Thursday, August 18, 2011

నాడు నేడు

అమ్మా !
నాడు అన్యాయానికి తలవంచక
ప్రజల దృష్ఠిలో విధివంచితుడనైనా నీ విధి కంచె లోపే నిశ్చింతగా ఉండేవాడ్ని
నేడు న్యాయానికి నిలబడక పిరికిలా పారిపోతూ
నాకు నేను దొరికి పోయి గిల్టితో చచ్చి పోతున్నా
పేదరికం తుఫానులా
నన్ను అతలాకుతలం చేసినా
మరణంతో హలో చెప్పే దమ్ముండేది
నేడు..
వనరులున్నా వాటిని సద్వినియోగం చెయ్యక
లక్ష్య సాధనకు వెచ్చించక
అచ్చం నా సమకాలీనులవలే
మానవత్వానికి సమాధి కడుతున్నా
అమ్మా !
నాకన్నీ కావాలని ఏనాడూ కోరలేదు
నేడూ అంతే ..
కాసిన్ని వనరులు చూపావు
ఈ దేశాం గురించిన నా కలకు
అక్షర రూపం ఇవ్వనీ
ప్రపంచ బిక్షా పాత్ర ఇదని సర్దుకుని
నిస్సత్తువతో నీరుగారిపోవడం కన్నా
దీనిని ప్రపంచ అక్షయ పాత్రగా మలచ గల మార్గం ఒకటుందని
ఆ మార్గాన ఆడుగు ముందుకేస్టే ఆ స్వర్గం దిగి వస్తుందని వివరించనీ..

No comments: