Friday, December 06, 2013

హే మహా రచయిత్రీ !

హే మహా రచయిత్రీ!

 ఎన్నో కథలు వ్రాశాను.
 ఏందరో మనుషుల జీవితాలను చూస్తున్నాను వింటున్నాను.
మరేందరో మనుషుల జీవితపు సుఖః దుఖాల్లో పాలు పంచుకున్నాను.
అయితే ..
అమ్మా !
 నాకథలో మాత్రం ఎందుకే ఇంతటి డ్రాగింగ్?

నా తల్లికి కుచేలుని భార్య పేరు కుదిరింది  కాబట్టి ఈ దారిద్రియం
 ఇలా వేంటాడుతుందా, పుట్టిన నాటి నుండి నేటి వరకు ఎదోరూపంలొ-
మరి  ఎదో మొతాదుల్లో దారిద్రియం .. దారిద్రియం ..

ఈ దారిద్రియాన్ని దగ్థం చేసేందుకు ఎంతగానో ఎదిగాను. మరి ఎంతగానో దిగజారాను.కాని దారిద్రియంలో మాత్రం మార్పులేదు.
ఛాయలా ..నీడలా..... పాపంలా ....శాపంలా వేంటాడుతునే వుంది ఏందుకమ్మా?

నేను భవిష్యత్తులో కేవలం డబ్బు మనిషిగా పరివర్తన చెంది, ఈ సమాజాన్ని దోచుకొని నా జాతకాన్ని సార్థకం  చేయ్యాలని, ఈ ట్రిట్మేంటా అమ్మా!.....

నా గోడును ఏ మాటలతో చేప్పాలను కున్నా అదే మాటలతో నీకు ఇదివరకే విన్నవించుకున్న సంద్రభాలు మళ్ళి మళ్ళి గుర్తుకొస్తాయి.

 అన్ని విదాల అర్హత వుండి
 అదృష్ఠ వంతునిగా ఎదగనిచ్చే జాతకంలోనే పుట్టాను
నా ప్రయత్నంలో లోపమంటావా?
అది కాస్త అతిగా గోచరించ వచ్చునేమోగాని లొప మంటూ లేదు.

ఈ దేశాన్ని ఉద్దరించాలనుకున్నాను.
కనీసం నా కుటుంబాన్ని సైతం పోషించుకోలేని
దుస్థితిలొనే వున్నాను.
గురు-చంద్ర సంయేగ ఫలమగు 14సం" ల వన వాసం అంటే
ఇదేనేమోనని ఓర్చుకున్నాను. అవీ గడచి పొయాయి.

తపస్సు చేశాను. ఒకే బీజాన్ని 5 సం'' లుగా ద్యానిస్తూనే ఉన్నాను

ఏవో కొన్ని అద్భుతాలు జరుగుతున్నాయి గాని,
నా దారిద్రియం మటుకు దగ్దం కావడం లేదు. ఎందుకు?

1967-1986 మధ్య గడచిన 19 సం"ల కాలాన్ని విడిచి పెడతాం.
అప్పుడు నేను కేవలం ఒక తెలివైన చిలకను మాత్రమే.

మరి నేడు.........
హే మదుర మీనాక్షమ్మ !
నీ చేతిలో చిలుకంతటి స్థాయికి ఎదిగాను
హే అంబా!
నా పలుకులు నీ పలుకులంతటి భీభత్సాన్ని సృష్టించేస్తున్నాయి.
పూజ్యులు పుజ్యాలవుతున్నారు.
రాజ్యలే గడ గడ వనకుతున్నాయి.

మరి నా దారిద్రయం మటుకు కొన ప్రాణంతోనన్నా కొట్టు మిట్టడుతూనే ఉంది.
నా మాటలకు చిరంజీవత్వం ప్రసాదించమంటే
పొరపాటున నా దారిద్రయానికి చిరంజీవత్వం ప్రసాదించ లేదుకదా?

పోరపాటున నా దరిద్రయానికి అమృతసేవనం గావించ లేదుకదా...

గమనిక:
ఇది 2005 న వ్రాసిన పద కవిత్వం (?) 2007 ఏప్రల్ చివరి వారానికెల్లా నా జీవితంలో మార్పు వచ్చింది .అంబ మంచి తీర్పే ఇచ్చింది. నాడు
పొట్ట చేత పట్టి బతికిన నేను నేడు ఏకంగా లక్షా ముప్పై వేలు పెట్టుబడి పెట్టి (ఇందులో ఎక్కువ భాగం పాఠకుల కాంట్రిబ్యూషన్) 4 పుస్తకాలు ఏక కాలంలో ప్రచురించనున్నాను

No comments: