Thursday, August 18, 2011

విశ్వ ప్రేమ

అమ్మా అమ్మోరు తల్లి !
నీ ఆట నీది నా ఆట నాది
నీ ఆటకు నేనడ్డు రాను
నా ఆటకు నువ్వడ్డు రాకు
అన్ని ఎన్ని సార్లు చెప్పినా అన్ని సార్లు అడ్డు తగులుతూనే ఉన్నావు

నువ్వు దేవుళ్ళకన్నా ఎక్కువ శక్తి ఉన్నదానివి
ఆ దేవుళ్ళనే కన్నదానివి
నీ ఆటకు నా ఆట అడ్డమని ఎలా అనుకుంటున్నావే
మానవులకే పరిమితమైన ఇన్ఫిరియారిటి కాంప్లెక్స్
దేవతవైన నీకెలా సోకిందే !
కేవలం మానవమాతృడనైన నేను
జగన్మాతవైన నీ జగన్నాటా దృశ్యాలను ఎలా మార్చగలనే
నా దగ్గర్రున్నది ఒకె గుళిక అది విశ్వ ప్రేమ
అన్ని రోగాలకు,సమస్యలకు దీనినే సిఫార్సు చేస్తుంటాను
ఈ అండచరాచర ప్రపంచాల సృష్ఠికర్తవు నువ్వు
నీ నీ స్థానం .. నీ ఆస్థానం
అయినా ఆగదు నా ప్రస్తానం
నీ ఆయుధాలు నీవి
నా ఆయుధం కూడ నీదే
సాధించాలనుకున్నా ఆదర్శమే నా ఆయుధం
నా మరో ఆయుధం
నా అక్షరం
అదే భలీయం.. ఈ క్షణం నా అక్షరమే రెక్కలు గొడికి
హనుమన్నవలే గాలిలో ఎగిరి
తెలుగు వారి గుండెల కిటికీల్లోకి ఓ భ్రమరంలా దూసుకుని పోగలిగితే
హే భ్రమారాంభా !
అప్పుడు చూస్తావులే .... నా ఆయుధపు పదును
అదను చూసి దెబ్బ కొట్టడం కాదే....
కేవలం పేదరికంతో నన్ను గెలవడం కాదే .....
అఖండ ప్రజానీకం మనస్సులు గెలువు
మానవ హృదయాలను స్వర్థపు చీకటి కమ్మేస్తుంటే ...
రాసుకుంటే రవ్వ రాలు నా అక్షరాలు మరో దీపాన్ని స్మరియింప చేయగలవు
ప్రజల గుండెలను తేజోమయం చేయగలవు.

ఈ సత్యం నీకు తెలుస్తే పేదరికంతో
నన్ను కట్టిపడేసేదానివి కావు....
ఏంచెద్దాం !
వీరిలాగే నీవు కూడ నీ విధివ్రాతకు భానిసవి కదా !
అయినా నా ప్రయత్నం ఆగదు
నాటి రుషులు, మహర్షులు వెదజల్లిన
విశ్వపేమను ఈ విశ్వాన వికసింప చెయ్యడమే నా లక్ష్యం
నాకు లేదు ఆయుక్ష్యం
పిండ ప్రవేశ క్షణం నుండి క్షణం క్షణం నా జీవిత గాదను
నువ్వెటు నడుపుకు పోతున్నావో ఓ పొడుపుకథను విప్పినంత తేలికగా తెలుసుకో గలను.
అందుకే సత్యంతో మెలగడం జ్నాన జ్యోతిగా వెలగడం
మొదలు పెట్టాను
చెదలు పట్టిన విదానాలను విరిచి ఆదర్శాలను అమలు చెయ్యించాలని అరచి అరచి అలిసాను
నువ్వు నాలో వెలిసాక
భూత,భవిష్యత్ ,వర్థమానాలు తెలిసాక
ఈ వ్యర్థ మానవుల పరిరక్షణే ద్యేయంగా వీరి ప్రతినిధినై గొంతెత్తి కూస్తున్నాను
నా ఆయువును దార పోస్తున్నాను
అమ్మా !
నా ఆయుధాలు నీవి
నా లక్ష్యాలు నీవి
నీవి కానివి ఏవి
అంతా నీ ఆజ్నా అయినా సడలనివ్వను నా ప్రతిజ్న
ప్రజ్నతోనే చేస్తున్నా ఈ అజ్నాన సమరం
దీంతో కావాలి నా బ్రతుకు అమరం

Note:
నా ఈ కవిత మిమ్మల్ని ఆకట్టుకున్నట్లైతే నా రచనలను మరింత చదవడానికి
ఇక్కడ నొక్కండి
లేదా ఇక్కడా నొక్కొచ్చు

No comments: