Tuesday, November 05, 2013

నా దారిన నన్ను పోనీ ( కవిత)

అమ్మా అమ్మొరు తల్లి !

ఈ మహిలో మంట కలిసి పోతున్నమాన వత్వం
 నన్ను వనికిస్తూంది.
 మనుషులను  వెంటాడి వేటాడుతున్న
"వాసన" దడ పుట్టిస్తూంది.

 నాకేలాంటి భ్రమలు లేవు
చాలు! అందమైన అబద్దలు
ఆందవిహీనమైన అర్ద సత్యలు ,
అన్ని  స్వప్నాలను భగ్నం చేసే నగ్న సత్యలు
చాలు !

ఎవడో వస్తాడని అతనికి నా
మార్గం అందుబాటులొ ఉండాలని నన్నింకా ఇలా వేధిదించడం  తగదే.......
ఇది వధించడమే అవుతుందే తల్లీ !


ఒక్క 5 సంవత్సరాల కాలం  పాటు  
నేను కలలు  కానే వనరులు,వాతావరణం
మనుష్యులు, ఆరోగ్యం నాకీయవే

నీకు  లెక్కలన్ని ఒప్ప చేప్పి - నా భాట సద్ది మూట చేసుంచి
నా దారి నేను చూసుకొంటాను.

కేవలం ఈ  వేసవిని సైతం తట్టుకోలేక పోతున్న
ఇది మరి నా అలోచనలు సైతం
 ప్రభావించే స్దాయిలోఉంది.

నేనీ మనుష్యులను  తట్టుకో లేక పోతున్న
కనీసం వీరు
తమ  ప్రాపంచిక విజయాల కోసం కూడ 
ఆడుగు ముందు కేసేలా లేరు.

నేను 22వ శతాబ్దం  గురించి మధపడుతుంటే,
వీరు కేవలం రెపటి గురించి కూడ అలోచించేలా లేరు.
చాల్లే తల్లి !

నాలో ఉత్సాహం ఉబికినప్పుడు నేను కావ్యాలే రచించా..
అవి అగ్నికి ఆహుతి అయ్యాయి
నేడు చిరంజీవత్వం
అందుభాటులో  ఉంటే ఏమో తేలియని విరక్తి.
జగన్నాటకాన్ని రక్తి కట్టిస్తున్నావు.. భేష్ !

నా దగ్గర  ఉన్న వాటిని వడ్దించి వేళ్ల్లిపోతే
చాలనిపిస్తుంది,
అమ్మా..అమ్మా ..కనీశం నీకై నేను చేసిన  రచనలు  అక్షర  రూపం దాల్చనీయవే  నా ఆలోచనలు అవే కార్య రూపం దాలుస్తాయి.

ఓం శక్తి.....

No comments: