Friday, June 22, 2012

నేటి కాసులు -నాటి తపస్సుకు తోడయ్యుంటే


అమ్మా అమ్మోరు తల్లి !
నా పాజిటివ్ థింకింగ్ కు ఎప్పుడో పాతర వేసా
నా మనసెందుకో కీడునో శంకిస్తుంది
ఈ క్షణం నాది - నీ దయ ఉంటే ఈ రాత్రి నాది

ఎలాగో గౌరవ ప్రద జీవితాన్ని జీవించలేక పోయాను
గౌరవప్రద మరణాన్ని కోరి ఈ కవితనల్లుతున్నా

నా కళ్ళ ముందే ఎన్నో అన్యాయాలు జరిగిపోయాయి
మంత్రభలం చాల్లేదనో -తపం భంగపడిందనో సర్దుకున్నాను

కేవలం నా పేదరికం కారణంగా నా గుండె వ్రణాలకు చికిత్స చెయ్యించుకోలేక
పోతున్నానని కారణాలు కల్పించుకున్నాను
ఇటీవల నా చేతికొచ్చి పోయిన వందలు వేలు సైతం
ఆ వ్రణాలను మరింత పెద్దవిగా మార్చేయే గాని నయం చెయ్యలేక పోయాయి

నేనేదో ఊహించుకున్నాను
నేను తెగించిన అన్యాయాలను స్వర్ణంలో ఇత్తడనుకున్నా
అవి నా పాల మనసున పాలిడాల్ అయ్యాయని
ఇప్పుడే తెలుసుకుంటున్నా

అప్పట్లో నా పస్తులకు పరిష్కారం కనుగొనలేక పోయినా
నిన్ను నిలదీసి నీకు అల్టిమేటమ్ జారి చేసే సత్యాగ్రహం నాకు కలిగేది
ఇప్పుడు ?

లేదు లేదు లేనే లేదు

అన్నీ పోగొట్టుకుని కాసింత పుణ్యం కూడ కట్టాను
ఇప్పుడు ఆ పుణ్యాన్ని సైతం పోగొట్టుకుని
పాపాలు మూట కట్టుకుని
కనిపించిన కాసులేమో
కనుమరుగై పోయాయి

అమ్మా ఇంతేనా తల్లీ నీవు నా నుదుటి పై వ్రాసిన వ్రాత?
ఇందుకేనా తల్లి అంతటి గుండె కోత

అమ్మా కనులున్న గుడ్డివాడినై
చెవులున్నా చెవిటివాడినై ఉన్నాను
కరుణించవే అమ్మా

నేటి కాసులు -నాటి తపస్సుకు తోడయ్యుంటే
నేనిలా మిగిలి పోయేవాడ్ని కాదు

ఈ కాసులు సైతం కానరాకుంటే ఏమై పోయేవాడినో
ఆత్మహత్యకైతే అవకాశమే లేదు

ఇక హత్యకో లేక మరో ఉధంతానికో పాల్పడి ఉండే వాడ్ని

No comments: