర్ణంలో ఇత్తడనుకున్నా
అవి నా పాల మనసున పాలిడాల్ అయ్యాయని
ఇప్పుడే తెలుసుకుంటున్నా

అప్పట్లో నా పస్తులకు పరిష్కారం కనుగొనలేక పోయినా
నిన్ను నిలదీసి నీకు అల్టిమేటమ్ జారి చేసే సత్యాగ్రహం నాకు కలిగేది
ఇప్పుడు ?

లేదు లేదు లేనే లేదు

అన్నీ పోగొట్టుకుని కాసింత పుణ్యం కూడ కట్టాను
ఇప్పుడు ఆ పుణ్యాన్ని సైతం పోగొట్టుకుని
పాపాలు మూట కట్టుకుని
కనిపించిన కాసులేమో
కనుమరుగై పోయాయి

అమ్మా ఇంతేనా తల్లీ నీవు నా నుదుటి పై వ్రాసిన వ్రాత?
ఇందుకేనా తల్లి అంతటి గుండె కోత

అమ్మా కనులున్న గుడ్డివాడినై
చెవులున్నా చెవిటివాడినై ఉన్నాను
కరుణించవే అమ్మా

నేటి కాసులు -నాటి తపస్సుకు తోడయ్యుంటే
నేనిలా మిగిలి పోయేవాడ్ని కాదు

ఈ కాసులు సైతం కానరాకుంటే ఏమై పోయేవాడినో
ఆత్మహత్యకైతే అవకాశమే లేదు

ఇక హత్యకో లేక మరో ఉధంతానికో పాల్పడి ఉండే వాడ్ని

పేదరికానికి జడిచి


అమ్మా అమ్మోరు తల్లి !
ఎంతటి ఉన్నత శిఖరాల్లో ఉంచావో
అంతగా నా పేదరికం
పెరిగి నన్ను కించ పరిచేది
నేనెంతటి నీచానికి దిగజారినా
అది నన్ను విడిచి పెట్టదని
తెలిసి పోయింది
కేవలం పేదరికానికి జడిచి
ఇలా తయారయ్యాను

అమ్మా ఏమిటీ ఏమిటి ఈ దుస్థితి?
నాటి తపస్సు పేద ప్రజల ఉషస్సు కోసం
కేవలం కొంత యశస్సు కోసం
నేను చేసిన ప్రయత్నాలన్ని
తుస్సేనా?

అమ్మా !
నేనెంతో ఏలిగ్గా వెనక్కి రాగలను
నా వ్యూహం తప్పని తెలుసుకున్నాను
నేను నా పేదరికాన్ని గెలవలేనని తెలుసుకున్నాను
ఇంత మాత్రం గెలిచినందుకే
అది నా కవచాన్ని తొలిచి వేసింది

నా గుండెను కలిచి వేసింది

అమ్మా ! అమ్మోరు తల్లీ !
కాసుల కాంత నీ బిడ్డే కదా
ఆమెకింత గెడ్డి పెట్టి
నాక్కొంత ఆదాయాన్ని
సమకూర్చి నా లక్ష్య భాటలో పయనింప చెయ్యలేవా?

అమ్మా.. ఇదేమిటి
నా స్థితి నాకే మింగుడు పడనంతగా
దిగజారి పోయింది

నేనేదో రాబిన్ హుడ్లా తయారవుతాం అనుకుంటే
చివరికి నా కలల రథం అప్పుడమైంది

అమ్మా కరుణింఛవే ..లేదా మరణించనీయవే
ఆత్మాహుతి పిరికి తనం .నేనా ఆ పని చెయ్యలేను

ఒక్క బుల్లెట్టే .. నా లక్ష్య సాథన ప్రక్రియలో ఒక్క బుల్లెట్
నేను కోరుకున్న హీరాయిక్ జీవితాన్ని జీవితాంతం
జీవించ కోరలేదు
కేవలం ఐదు సం.లు చాలమ్మ

అమ్మా..కరుణించవే ఓం శక్తి

నా శక్తి వృధా చేస్తున్నానే
నా సర్వస్వం పోగొట్టుకుని
పొందిన తేజస్సు కేవలం కాసుల కోసం
క్షీణించి పోతుందే

కరుణించవే తల్లి ఓం శక్తి..