Wednesday, November 27, 2013

రాష్ఠ్రం ముక్కలు ముక్కలు కానుంది

అమ్మా అమ్మోరు తల్లి,
గణపతిలా నిన్నే నమ్మి
నీ చుట్టే తిరిగి చూసాను
నో యూస్
సుబ్రమణ్యునివలే నెమలి ఎక్కి
మూళ్ళోకాలు తిరిగొచ్చాను నో యూస్
నన్నేంచెయ్యాలని నీ ఉద్దేశం

ఈ బతుకును ఇచ్చింది నువ్వైనా సరే
నా పూర్వ ఖర్మలైనా సరే
నాకీ బతుకంటే విరక్తి
అందుకని నేను ఆత్మ హత్య చేసుకోను
ఎందుకో తెలుసా ?

ఎలాగో గౌరవ ప్రదమైన జీవితాన్ని
జీవించ లేక పోయాను
కనీశం మరణంలోనన్నా గౌరవం మిగలనీ అనే

స్వార్థపూరిత ఆలోచనలతో చర్యలతో
జన్మలు సంభవమని
నా స్వార్థం వీడాను
ఈ భూ ప్రపంచం మీదున్న వారంతా
నీ సంతానాలే అంట గదా
అందుకే వీరి సంక్షేమార్థం
నా ప్రయత్నం మొదలు పెట్టాను
అందులో భాగమే ఆపరేషన్ ఇండియా 2000
తొలూత నా మాతృభూమిని
చక్క దిద్ది ఆ పై దాయాది దేశం పై దృష్ఠి పెట్టి
అటే ప్రపంచ దేశాల రూపు రేఖలను సరి దిద్దాలనే
భయలు దేరాను

రూపు రేఖలు సరి దిద్దడం షిట్ సరి దిద్దాలనుకోవడం
నీ అహన్ని దెబ్బ తీసిందేమో గాని నా రూపాన్ని కురూపం చేసావు
ఆకలి దోపిడీల పై యుద్దం మొదలు పెట్టిన
నన్నే ఆకలికి గురి చేసావు
ప్రస్తుతం నేనూ వీరిలాగే కాస్త లౌక్యం నేర్చి ఆకలిని
ఆమడ దూరంలో పెట్టున్నాననుకో
దోపిడీ పై యుద్దం కొరకు సన్నత్తం అయిన
నన్నే దోపిడీకి గురిచేసావు
ఓకే ఓకే
అహంకారి అన్న నీ బిరుదుకు సరిపడా ప్రవర్తిస్తున్నావు
నీ అహం దెబ్బ తినే రోజులు దగ్గరకొచ్చేసాయి
కాస్కో.. నువ్వే చూస్కో
రాష్ఠ్రం ముక్కలు ముక్కలు కానుంది
పేద బతుకులు బగ్గుమననున్నాయి
ఇప్పటికే బతుకు స్థంభించింది

ఓకే ప్రొసీడ్.. ప్రళయం నీ అజెండా
సమసమాజ నిర్మాణం నా లక్ష్యం
నీది నీదే.. నాది నాదే

No comments: