Wednesday, August 17, 2011

ఖబడ్దార్ కనకదుర్గ !

అమ్మా అమ్మోరు తల్లీ !
నిన్ను దేవతగా నిరూపించుకోవలసిన అవసరం నీకు లేకున్నా
మానవునిగా నన్ను నేను నిరూపించుకోవలసిన అవసరం నాకుంది.

నీకు నీ దైవత్వం మీద అనుమానం లేకున్నా
నా మానవత్వం పై నాకు అనుమానం ఉంది

మానవ కళ్యాణానికి పూనుకున్న నాకు నువ్వు కాస్త
తోడ్పాటు అందిస్తావనే
ఈ మనుషులను నా సోదరులుగా - నీ బిడ్డలుగా
అభివర్ణించాను.

నాది సాదా సీదా ప్రణాళిక కాదు
గాంథి మహాత్ముడ్ని ఓవర్ టేక్ చెయ్యడమే కాదు
నిన్ను ఓవర్ టేక్ చెయ్యడం కూడ నా ప్రణాళికలోని అంశమే

కౄర మృగాల పై ఊరేగి ఊరేగి నీలో మృగత్వం పెరిగి
కరుణ కరిగి పోయినట్టుంది

అమ్మా అన్న ఒక్క పిలుపుకే నీ సొమ్మంతా దోచి పెట్టే
నీ గుండే బండ బారినట్టుంది

చెదులు పట్టిన మీ కాల,యుగ ధర్మాలే నీ చేతికి
సంకేళ్ళయినట్టుంది

దైవత్వం అంటే మానవత్వం లేకుండటం కాదు..
ఈ మానవుల జీవన్మరణ పోరాటాలు చూసి
అంతా ఎరింగి - ఎఋకతో మందహాసం చెయ్యడం కాదు

అమ్మా .
ఈ మనుషులను నువ్వు నీ బిడ్డలుగా చూడకుంటే ఫర్వాలేదుగాని
నీ ప్రయోగ శాలలో ఎలుకలుగా మాత్రం చూడకే

మీ ప్రళయ ధర్మానికి విరుద్దంగా రూపొందిన నా "మిషన్" కి నీ తోడ్పాటు కోరడమే
నా పొరభాటైతే సారి ! ఇక పోరుభాటే సరి !!

ఏం హనుమన్న రామ నామంతో రాముడ్ని జయించగా లేనిది
నేను నీ నామంతో నీ పై పోరు ప్రకటిస్తే తప్పా?

ఇక నీదారి నీది.. నాదారి నాది

నన్ను డిస్టర్బ్ చెయ్యకు అన్నా చేసి తీరుతావు
కనుక డోంట్ డిస్టర్బ్ మీ బోర్డు పెట్టుకోను

యు కెన్ డిస్టర్బ్ మీ
ఐ డోంట్ వాంట్ టు డిస్టర్బ్ యు..

నువ్వేదో సర్వ సవతంత్రివి అని భ్రమిస్తున్నావు
నువ్వు రూపొందించుకున్న స్క్రిప్టుకు నువ్వు భానిసవు

నా వ్రాతలనైతే మూడో కన్నుతో భస్మం చెయ్యగలవేమో?
నా తలవ్రాతను ఏమీ చెయ్యలేవుగా?

ఈ దిక్కుమాలిన ప్రపంచంలో
నీకున్న ఒక్క గానొక దిక్కును నేనే

మహావిశ్వాసంతో వికసించి - నా ఖర్మ నాశనార్థం నువ్వు
పెట్టిన పరీక్షలతో ఉక్కు ఉక్కై ఉన్న నా గుండెను సైతం
అనుమానపు భ్రమరం తొలిచేలా చేసావు

నేను ఒంటరినేమోనన్న శంఖను నాలోకి సందించేసావు
ఇకనూ సదా బ్రీచ్ ఆఫ్ అగ్రీమెంటుకు పాల్పడే నీతో ఏగలేను

మరో 24గంటల్లో నువ్వు నా రక్షణకు నేను ఈ మానవావళి రక్షణకు
కదం తొక్కాలి

లేదా నన్ను నువ్వు - ఈ మానవావణిని నేను రక్షించే మన ఒప్పందం
తనంతట తానే రద్దవుతుంది. రచ్చవుతుంది.


No comments: