Thursday, August 18, 2011

అంబపలుకు !

అమ్మా అమ్మోరు తల్లి !
అంతా అయోమయంగా ఉంది
ఓటమి - పేదరికాలు నాకు
కొత్తేమి కావు
బాల్యమునుండి ఏదో మోతాదులో ,ఏదో రూపంలో
పేదరికం నన్ను వెంటాడుతూనే వచ్చింది
అయినా నేను బెదర లేదు
ఒకప్పుడు అజ్నానం దైర్యాన్నిచ్చేది
ఇప్పట్లో జ్నానం ఓటమి నాతో కుదుర్చుకున్న
కూటమి నేటివరకు కొనసాగుతూనే ఉంది
నాకన్నా సోమరి మరొకడుండడు
నాకన్నా నాస్తికుడు మరొకడుండడు
నా వ్యూహం ఎంతటి లోప భూయిష్ఠమో నాకన్నా నీకే బాగా తెలుసు
అయినా ఇటీవల విజయం అతిథిలా అడుగు పెట్టింది
నా పేదరికం పై ,ఒంటరితనం పై పిడుగులా దిగింది
ఏది ఏమైతేనేం?
మళ్ళీ పాతకథే మొదలైంది
సరస్వతి సాంగత్యంలో నాడు లక్ష్మి దూరమైతే
నేడు సంపదలో సరస్వతి దూరమైంది
అందుకని లక్ష్మి స్థిరవాసానికి పూనుకోలేదు
నాలో ఏలోపం ఉన్నా నా లక్ష్యంలో సున్నా
నా లక్ష్యం వెనుక ఒక దేశం ఉంది
పాలవీథినుండి నేనందుకున్న సందేశం ఉంది
నా లక్ష్యం వెనుక నూట ఇరవై కోట్ల మంది
ప్రజలున్నారు
నా లక్ష్యం కనుక కైవశమైతే
ఈ నూట ఇరవై కోట్ల మంది
స్థూల కోరికలు నెరవేరుతాయి
ఇవి కాక మరొక లోకం ఉంది అని నేను చాటి చెప్పగలను
నా దారి పట్టించగలను
ఆకలితో అలమటిస్తున్నవానికి
అమ్మవు నీకన్నా అన్నమే పరబ్రహ్మం
అమ్మా !
శక్తివి కదా ..నాకు శక్తినివ్వు
ఈ దేశాన సర్వ జనులు
సుఖంగా బ్రతకాలి
అందుకు నా లక్ష్యం నెరవేరాలి
నవ గ్రహాల నడక ఎరింగిన వాడను
వారి ఖర్మ ఫలాలను మరో మార్గములో అనుభవించేలాచెయ్యగలవు
డోంట్ ఒర్రి..
ప్రాణ రక్షణ, కూడు,గూడు,గుడ్డ,సెక్స్ వీటికి గ్రహాల అడ్డును ఎలా తొలగించాలొ నాకు తెలుసు
నాపథకం అమలు కానివ్వు
కాస్త శక్తినివ్వు
నా పై ప్రేమ పై నాకు అనుమానం లేదే
వీరి విజ్నత మీదే నాకు విముఖత ఉంది
అదే ప్రపంచ బ్యాంకు,అదే అగ్ర రాజ్యం అదే మల్టి నేష్నల్ కంపెనీలు నా కొంపను కూడ ముంచేస్తున్నాయి
నా కరుణను సైతం అడుగంటేలా చేసి కంపెత్తిస్తున్నాయి
నా గుండెను
అయినా వీరిలా నేను దిగజారలేదు
నేను వద్దనుకున్న సమాజం
కొరకు సర్దుకు పోతున్నా
చిటికలో నా నమ్మకాలను ఒమ్ము చేసినా
పాములా కాటేసినా
నా చిటికన వేలందించి తీసుకు వెళ్ళాలనే చూస్తున్నా
ఆశిఖరాలకు వైపున..

అమ్మా!
భయమేస్తుందే....

దడగా ఉందే!
నా అద్యయనం పొరభాటేమో?
నావిద్య వీరిముందు పారదాయెనే
వీరి నక్క జిత్తులతో కుక్క చావుకే సిద్దమైనట్టుందే

No comments: