Thursday, August 18, 2011

అస్తమానం నీ నామస్మరణ

అమ్మా అమ్మోరు తల్లి !
నాకు ఈ జనులను అర్థం చేసుకోవడమే కష్ఠమని
జగజ్జననివైన నిన్నర్థం చేసుకోవడం ఎంతో తేలికని
విర్రవీగేవాడ్ని
ఇప్పుడు నిన్నర్థం చేసుకోవడంలోనూ విఫలమయ్యానని అనిపిస్తుంది
గతంలో భవిష్యత్ గాఢాందకారంగా కనిపించేది
భూత ,ప్రేత,పిశాచాల కూత వినిపించేవి
అయితే అస్తమానం నీ నామస్మరణ చేస్తుంటే
వర్థమానం స్వర్గమనిపించేది
ఇప్పుడు భవిష్యత్తు కాస్త ఆశాజనకంగా తోస్తున్నా
మానసికంగా నీకు నేను దూరమై చస్తున్నా
అమ్మా !
అన్నీ దూరమయ్యున్నానీకు దగ్గరైయుంటూ
వీరిని చూసి నవ్వుకునేవాని
ప్రస్తుతం ఏవేవో దగ్గరై నీకు దూరమై నన్ను చూసి నేనే ఏడుస్తున్నా
అమ్మా !
కర్తవ్యం మరిచాను
క్షణిక సుఖాలకు దైనందిన వత్తిళ్ళకు లొంగిపోయాను
ఈ చేయూతకు కారణం నాపట్ల నీలో పుట్టిన కరుణ
ఆ కరుణకు కారణం ఆకలి,దోపిడీల పై నేను చేసిన రణం
ఆ రణం చూసి నా గుండెలోని వ్రణం చూసి చేయూతనిచ్చావు
నేను గాయాలకు చికిత్స చేసుకుంటూ
యుద్దాన్ని మరిచాను
అవును ! నిస్సందేహంగా నేను నీరు గారి పోయాను
నివురు కప్పిన నిప్పునయ్యాను
అవును ! ఏ జీవితాలను చూసి నవ్వుకునే వాడినో
ఆ జీవితమే నా జీవితమైంది

దీనిని నేను అంగీకరించను !
ఓషో అన్నట్లుగా బ్రహ్మచర్యం మరింత కామాందుడ్ని చేసినట్లే
ఈ విరామం నన్ను మరింత ఉత్తేజ పరచినట్టుంది
అమ్మా !
నువ్వు ఆద్యంతరహితవు..
కాని ఈ విషయమై ఆకలి దోపిళ్ళు నీ పై పోటికి దిగుతున్నవి
వీటికీ ఆద్యంతాల్లేవని అనుకుంటున్నారు
అమ్మా !
వీటికి ఆది ఏదో ,అంతం చేసే మార్గం ఏదో నాకు నీవే తెలిపావు
నన్నుసికొలిపావు
హనుమంతుని ముందు కుప్పిగంతుల వలే
నా ప్రయత్నాలేవో చేసాను
వాటికే ముచ్చటేసి ముందుగా నా ఆకలి తీర్చావు
ఆ కలి ప్రభావంతో నేను నీరు కారాను
నివురుకప్పిన నిప్పునయ్యాను

అయితేనేం ఒక్క చిరుగాలితో
బగ్గున మండే అగ్ని గోళాన్నయ్యాను

అమ్మా!
రక్షకులు భక్తులైనప్పుడు
భిక్షకుడనైన నేను రక్షకుడై డైనోజర్ల మీదికి ఈక పుల్లలు విసిరాను

No comments: