Thursday, August 18, 2011

నాతో వీరికి మిగిలేది నాశనం

అమ్మా అమ్మోరు తల్లి !
ఎటో వెళ్ళి పోతుంది ఈ జీవితం
మరేదీ కాదిందులో శాస్వతం
అయినా ........
ఎటో కదిలి లక్ష్యం వదలి వెళ్ళి పోతున్న జీవితం
పెను భూతమై బెదర కొడుతుంది
అందమైన కలలను చెదర కొడుతుంది
ఎ లెటర్ టు ది గ్రాండ్ ఫాదర్లో మనవడిలా ఉన్న నేను
తాతవు కాకున్నా జగన్మాతవైన నీకు వ్రాస్తున్నా ఈ లేఖ
ఈ మళ్ళింపులతో ఘఠణలు సంఘఠణలు ఎక్కువై
జ్నాపకాల మోత పెరిగి పోయింది

జీవితం , నాకు నేను
గీసి ఉంచిన లక్ష్మణ రేఖను దాటేసుంది
స్వార్థపు డ్రాగులాను వాటేస్తుంది
సర్పంలా కాటేస్తుంది
నాలో దడ పుడుతుంది
ఆత్మ విశ్వాసపు జాడ కనబడటం లేదు

నేననుకున్నంత కాదేమో నవ భారత పున:నిర్మాణం
నేననుకున్నంత తేలిక కాదేమో నా సందేశాన్ని వినిపించటం
అమ్మా నిన్ను తలచుకుంటూ
కమ్మని గేయాలు వల్లించుకుంటూ
గుండెలో తుళ్ళింతలతో తొలకరి చినుకులవంటి
నీ కరుణామృత జల్లులతో తడిసి ముద్దైయ్యేటంతటి
స్వార్థం నా గుండెలో లేదెందుకో

సమ సమాజ సృష్ఠియే ద్యేయంగా సంపూర్ణ నాస్తికత్వంతో
ఫుల్ టైం శ్రమించే నాలో నిస్వార్థం లేదెందుకో?

అమ్మా !
ఈ రెండు గుర్రాల పై స్వారి నా బుర్రెలో వెర్రెక్కిస్తూందే
నేనూ మనిషినే కాదా?
మరి ఇంత పెద్ద గుండెను ఇచ్చినా(కె)వెందుకే?
ఆ గుండెలో నిండుగా వెలసితివెందుకే?

వెలిసావు సరే నన్ను కలిసావు సరే
ఈ మూర్ఖులకు నేను విక్రమార్కుడనన్న సంగతి చెప్పవెందుకే?
ఈ అగుచాట్లు తప్పవెందుకే?

వీరిని ఉద్దరించ వచ్చిన నన్ను చీదరించటం...
చీదరించిన పాపానికి చితికి పోవడం
ఇంతేనా వీరికి నాకు ఉన్న సంబరం

అమ్మా !
నాతో వీరికి మిగిలేది నాశనం
ఒక్కడు సమ సమాజ సృష్ఠికై నేను పొందిన వరం
వీరి అజ్నానంతో వీరు నాకు కల్పించే అవమానాలతో వీరి పట్ల శాపంగా మారిందే

అమ్మా దయ చూడవే !
నేను ప్రజా రక్షకుడ్ని నా చేత ప్రజా భక్షణ చెయ్యిస్తావా?
You might also like:

No comments: