Friday, May 11, 2012

అంబపలుకు :2

అమ్మా అమ్మోరు తల్లి !
వాన నీటిలోని ఆ నాటి నా కాగితపు ఓడలనే కాదు
సముద్రంలో దూసుకు పోయే టైటానిక్లను సైతం
బోల్తా కొట్టించగల సమర్థురాలివి నీవు.

అన్ని తెలిసి తెలిసి నీ మాయలో పడి
నీ దయతో ఒక పిచ్చి పడవ నిర్మించుకున్నాను.

దానిని నీవే నడుపుతున్నావని భ్రమించాను
కాని అంతా నా భ్రమని తేలిపోయింది.

అప్పటి కాగితపు ఓడైనా సరే
ఇప్పటి పిచ్చి పడవైనా సరే
ఏ క్షణంలోనైనా మునిగిపోగలదని
నా కొంప ముంచ గలదని తెలుసుకున్నా

మొత్తానికి నీ దయా భిక్షం మీద
బతుకు బండి లాగించవలసిందే కాని
నా బతుకు నేను బతకలేనన్న మాట
జీవించడమే కష్ఠ సాథ్యమన్నప్పుడు

మంట కలిసిన మానవత్వానికి పునర్జీవం
పోయడం నా తరమా?

నీ చేయూత అర క్షణం కొరబడటంతో జరిగిన ఈ భంగ పాటుతో
సైకిల్ నుండి క్రింద పడినంతగానే
నా మనస్సుకు గాయమైంది.

రేపటి అంతిమ యుద్దం నువ్వు "చెయ్యిస్తే"
హెలికాఫ్టరు నుండి పడినంతగా వ్రణమై పోతుందేమో?

ఏమిటో అంతా నా భ్రమా..

No comments: