Wednesday, November 27, 2013

పేదరికపు సమాధిలో

నేనేవర్ని?
నేను ....
ఆ మహాతల్లి కన్న ముద్దు బిడ్డని.
సఖల సిద్దులను కైవశం చెసుకున్న సిద్దుడ్ని
 కాని వాటి స్పృహ సైతం లేక అతిసామాన్యుని వలే
ఈ ప్రపంచాన్ని నమ్మిస్తున్న వాడ్ని

నాకు నేను నిర్మించుకున్న పేదరికపు సమాధిలో 
ఉక్కిరి బిక్కిరి అవుతున్నాను.

ఆకలి- దోపిడిల నుండి నా జాతిని రక్షించు కోవడానికి
కదం త్రొక్కి నిత్యం వాటికే బలౌతున్న త్యాగ పురుషుడ్ని.

ఈ దేశపు పేదరికాన్ని కాల్చి వేయడానికి పూనుకుని ఆ పేదరికానికే ఆహుతి అవుతున్నవాడ్ని.

నేనేవరిని?

అను నిత్యం పొట్టచేత పట్టి బ్రతికినా లక్ష్యాన్ని  జార విడువని వాడ్ని
40 కోట్ల మంది పేదవాళ్ళను సంపన్నులు చేయడానికి
ఈ రాజకీయ రణ రంగంలోకి ప్రవేశించిన అత్మహుతి దళాన్ని .

నాలో వికసించే సహస్ర దళాల విశ్వ ప్రేమ మీద నిప్పులు చేరుగుతున్నారు.
నేను క్షమిస్తాను.
అందుకని నేను మహత్ముడ్ని కాను
చేతకాని వాడ్ని కాను. అయినా క్షమిస్తాను.

దయతోకాదు.భయంతో అవును ఖర్మలు నా కాళ్ళకు సంకేళ్ళవుతాయేమొనన్న భయంతొ క్షమిస్తాను.

 నా లక్ష్యసాధన ప్రక్క ద్రోవ పడుతుందే మోనన్న భయంతో క్షమిస్తాను.

ఆకలి నన్ను భొంచేసినప్పుడు భయపడ లేదు. నా కలి గిలి పుట్టించినప్పుడు భయపడలేదు. మరొ సారి దానం చేసేటంత రక్తం నా
శరీరంలో లేదన్నప్పుడు భయపడ లేదు.

 మరణాన్ని  అహ్వణిస్తూ ఉన్నా
"ఈడ్ని ఎందుకురా పంపారు" అని తల్లి అడిగినప్పుడు భయపడ లేదు మూత్రపిండాలు అమ్ముకుని బ్రతకమని నా తండ్రి చేప్పినప్పుడు భయ పడ లేదు .

నాకు జరిగిన అన్యాయాన్ని ప్రశ్నిస్తే ఖర్మలు చుట్టుకుంటా యేమొనని భయపడుతున్నను.

నాకు విరక్తి కలిగినది నిన్నా మొన్నా కాదు.
మనుషులు తమ భట్టల్లోపు జంతువులే నన్న సత్యం తేలిసినప్పుడే విరక్తి కల్గింది.
ఆ అదృశ్య హస్తాల చేతిలో వీరందరు భానిసలని!
త్రికాలాలకు భానిసలేనని తేలిసినప్పుడే విరక్తి కల్గింది.

నా గుండె కాలం ఇచ్చే తీర్పు ను అంగీకరిస్తుంది.
మార్పుకు మారు మాట్లాడను.
కాని ఈ మనుషుల రంగులు
స్థితిని పట్టి పరిస్థితిని పట్టి ఇట్టా మారినప్పుడే
ఆ మార్పును నేను కన్నప్పుడే
నన్ను నేను మరో సారి కన్నాను.

నేను తల్లిని
మాతృత్వం నా ప్రతి రూపం.
నేనా తల్లిని  నమస్కరించాక తల్లిని కాలేదు .
నన్ను నేను సంస్కరించుకున్నాక తల్లిని కాలేదు

నామాతృత్వం యధ్భావం తద్భవతి కాదు

నేను తల్లిగానే  పుట్టాను
ఉల్లి పొరలా అహం నా తల్లి మనస్సును కప్పి ఉంటే
నా జీవితంలో వీచిన పేను గాలికి అది లేచి పొయింది.

ఈవీరులు, శూరుల  శౌర్యాలు ఉల్లి పొరల కన్న లేతవి.
పేదరికపు పేనుగాలి కాదు కదా.
ఆ అదృశ్య హస్తపు నీడ సోకినా  నాలుగు కాళ్ళల్లో ప్రాకుతారు.

షిట్ .. నేను క్షమిస్తాను.
ఎందుకో తేలుసా?
 నా తల్లి మిమ్మల్ని క్షమించకూడదని
మీ నరకాన మీరు వర్దిల్లండి కాదనను
 నా స్వర్గాన ఎందుకురా ఉమ్మేస్తారు?
నా చిదానందం పై కారు మబ్బుల్లా కమ్మేస్తారు.

ఒరేయి ఓరేయి ఏమిట్రా మీ అహం? మీ ఇంట కుక్క పిల్ల చచ్చినా చచ్చి పొతార్రా? మీకేందుకురా ఈ అహం?
నా తల్లి రక్షణలో గర్భస్త శిశువులా  ఉంటున్న నాకే రాని అహం మీకేలా వచ్చిందిరా?

నీకేంతేలుసు ? నీకేంతేలుసు అని రేచ్చిపోతున్నారు?
ఈ రోజు ప్రపంచ బ్యాంకు నిర్ణయం తీసుకొని శాంతి భద్రతలపై
మాదే అధికారం
లెకుంటే మీ దేశానికి అప్పివ్వం అని ఒక్క కాయితం
ముక్క మీ మొఖాన కొడి తే

 ఏం అవుతుందిరా మీ బ్రతుకు?

నువ్వు చేస్తావా న్యాయం?

న్యాయ స్థానం ఇచ్చిన తీర్పులే మార్పులకు అతీతం కాదంటూ నువ్విస్తావా తీర్పు? ఎప్పుడన్న విన్నవా..కాలం ఇచ్చేతీర్పు? ఎప్పుడన్నా చవి చూసావా తర్కంలేని మార్పు.

కేవలం కండలు పేంచావు నేను గుండె పేంచుకున్నా.
నా జాతిని కాదు ఈ ప్రపంచాన్నే ప్రేమిస్తాన్రా!

కాలజ్ణనం తేలుసా నీకు?
నీ వంటి కాలాంతకుల కాలం చేల్లే రోజు ఏ ఘడియిలో  ప్రారంభం అవుతుందో లెక్కించుకో.
 నేను లక్ష్యవాదిని నాకు మీ టొపిలు మంది మార్బలాలతో పని లేదు.

నేను గైకొన్న లక్ష్యం కొరకు పాపాలు మూట కట్టుకుని సంపాదించైనా సరే వెచ్చిస్తాను.
శతృవు కన్నా రక్తం ధార పోసే నా రక్తాన్ని ఉడికి స్తావురా?

నేను క్షమించినా నా తల్లి క్షమించదురా. నువ్వు చేడి, ఆకలితో మాడి నా గడ్దం పట్టుకుని చేప్పిం చుకున్నా నా శాంతి కాండ పారదురా?

తప్పు చేసావు చాలా తప్పుచేసావు.

నేను కార్త వీర్యుడ్ని
నాకు సహస్ర హస్తాలున్నయి అని చేప్పను
కాని నేను  నా రెండు హస్తాలను సైతం ఉపయోగించను
సహస్రనామ పఠనం తప్ప ఇంకేమి చేయ్యను.
అన్ని నా తల్లే చేస్తుంది.
Any how..Thankyou

నీ ఖర్మ నా ఖర్మను వదిలించావు.

No comments: