Wednesday, August 17, 2011

సంవాదం

నీవు: నిన్నేమని సంభోధించను ..నువ్వు చండ,ప్రచందులకు తక్కువ, మధు కైటపులకు ఎక్కువ
నేను: రాక్షసులతో కలబడి,కలబడి రాముడంతడి వాడ్ని నన్ను రాక్షసుడంటావా?
నీవు: ఆంత మాత్రం దిగివచ్చినందుకు ఆనందమే
నేను: మరి ఆనందించకు. రామన్న పై కూడ కొన్ని విమర్శలున్నాయి నా మదిలో
నీవు: ఏల మా అందరిని ఆడి పోసుకుంటావు. మరి మావద్దే సాయం అర్థిస్తావు
నేను:నా కార్యానికి మీ కాళ్ళు పట్టడం లేదు. ఇది ప్రజా కార్యం నాకు సాయపడటం మీ కర్మ కాని పూర్తి భాధ్యత నా పై మోపి
మీరు మాత్రం చేతులు ముడుచుకుని కూర్చుంటే ఎలా వదలి పెడ్తాను
నువ్వు:గ్రహం, గృహం,మంత్రం,యంత్రం మంచి చెడ్డ అన్ని చూడాలిగా
నేను:ఇవన్ని మావారి తంతు నాకు సాయ పడటమే మీ వంతు
నీవు:ప్రళయాన్ని ఆపగలవా నీవు
నేను: మీ తడపాట్లు చూస్తుంటే గలననే అనిపిస్తూంది
నీవు: ఏమి ఆపుతావు నీ మొహం
నేను: నీ మొహాన్నే ఆపగలను నా మూడో కంట
నీవు:నీ జెండా ఎగరాలంటే ఎన్నో అజెండాలు మార్చాలి
నేను: మార్చండి. మార్పు లేనిది మార్పొకటే
నీవు:ఇంతకీ నీ డిమాండు ఏమో ఏడువు..
నేను:ఇలా నువ్వడుగుతూనే ఉండాలి అయితే నేనేమి ఆడుగగూడది
నీవు:పోని నీలక్ష్యమేమో అదన్నా ఏడువు
నేను:ప్రపంచపు భిక్ష పాత్రగా తయారైన నా దేశాన్ని అక్షయ పాత్రగా మార్చాలి
నీవు:తద్వారా నీకు ఒరిగేది
నేను:భవిష్యత్తులో నా అభిమాని ఎవడన్నా తంతి తపాలా శాఖా మంత్రి అయితే నా మొఖంతో తపాలా బిళ్ళ విడుదలవుతుంది
నీవు:అదేందో నీ కలంతో సాధించుకోగల అల్ప కోరిక కదా. నా శూలంతో ఏం పని?
నేను:నా కలం అంతగా కదలాలంటే నాకో సైన్యం కావాలి అది ఆకలి దోపిడీల నాశనమే ద్యేయంగా కదలాలి.దాని తాకిడికి ఈ దేశాన్ని పట్టిన వ్రష్ఠు వదలాలి
నీవు:అంతొద్దు ఫీజు పోతుంది
నేను:పోని ..శూలినివై నీవుండి నీకు ప్రతిరూపమైన నా మాతృభూమి పరిరక్షణలో నాకు ఫీజు పోతే నీకు పోయినట్టేగా
నీవు:పిచ్చివాడా దేశ రక్షణ నీ ఒక్కనితో సంభవమా?
నేను:హే శాంభవి ! నీ సాయమే నాకుంటే అసంభవాలను సంభవం చెయ్యడం నాకు సరదా
నీవు:నేను నీకు సాయపడతానని నీకు వరమిచ్చినట్లు నాకు గుర్తు లేదు
నేను:పోనిలే ఇప్పుడిస్తే పోలే
నీవు:ఎప్పటికీ ఇవ్వను
నేను:పోనిలే నీ సాయం తెచ్చుకునే ఉపాయం ఉండే ఉండి ఉంటుంది
నీవు:ఏమిటా ఉపాయం ఇలా వచ్చి రాని బాషలో పిచ్చి పిచ్చిగా గీకడమేనా?
నేను:సంజీవిణి మంత్ర సిద్దులు,రాక్షసగురువర్యుడైన శుక్రాచారి నా జాతకాన వాక్ స్థానంలో ఉండి నా పిచ్చి మాటలకు ప్రాణం పోస్తాడు.పరమోచ్చ స్థితి పొందిన గురుబలంతో నా మాట కాగలదు భావి భారతానికి అభ్యుదయ భాట
నీవు: ఓరి టక్కరి !నీ కలంలో సారా ఉందో, సిరా ఉందో ..
నేను:అయితే నా భుట్టలో పడ్డావన్న మాట. పోనిలే తల్లి బతికించావు. ఇంత మాత్రం నీలో రసికత్వం నీలో ఉందనుకోలేదు..నన్నేదో రాక్షసులకు పోల్చినట్టు గుర్తు వధిస్తే పోలే
నీవు:నీకు నా దర్శన భాగ్యం కలగ కూడదనే ఆగుతున్నా
నేను:పిచ్చి తల్లి నీ దర్శనమే కావాలనుకుంటే నాకు 48 దినములు చాలే .పేదవానికి అతని పళ్ళంలో మూడు పూటలా నువ్వు అన్న పూర్ణేశ్వరివై దర్శనమివ్వాలన్నదే నా డిమాండు. నన్ను వధించటానికి గుండెలు చాలక సాకులు చెభుతున్నావు. నన్ను వధించనొస్తే నాకు నీ దర్శనం కలిగి పోతుందనే గా నీ కుళ్ళు పోని నా కళ్ళు గట్టిగా మూసుకుంటా , నీ ఖడ్గంతో నా తలకాయ కోసుకెళ్ళు హాయిగా..
నీవు:నీలో జ్నాన దీపం వెలిగించింది నీ సుఖ సంతోషాలు నీ ముక్తి కొరకే ఇలా అందరికీ వకాల్తా పుచ్చుకోవడానికి కాదు.
నేను: ఇంత మూర్ఖంగా ఆలోచిస్తావనుకోలేదు. నువ్వు ఒక్క దీపం వెలిగించావు. అక్కడికి నీ పని అయి పోతుంది. ఆ దీపంతో కోటి దీపాలు వెలిగించబడినా నీకొచ్చిన నష్ఠమేమిటే
నీవు: నష్ఠం కాదు. అది అజెండాకు విరుద్దం
నేను:పోనీ నేను సుఖ సంతోషాలతో జీవించి ముక్తి పొందాలన్నది నీ అజెండాలో ఒక భాగమే గా ?
నీవు :అవును
నేను:మరి స్వార్థంతో ముక్తి అసంభవం ఈ పాయింటు నీకు సమ్మతమే గా
నువ్వు:ముమ్మాటికి
నెను:అయితే నేనొక్కడ్ని సుఖ సంతోషాలతో వర్దిల్లి స్వార్థంతో నా మానస సరోవరం కలుషితమై పోతే నువ్వెలా స్థిరవాసం చెయ్యగలవే నా గుండెలో
నీవు: కలిలో కాలుష్యాలకు తట్టుకునేలా తగిన ఏర్పాట్లతో ముస్తాబయ్యాకే వస్తా నీ మానస సరోవరానికి
నేను: సరే ..ముక్తినిచ్చేది నువ్వే కాబట్టి నువ్వెలాకో ఇస్తావు. ఇక భుక్తి కథకొస్తే..
నువ్వన్నట్టే నేను స్వార్థం పెంచి సుఖంగా బ్రతుకుతున్నప్పుడు ఈ దుష్ఠ పాలకుల ఆఠవిక పాలనకు బలై తన ఉనికిని కాపాడుకోవాలన్న తపనతో మానవత్వం మరచి మ్రుగమైన బాధితుడొకడు నా ఇంటి పై పడితే
నీవు:అది అజెండాలో లేదు .. అయినా దేశం కోసం ప్రాణ త్యాగం చేస్తానని విర్ర వీగావు. అప్పుడే ప్రాణం మీద ఇంత తీపా..
నేను: అమ్మా నేను నా దేశం కోసం మరణిస్తే ఆ మరణ మ్దంగం వెనుక మానవత్వం ద్వనిస్తుంది. మరి నా సోదరుడే నా ఇంటి పై పడినప్పుడు నేనతన్ని చంపినా మానవత్వం మంట కలుస్తుంది ..ఆ పెనుగులాటలో నా ప్రాణం పోతే మానవత్వం బగ్గున కాలి బూడిదే అవుతుంది .. నా సమకాలీనులు ఈ సంఘఠణను కేవలం బ్యేనర్ వార్తగా చూసి మర్చి పోవచ్చు .. కాని నేను కలలుకనె నవ భారతం ఆవిర్భవించాక భావితరం నన్ను క్యేనిబల్ గా నిర్దారిస్తుంది. ఆ నిర్ధారణ నాకు కాదు నీకు చంప పెట్టువంటిది
నీవు:నేను సృష్ఠి కర్తను
నేను:పిల్లలు తల్లి తండ్రుల భానిసలు కారు. తల్లితండ్రులు పిల్లలను ఈ లోకానికి రానిచ్చిన ముఖద్వారాలు మాత్రమే..స్వేచ్చ నా జన్మహక్కు . దానిని ఎవరి కొరకూ చివరికి నీ కొరకు సైతం వదులు కోను.
నీవు:బిడ్డా..అహం బ్రహ్మస్మి అన్న మాటకు ప్రాణం పోసావు.సర్వ స్వతంత్ర్యాయై నమ: అని నన్ను స్తుతించి స్తుతించి యధ్భావం తధ్భవతి అన్నట్టుగా తయారయ్యావు.ఇక నీకు నాకు బేదాల్లేవు. అన్నీ నీలో ఉంటాయి నాతో సహా
నేను: త్యాంక్స్ అమ్మా.. అమృత సేవనంతో నిత్య యవ్వన సంభూతురాలివయ్యావు కాబట్టి ఎన్ని యుగాలు గడిచినా నిన్ను వృద్దాప్యం,జఠత్వం స్పర్సించలేదు. అందుకే మన మద్య జెనరేషన్ గ్యేప్,కమ్యూనికేషన్ గ్యేప్ రాలేదు.అర్థం చేసుకోగలిగావు. అంతే చాలు ..ఓం శక్తి.

No comments: