Wednesday, November 06, 2013

నన్ను నా లక్ష్య బాటలొ సాగనీయవే



అమ్మ అమ్మోరు తల్లి!
రేప్ప పాటులో కుప్పకూలి పోగల
పేక  మేడ నా జీవితం  అని తేలుసు.
నాలో ఓ జ్యోతిలా వేలుగుతున్న నిన్ను
ఏ రంగుల  కాయితమో - ఏ ప్లాస్టిక్ చెత్తొ
ముసెయ్య గలదని తేలుసు 

ఆ జ్యోతి వీటిని  కాల్చేయ్య గలదని తేలుసు
కరిగించెయ్య గలదని  తేలుసు.

ఏన్నో సార్లు చెప్పా.
 వీరి చేవులకు వినబడని - నీ చేవులను 
 తోలచి వేయగల డేసిబల్సు తో చెప్పా.

 నేను అత్మాభిమానం గల మూర్కుడను,
పట్టిన పట్టు వీడని విక్రమార్కుడను
నా మనోబలం  అతీతం - మానవాతీతం 
దైవా దీనం - కొన్ని సందర్బాలలో దైవాతీతం

ఈ పుట్టుక పై లేదు మొజు 
సదా సర్వ కాలం  గాలి లొ దీపంలా
మీ కరుణా కటాక్షలకు
అర్రులు  చాస్తు మీ ద్రోహాలకు  విస్తుపొతు విసిగి  పోయాను.


నేననుకున్న పని చేయ్యకున్నా ఫర్వాలేదు.
ఎలా చేయ్యాలో డాకు మేంటైజ్ చేయ్యాలి.
చేస్తే ఏ మవుతుందో వీరికి చిన్నట్రయిలన్నా చూపాలి.


ఆట విడుపుల్లో  నీ ఇమేజ్ పై పట్టిన బూజును  దులిపేయ్యాలి. 

నీకు  బహుజనులు మేచ్చే రంగు వేయ్యాలి.
నీకు కొంత మేజారిటి తెచ్చి పేట్టాలి
ఇంతే ఇంతే నా అజెండా...........

కల్ప కాలాలు  బతికినా చివరికి విజయం మరణానికే
దానికై కాచుక్కూర్చోవడం నా అత్మాభిమానానికి గొడ్డలి పేట్టు

 నా కృషి , శ్రమ, ఆర్హతల  ప్రాతి పదికన డిమాండ్  చేయ్యడం లేదు.
నీ  నిర్లక్ష్యాన్ని నిలదీసే ఓపిక లేక
 నన్ను నీ కరగని  మనస్సు  సమర్థించి  అర్దిస్తున్నా

కాసింత దయ  ఉంచవే
ఒక మాయను  సృష్టించి వీరిలో అడుగంటిన  విశ్వాసాన్ని మాన వత్వాన్ని
పైకి ఉబికేలా చేస్తాను.
కాసింత  అడ్డు తప్పుకోవే.......

ఈ గడ్డు  కాలం  గడచి పోయేలా చేస్తాను
పేదరికం ఈ దేశం  విడిచేలా   చేస్తాను.
కాసింత గుండే కరగవే

నన్ను నా లక్ష్య బాటలొ సాగనీయవే
బిక్ష  పాత్ర గా మారిన ఈ  కర్మ భూమిని  అక్షయ పాత్రగా  మారుస్తా!!!!!!!!..................... ఓం శక్తీ...........

No comments: